»   » పవన్ కళ్యాణ్ కూడా ‘వాస్తు’ నమ్ముతారా?

పవన్ కళ్యాణ్ కూడా ‘వాస్తు’ నమ్ముతారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ పరిశ్రమలో సెంటిమెంట్లను నమ్మే వారు చాలా మందే ఉన్నారు. లక్కు కోసం లక్కీ నెంబర్స్ మీద ఆధార పడటం, పేర్లలో అక్షరాలు మార్పులు చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. అన్నింటికంటే ముఖ్యంగా వాస్తును నమ్మడం ఇందులో ఒకటి. ఈ లిస్టులో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే కాలనీలో ఉన్న నివాసం పర్‌ఫెక్టు వాస్తుతో ఉందని, అందు వల్లే తన ఖాతాలో గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి హిట్ చిత్రాలు పడ్డాయని నమ్ముతున్నారు. తాజాగా ఆయన ఇల్లు మారాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఇల్లు ఆఫీసు ఏర్పాటుకు ఇరుకుగా ఉండటంతో విశాలంగా ఉండే వేరే ఇంటి కోసం వెతుకుతున్నారు. ఆ ఇల్లు వాస్తు ప్రకారం పర్ ఫెక్టుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారట. గతంలోనూ ఆయన తన ఇంటిని వాస్తు సరిగా లేని కారణంగా కొంత కూల్చేసి మార్పులు చేయించుకున్న సంగతి తెలిసిందే.

Pawan Looking For Vastu House?

పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్' విషయానికొస్తే...
‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గట్స్...గన్స్ అండ్ లవ్ అంటూ పవన్ కళ్యాణ్ రెండు చేతులతో గన్స్ పేలుస్తూ విడుదలైన పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ కు చెందిన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్', అతని స్నేహితుడు శరత్ మరార్‌కు చెందిన ‘నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ రెండు సంస్థలకు సంబంధించిన లోగోలతో పాటు ఈరోస్ సంస్థ లోగో కూడా ఫస్ట్ లుక్ పోస్టర్లో ఉంది.

ఈ చిత్రానికి కెఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. జైనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో కథానాయిక పాత్రలో పవన్ ప్రియురాలిగా కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు సమాచారం. గతంలో ఈ సినిమాకు అనీషా ఆంబ్రోస్ అనుకున్నారు. సినిమా ప్రారంభం కాక ముందే ఆమెను పక్కకు తప్పించారు. ఇపుడు కాజల్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ విషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది.

English summary
Pawan Kalyan is back to hunting a new house. But, it should have good Vasthu.
Please Wait while comments are loading...