»   » పవన్, ఎన్టీఆర్, మహేశ్‌కు దారుణంగా అవమానం.. ఏం జరిగిందంటే..

పవన్, ఎన్టీఆర్, మహేశ్‌కు దారుణంగా అవమానం.. ఏం జరిగిందంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో అగ్రనటులైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రిన్స్ మహేశ్‌బాబు నటించిన చిత్రాలకు కలెక్షన్ల వర్షం కురవడం సహజమే. ఫ్యాన్ ఫాలోయింగ్ బట్టి చూస్తే వారికుండే క్రేజ్ ఏంటో స్పష్టమవుతుంది. సినిమా టాక్ ఎలా ఉన్నా తొలివారంలోనే మంచి వసూళ్లను రాబడుతాయి. అందుకే ముహూర్తం షాట్ కొట్టగానే ఫ్యాన్సీ రేట్లకు బిజినెస్ అవుతుంది. ఇదంతా స్థానికంగా జరిగే హంగామా. అయితే పవన్, మహేశ్, ఎన్టీఆర్ సినిమాలను ఓవర్సీస్‌లో కొనుగోలు చేయడానికి డిస్టిబ్యూటర్లు రావడం లేదనే విషయం షాకింగ్ గురిచేస్తున్నది. అందుకు కారణం ఇదే..

100 కోట్ల బడ్జెట్‌తో జైలవకుశ

100 కోట్ల బడ్జెట్‌తో జైలవకుశ

జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తూ నటిస్తున్న చిత్రం జై లవకుశ. ఈ చిత్రాన్ని యంగ్ టైగర్ సోదరుడు కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తున్నారు.

భారీ రేటుకు వెనకంజ వేసిన డిస్టిబ్యూటర్లు

భారీ రేటుకు వెనకంజ వేసిన డిస్టిబ్యూటర్లు

జై లవకుశ చిత్రానికి సంబంధించిన బిజినెస్ స్థానికంగా బాగానే జరుగుతున్నట్టు తెలుస్తున్నది. అయితే ఓవర్సీస్ బిజినెస్‌కు అంతగా స్పందన రావడం లేదనేది తాజా సమాచారం. ఈ చిత్రానికి దాదాపు రూ.15 కోట్లకు పైగా ధరను ఆఫర్ చేయగా డిస్టిబ్యూటర్లు వెనక్కి తగ్గినట్టు సమాచారం. అయితే ఓవర్సీస్ పంపిణీదారులు ఆసక్తి చూపకపోవడంతో ధరను రూ.14 కోట్ల మేరకు తగ్గించినట్టు సమాచారం.

నత్త నడకన పవన్ సినిమా బిజినెస్

నత్త నడకన పవన్ సినిమా బిజినెస్

ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రానికి కూడా ఓవర్సీస్ బిజినెస్ నత్త నడకన నడుస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన నైజాం, ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాలకు భారీ ధరకే అమ్మినట్టు వార్తలు వచ్చాయి. ఓవర్సీస్ రేటును భారీగా చెప్పడంతో డిస్టిబ్యూటర్లు ఆలోచనల్లో పడ్డారట.

భారీ రేటుకు బెదిరిన పంపిణీదారులు

భారీ రేటుకు బెదిరిన పంపిణీదారులు

పవన్, త్రివిక్రమ్ ఇప్పటికే రెండు హిట్లను అందించి హ్యాట్రిక్ సిద్ధమవుతున్నారు. ఈ కాంబినేషన్‌కు భారీ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్మాత ఫ్యాన్సీ రేట్‌ను కోట్ చేశారట. ఓవర్సీస్ పంపిణీ హక్కులను రూ.20 కోట్లకు బేరం పెట్టారట. అంత రేటుకు ఓవర్సీస్ రైట్స్‌ను తీసుకోవడానికి డిస్టిబ్యూటర్లు వెనక్కి తగ్గినట్టు సమాచారం.

హాలీవుడ్ ప్రమాణాలకు స్థాయి..

హాలీవుడ్ ప్రమాణాలకు స్థాయి..

ప్రిన్స్ మహేశ్‌బాబు, మురుగదాస్ కాంబినేషన్‌లో స్పైడర్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ఫస్ట్‌లుక్‌కు మంచి ప్రేక్షకాదరణ పొందింది. అయితే ఈ చిత్ర విడుదల తేదీ వాయిదాల మీద వాయిదా పడుతున్నది. ఈ చిత్రాన్ని రూ.100 కోట్లకుపైగా బడ్జెట్‌తో అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నారు. బాహుబలి చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేయడం గమనార్హం.

 మహేశ్‌కు ఓవర్సీస్‌లో అంత లేదట..

మహేశ్‌కు ఓవర్సీస్‌లో అంత లేదట..

ఈ నేపథ్యంలో ప్రిన్స్ స్పైడర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టెక్నికల్‌గా, యాక్షన్ పరంగా జోష్ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో ఆ క్రేజ్‌ను సొమ్ము చేసుకోవడానికి రూ.25 కోట్ల ఓవర్సీస్ రేట్‌ను చెప్పారట నిర్మాత. వాస్తవానికి మహేశ్‌కు ఓవర్సీలో మార్కెట్ అంతగా లేదనేది డిస్టిబ్యూటర్ల వాదన.

జోరుగా బేరసారాలు..

జోరుగా బేరసారాలు..

ఈ మూడు చిత్రాలకు సంబంధించిన ఓవర్సీస్ బిజినెస్ చర్చల స్థాయిలో ఉందట. ప్రస్తుతం రేటు విషయంపై ఇరువర్గాల మధ్య బేరసారాలు జరుగుతున్నాయనేది తాజా సమాచారం. స్టార్ హీరోలు కావడంతో ఏదో స్థాయిలో ఒక పాయింట్ వద్ద ఇరువర్గాలు రేటుపై అవగాహనకు రావడం ఖాయం. అయితే ఏ రేంజ్‌లో ధర సెట్ అవుతుందో తెలుసుకోవాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

English summary
Pawan, Mahesh, NTR's movie not getting good respone in Overseas market. Pawan is playing software engineer in unnamed movie under Trivikram direction. NTR acting in Jai lavakusha, Prince Mahesh is working with director AR Murugadoss for Spyder movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu