»   » షాకయ్యే మ్యాటర్ ,కొత్త పోస్టర్స్ తో :'సర్దార్' లో పవన్ ఇంట్రడక్షన్, సాంగ్ ప్లేస్ మెంట్స్

షాకయ్యే మ్యాటర్ ,కొత్త పోస్టర్స్ తో :'సర్దార్' లో పవన్ ఇంట్రడక్షన్, సాంగ్ ప్లేస్ మెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒక్కో సినిమా స్క్రీన్ ప్లే ఒక్కో విధంగా ఉంటుంది. అలాగే పవన్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ స్క్రీన్ ప్లే ని కూడా పవన్ స్పెషల్ గా డిజైన్ చేసారు. జాని చిత్రం తర్వాత చాలా కాలం గ్యాప్ తర్వాత పవన్ స్క్రిప్టు రాసిన ఈ చిత్రం గురించి ఓ షాకింగ్ విషయం బయిటకు వచ్చింది.

అది మరేదో కాదు.. పవన్ ..సినిమా ప్రారంభమైన మొదటి ఇరవై నిముషాలు కనిపించడు. అప్పటివరకూ విలన్, రతన్ పూర్ సెటప్, అక్కడ ప్రజల కష్టాలు, హీరోయిన్ ఇంట్రడక్షన్..ఇలా సాగుతాయి. సరైన టైమ్ లో పవన్ ఎంట్రీ ఇచ్చి ఓ పది నిముషాలు పాటు అదరకొట్టనున్నట్లు తెలుస్తోంది.


Also Read: షాకింగ్ కామెంట్: పవన్ కళ్యాణ్ ఓ జోకర్.... 'సర్దార్'చూడను!


ముఖ్యంగా పవన్ ఇంట్రడక్షన్ సీన్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. మొదట ఎర్ర టవల్ ఎగురుకుంటూ రావటం..ఆ వెంటనే గుర్రం, ఆ కొద్ది క్షణాల్లో పవన్ రివీల్ అవ్వటం జరుగుతాయంటున్నారు. ఫస్టాఫ్ పూర్తి పంచ్ డైలాగులతో,సెకండాఫ్ ఫన్ మిక్సెడ్ యాక్షన్ తో సాగుతుందని చెప్తున్నారు.


ఈ చిత్రం గురించి మరిన్ని కొత్త సంగతులు,కొత్త ఫొటోలతో


అందమైన ప్రేమ కథ

అందమైన ప్రేమ కథ

ఈ సినిమాలో అందమైన ప్రేమ కథ ఉంది..కాజల్ యువరాణిగా కనిపిస్తుంది. అయితే ఆమె స్క్రీన్ టైమ్ తక్కువని తెలుస్తోందివన్ మ్యాన్ షో

వన్ మ్యాన్ షో

ఈ సినిమా పూర్తిగా వన్ మ్యాన్ గా , సర్దార్ గబ్బర్ సింగ్ చేసే విన్యాసాలతో సాగుతుంది.క్లైమాక్స్ లో

క్లైమాక్స్ లో

పవన్ పాడిన పోతురాజు సాంగ్ సినిమా క్లైమాక్స్ లో వస్తుంది.ఇంటర్వెల్ సాంగ్

ఇంటర్వెల్ సాంగ్

ఆడేవాడన్నా ఎవడేవాడన్నా సాంగ్ ఇంటర్వెల్ పార్ట్ లో వస్తుందిఫెరఫెక్ట్ ప్యాక్..

ఫెరఫెక్ట్ ప్యాక్..

ఈ సినిమాలో చాలా సీన్లు మాస్ ని టార్గెట్ చేస్తూ డిజైన్ చేసారు. ఫ్యాన్స్ పండుగ చేసుసునే సీన్స్ అవిమంచి రెస్పాన్స్

మంచి రెస్పాన్స్

ఇప్పటికే రిలీజ్ అయిన సర్థార్ గబ్బర్ సింగ్ ఆడియోకి, ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ఇదే ఉపుమీద ఏప్రిల్ 8న సినిమా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.


హ్యాగోవర్ లో

హ్యాగోవర్ లో

పవన్ ఎలా ఉండబోతున్నాడో మొన్న ట్రైలర్ లో ఒక రేంజులో చూపించేశారు. అభిమానులు కూడా ఆ హ్యాంగోవర్ తోనే ఉన్నారు.


వన్ మినిట్

వన్ మినిట్

ట్రైలర్ లో కూడా పవన్ కళ్యాణ్ తన మార్కు కిక్ ఇవ్వడానికి ఏకంగా ఒక నిమిషం తీసుకున్నాడు.ముందే హింట్ ఇచ్చేసాడు

ముందే హింట్ ఇచ్చేసాడు

పవన్ లాంటి పెద్ద హీరో సినిమా ట్రైలర్ లో అసలు హీరో కనపబడకుండా ఒక నిమిషం పాటు ట్రైలర్ ను ఇతర ఆర్టిస్టులతో నడిపించి.. అప్పుడు హీరో ఎంట్రీ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం. అయితే ఇలా కావాలనే చెశారట.భారీ బ్యాంగ్

భారీ బ్యాంగ్

సినిమాలో కూడా పవన్ ఎంట్రీ ఇంతకంటే భారీ ల్యాగ్ ఉండబోతోంది. పవన్ ఎంట్రీ ఇచ్చాక మాత్రం సినిమా పరిగెత్తుతూంటుంది.హైలెట్..

హైలెట్..

గబ్బర్ సింగ్ లో హైలెట్ ఎపిసోడ్ ఏమిటీ అంటే అంత్యాక్షరి ఎపిసోడ్. ఈ విషయాన్ని పవన్ సైతం దృష్టిలో పెట్టుకుని ఓ సర్పైజ్ ప్యాకేజ్ ('చిరు సినిమాక్షరి') ని సినిమాలో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.


డాన్స్..

డాన్స్..

చిరంజీవి సూపర్ హిట్ సాంగ్స్ కి పవన్ స్టెప్స్ వేయటం. వాటిల్లో హైలెట్ వీణపాట స్టెప్ అని తెలుస్తోంది.


పంచ్ లు సైతం..

పంచ్ లు సైతం..

అంతేకాదు కొన్ని పాపులర్ చిరంజీవి పంచ్ డైలాగ్స్ ని పవన్ ఈ సినిమాలో పలకనున్నారు.


పెద్ద ఎపిసోడే

పెద్ద ఎపిసోడే

దాదాపు పదిహేను నిముషాలు పైగా సాగే ఈ ఎపిసోడ్ సెకండాఫ్ లో వస్తుందని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లో చిరంజీవి పాటలకు డాన్స్ లు, స్టెప్స్, పంచ్ డైలాగులు తో కేక పెట్టించనున్నారని సమాచారం.అదే క్యారక్టరైజేషన్

అదే క్యారక్టరైజేషన్

గుండెలనిండా ధైర్యమే కాదు... మనసు నిండా ప్రేమ కూడా ఉన్నోడు సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌.పోలీసు కదా అని...

పోలీసు కదా అని...

సర్దార్ ఎప్పుడూ గన్నులతోనే గడుపుతుంటాడనుకొంటే పొరపాటు. అప్పుడప్పుడు జున్ను లాంటి అమ్మాయిలతోనూ సరసాలు ఆడుతుంటాడు. విలన్ లపై తూటాలు పేల్చిన సర్దార్‌ ఇప్పుడు ఓ అందమైన అమ్మాయితో ఆడిపాడి రిఫ్రెష్ అవుతాడు. అదే లక్ష్మీ రాయ్ సాంగ్.ప్రత్యేకంగా

ప్రత్యేకంగా

మెగా ఎపిసోడ్ కోసం పవన్ ప్రత్యేకంగా ఓ టీమ్ ని ఏర్పాటు చేసిన దాదాపు రెండు నెలలపాటు వర్క్ చేసినట్లు తెలుస్తోంది.ఎక్కువ ఇన్ పుట్స్

ఎక్కువ ఇన్ పుట్స్

ఈ ఎపిసోడ్స్ లో ఎక్కువ ఇన్ పుట్స్ పవన్, దర్శకుడు బాబీ ఇచ్చారని తెలుస్తోంది. పవన్ సైతం చాలా ఉషారుగా ఈ ఎపిసోడ్ డిజైన్ చేసారని సమచారంట్రైనింగ్

ట్రైనింగ్

ఈ ఎపిసోడ్ లో చిరంజీవి స్టెప్స్ వేసేందుకు ఓ కొరియోగ్రాఫర్ తో ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు చెప్తున్నారు.ట్రైడ్ మార్క్

ట్రైడ్ మార్క్

పవన్ కళ్యాణ్ తన ట్రేడ్ మార్క్ మ్యానరింజం ని చిరంజీవి డైలాగులకు మిక్స్ చేయనున్నారుహైలెట్

హైలెట్

ఈ ఎపిసోడ్ లో వీణ స్టెప్ తో పాటు, చిరంజీవి ఘరానా మొగుడులో చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో అనే మ్యానరిజం హైలెట్ అవుతుందంటున్నారు.జబర్దస్త్ బ్యాచ్

జబర్దస్త్ బ్యాచ్

ఈ ఎపిసోడ్ లో పవన్ తో పాటు జబర్దస్త్ బ్యాచ్ కూడా ఉంటుందని అంటున్నారు.కాజల్ సైతం

కాజల్ సైతం

ఈ ఎపిసోడ్ లో హీరోయిన్ కాజల్ పై కూడా ఓ సాంగ్ బిట్ ఉందని అంటున్నారు. చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ ని మిక్స్ చేసి వదలుతారుకొండవీటి రాజా

కొండవీటి రాజా

అలాగే చిరంజీవి సూపర్ హిట్ కొండవీటి రాజా లోని నా కోక బాగుందా పాట కూడా ఉంది.ఒప్పుకోలేదు

ఒప్పుకోలేదు

అంత్యాక్షరి లాంటి ఎపిసోడ్ కావాలని చెప్పినప్పుడు రకరకాల ఆలోచనలు టీమ్ ఇచ్చింది. అందులో ఇది ఒకటి. దీనికే టీమ్ మొత్తం ఓటేసింది. అయితే ఇందుకు మొదట పవన్ ఒప్పుకోలేదు. కానీ తర్వాత ఒప్పించారు


పండుగే

పండుగే

ఈ ఎపిసోడ్ ..చిరంజీవి కి తను ఇచ్చే ట్రిబ్యూట్ గా ఉంటుందని, మెగాభిమానులు ఆనందించే ఎపిసోడ్ అవుతుందని వినపడుతోంది


చిరంజీవి విని

చిరంజీవి విని

ఈ ఎపిసోడ్ గురించి చిరంజీవి కు చెప్పగానే నవ్వి, మంచి పాటలతో డిజైన్ చేయమని చెప్పినట్లు సమాచారం.ఫన్ తో

ఫన్ తో

ఈ ఎపిసోడ్ లో ఎక్కువగా ఫన్ కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్లు సమాచారం. అలాగని ఎక్కడా కూడా ఆ పాటలు డీ గ్రేడ్ కాకూడదని స్ట్రిక్ట్ గా చెప్పి చేయిస్తున్నారు.ఫలితం

ఫలితం

ఈ ఎపిసోడ్ చేయటం వల్ల పవన్, చిరంజీవి ఒకటే అన్న ఆలోచన జనాల్లోకి వెళ్తుంది. అన్నదమ్ముల మధ్య విభేధాలు లేవనేది స్పష్టం చేసినట్లు ఉంటుంది.


రిపీట్ ఆడియన్స్

రిపీట్ ఆడియన్స్

ఇలాంటి ఎపిసోడ్ వల్ల ఒకటికి నాలుగుసార్లు రిపీట్ ఆడియన్స్ వచ్చి చూస్తూంటారు. అది భాక్సాఫీస్ కు బాగా ప్లస్ అవుతుంది.స్పెషల్ కామెడీ వద్దు

స్పెషల్ కామెడీ వద్దు

సినిమాలో ప్రత్యేకమైన కామెడీ వద్దని, రొటీన్ పంచ్ డైలాగులు అసలు వద్దని, సినిమాలో భాగంగా వచ్చే ఫన్ నే బాగా చేయాలని పవన్ నిర్ణయించుకునే స్క్రిప్టు డిజైన్ చేసారు.భారీగా

భారీగా

ఈ చిత్రానికి ఆడియో పంక్షన్ ని భారీగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఎన్నడూ లేని విధంగా

ఎన్నడూ లేని విధంగా

గతంలో ఎన్నడూ లేని విధంగా తన చిత్రం షూటింగ్ స్పాట్ లో సెలబ్రెటీలతో సెల్ఫీ లు తీసి వదలటానికి ఫర్మిషన్ ఇచ్చారు.సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ డేట్

సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ డేట్

ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం నవంబర్ 18, 2015న విడుదల అవుతోంది.హార్స్ మేళా

హార్స్ మేళా

'హార్స్‌ మేళా' పేరుతో గుర్రాలపై షూటింగ్‌ చేసారు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం కోసం.భారీగా..

భారీగా..

ఈ మేళాలో వంద గుర్రాలు, వంద మంది అశ్వికులు, 40 మంది చిత్రానికి సంబంధించిన ప్రధాన తారగణం, అలాగే వెయ్యిమంది జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొనగా మూడు యూనిట్స్‌తో 'హార్స్‌మేళా' సన్నివేశాలను అత్యంత భారీగా చిత్రీకరించారు.


సాంగ్స్ హిట్

సాంగ్స్ హిట్

ఇప్పటికే రిలీజైన దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు సూపర్ హిట్టయ్యాయి.హిందీలోనూ

హిందీలోనూ

ఈ సినిమా పవన్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా భారీగా విడుదల అవుతోంది.కాంబినేషన్

కాంబినేషన్

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. కాజల్‌ హీరోయిన్. రాయ్‌లక్ష్మీ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శరత్‌ మరార్‌ నిర్మాత. సంగీతం: దేవిశ్రీప్రసాద్‌


English summary
Looks like the film is rightly packaged to entertain the masses as well as to satisfy the Powerstar fans. No wonder, Pawan Kalyan wants to dedicate the film exclusively to his fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu