»   » పవన్ కొట్టాడన్న వార్తలపై నోరువిప్పిన షకలక శంకర్ : అసలేమైందంటే...

పవన్ కొట్టాడన్న వార్తలపై నోరువిప్పిన షకలక శంకర్ : అసలేమైందంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

జబర్దస్త్ లో కనిపించటం కనిపించటమే మెగా ఫ్యాన్ అనే ముద్ర వేసుకున్నాడు షకలక శంకర్ నిజానికి కమేడియన్ గా ఎంత పాపులరో పవర్ స్టార్ ఫ్యాన్ గా కూడా అంతే పాపులర్ అయ్యాడు షంకర్. ఆ అభిమానం వల్లే సర్దార్ గబ్బర్ సింగ్ చేసే సమయం లో పవన్ సినిమాకి నాగబాబు రికమండ్ చేసాడనీ, పవన్ తన సినిమాలోకి తీసుకున్నాడనె చెప్పుకున్నారు .

అయితే ఆ షూటింగ్ టైమ్ లోనే షకలక శంకర్ మీద పవన్ చెయ్యి చేసుకున్నాడంటూ వార్తలు వచ్చాయి. సమయానికి రాకపోవటమూ, సెట్లో అందరి మీదా సెటైర్లు వేస్తూ చికాకు పెట్టటమూ పవన్ కు కోపం తెప్పించిందనీ... అందుకే షకలక శంకర్ ని పిలిచి వార్నింగ్ ఇవ్వటమే కాదు సెట్స్ లోనే చెయ్యి చేసుకున్నాడనీ వచ్చిన వార్తల మీద శంకర్ స్పందించాడు. పవన్ తనను కొట్టాడూ అన్న మాట ఉత్త పుకారే అనీ. అసలు పవన్ ఏవరినైనా వెరే వాళ్ళు తిడితేనే సహించలేడు అలాంటిది నన్నుకొట్టటమేమిటి అంటూ ఎదురు ప్రశ్నించాడు... తాజా ఇంటర్వ్యూ లో షకలక శంకర్ చెప్పిన విషయాల్లోంచి....

Pawan never slapped me: says Shakalaka Shankar

''అన్నమయ్యను వెంకటేశ్వర స్వామి వారు కొట్టారంటే నమ్ముతారా? రామదాసును రాముడు కొట్టారంటే నమ్ముతారా? ఇదీ అంతే. వాటిని ఎలా నమ్మరో.. నన్ను పవన్ కొట్టారనడాన్ని నమ్మొద్దు. ఎందుకంటే ఆయన రాముడైతే.. నేను రామదాసును. ఆయన వెంకటేశ్వర స్వామైతే నేను అన్నమయ్యను. ఆయన దేవుడైతే నేను భక్తుణ్ణి. దేవుడికి కోపమొస్తే భక్తుడి మీదే అరుస్తాడు. దేవుడికి ఏమనిపించినా.. భక్తుడిమీదే చూపిస్తాడు. నాకు, పవన్‌ గారికీ ఉన్న అనుబంధం అలాంటిదే.

ఈ జీవితం ఉన్నంతవరకు ఆయనే నా దేవుడు. అన్నమయ్య మీద దేవుడికి కోపం రాలేదా? ఇన్నాళ్లు లాలించావు, పాడించావు.. అప్పుడే వెళ్లిపోతానంటావేంటి? అంటూ ఈ భక్తులు మా మాటలు వినరు.. మేమే వారి మాట వినాలి అని వెంకటేశ్వరస్వామి కోపపడడా? దానిని కోపమంటారా? లేదంటే.. ప్రేమంటారా?

నేను ఆయనతో సంవత్సరం పాటు సర్దార్ షూటింగ్‌లో ఉన్నాను. కానీ, ఆయనది చీమకు కూడా హాని చేయనటువంటి మనస్తత్వం. అలాంటి వ్యక్తి భక్తుడిని ఎలాగంటారు? ఎవరి మీదైనా కోప్పడితే.. ఆయనే తట్టుకోలేరు. ఆయనకు ఒక్క వ్యాపకమా? వంద వ్యాపకాలు, వంద పనులు, వంద రకాల పనులు. వాటిలో పడి ఓ మాట అంటారు.. కసురుతారు.

ఆయనేమైనా అంటే మనమే సర్దుకుపోవాలి. ఆఫ్టర్ఆల్ మనమెవరం? నేను ఓ కేరెక్టర్ చేయడానికే వెళ్లాను. ఆయనంటే ఇష్టం అంతే. కానీ, ఆయన అలా కాదు కదా. ఆయన్ను అభిమానించే వాళ్లు నాలోంటోళ్లు ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. పవన్ ఏ ఒక్కరి సొత్తు కాదు. అందరికీ సమానం.

ఆయన నాకే సొంతం.. నా దేవుడే అంటే కుదరదు. ఆయన నా భుజం మీద చెయ్యేసి, కళ్లలోకి చూస్తూ.. నేనంటే ఎందుకురా నీకంత ఇష్టం? అని అడిగారు. దానికి నేనేం చెప్తాను. ఆయన నాకు దేవుడు. నేను భక్తుణ్ణి అంతే'' అని చెప్తూ పవన్ కి తానిచ్చే విలువ ఏమిటో ఆ షూటింగ్ లో జరిగిందేమిటో చెప్పకనే చెప్పాడు శంకర్.

English summary
"Pawan Kalyan is God for me and everyone knows how much I admire him. He personally called me and gave me this role," said Shankar
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu