»   » పవన్ మళ్ళీ వెనకడుగేస్తున్నాడు... 26 న అభిమానులకు నిరాశే

పవన్ మళ్ళీ వెనకడుగేస్తున్నాడు... 26 న అభిమానులకు నిరాశే

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు ఇప్పటికే టాక్ ఆఫ్ ది టాలీవుడ్. పవర్ స్టార్ మూవీ.. అందులోనూ పవర్ ఫుల్ ఫ్యాక్షన్ యాక్షన్ ఎంటర్టెయినర్ గా వస్తున్న ఈ మూవీపై అంచనాలు చాలానే ఉండగా.. న్యూ ఇయర్ ముందునుంచే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టి వరుసగా పోస్టర్లు రిలీజ్ చేస్తూ వచ్చారు. కొత్త సంవత్సరం కానుక ని టీజర్ రూపం లో ఇస్తామంటూ ప్రకటించింది. కానీ, న్యూ ఇయర్ రోజు కూడా అభిమానులకు కొత్తగా ఏమీ అందలేదు. మళ్ళీ సంక్రాంతికే టీజర్ అన్నారు. అదీ జరగలేదు.

దానిని గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న గుడ్ న్యూస్ అంటూ చెప్పారు.కానీ ఇప్పుడు అదీ జరగటం లేదు. జనవరి 26న కూడా టీజర్‌ను విడుదల చేయట్లేదు చిత్ర యూనిట్. కొన్ని అనివార్య కారణాల వల్ల టీజర్‌ను విడుదల చేయలేకపోతున్నట్టు శరత్ మరార్ ప్రకటించాడు. అయితే.. దానికి కారణాలు మాత్రం అతడు వెల్లడించలేదు.

Pawan Katamarayudu Teaser Release Date Postponed

ఏపీ ప్రత్యేక హోదా కోసం జనవరి 26నే విశాఖ ఆర్కే బీచ్‌లో ఆందోళన కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటున్నందునే టీజర్ విడుదలను వాయిదా వేసినట్టు చెబుతున్నారు. జనవరి 26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీచ్ సిటీ అయిన వైజాగ్ లో విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం మౌన పోరాటం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పోరాటం ప్రశాంతంగా కొనసాగిస్తానంటే.. దీనికి జనసేన పార్టీ మద్దతు ఉంటుందని స్వయంగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ సాక్షిగా ప్రకటించాడు. ఆ రోజు పోరాట కార్యక్రమంలో పవన్ బిజీగా ఉంటాడు.. అలాగే విద్యార్ధులు కూడా బిజీగా ఉంటారు కాబట్టి.. ఇక టీజర్ రిలీజ్ చేస్తే నైతికంగా బాగోదనిపించి.. క్యాన్సిల్ చేశారట. మరి, ఆ తేదీ పోతే మరెప్పుడు పవన్ అభిమానులకు ఆనందాన్ని పంచుతాడో చూడాలి.

English summary
According to Buzz, The teaser of Power Star Pawan Kalyan‘s most awaited flick ‘Katamarayudu‘ has postponed for the protest ‘AP Demands Special Status’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu