»   » ఫ్యామిలీ నుండి...పవన్ కళ్యాణ్ ఒక్కడే మిస్సవుతున్నాడు!

ఫ్యామిలీ నుండి...పవన్ కళ్యాణ్ ఒక్కడే మిస్సవుతున్నాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంక్రాంతి పండగను మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి బెంగుళూరులోని ఫాం హౌస్ లో సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, శిరీష్ సహా మెగా ఫ్యామిలీ సభ్యులంతా పండగని ఇక్కడే ఎంజాయ్ చేయబోతున్నారు.

అయితే ఈ ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌లో పవన్ కళ్యాణ్ మాత్రం మిస్సవుతున్నాడట. అందుకు కారణం ఆయన నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం షూటింగే. పండగ రోజు కూడా షూటింగ్ యదావిధిగా కొనసాగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. సో... పవన్ కళ్యాణ్ బెంగుళూరులో జరిగే సంక్రాంతి వేడుకలో పాల్గొనడం లేదన్నమాట!


పవన్ కళ్యాణ్ తో పాటు ఈ సినిమాకు పని చేస్తున్న మిగతావారు కూడా పండగ సంబరానికి దూరం కావాల్సి వస్తోంది. ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. జనవరి 5న మొదలైన ఈ షూటింగ్ ఈ నెల చివరి వారం వరకు ఇక్కడే జరుగనుంది.


Pawan missing mega family Sankranthi celebrations

కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.... పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. పవనకల్యాణ్‌ సరసన కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. పవనకల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైనమెంట్‌ ప్రై.లి, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి నేతృత్వంలో రూ.5 కోట్ల వ్యయంతో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ సెట్ ఒక ఏరియాలా ఉంటుందని టాక్. 20 రోజులపాటు ఇక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. తెలుగు సినిమా చరిత్రలో భాగా ఖర్చు పెట్టిన సెట్లలో ఇదీ ఒకటిగా పేర్కొంటున్నారు.

English summary
The Mega Family are gearing up for the Sankranthi festival and are planning to celebrate the festival in a farm house at Bengaluru. But Pawan missing mega family on Sankranthi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu