»   »  ‘గబ్బర్ సింగ్-2’ లెటెస్ట్ ఇన్ఫో : గుజరాత్ ప్రయాణం (ఫొటోలు)

‘గబ్బర్ సింగ్-2’ లెటెస్ట్ ఇన్ఫో : గుజరాత్ ప్రయాణం (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ అభిమానులందరి దృష్టీ ఇప్పుడు ‘గబ్బర్ సింగ్-2' మీదే. ఈ చిత్రం ఎప్పటినుంచో ఈ రోజు ప్రారంభమవుతుంది...రేపు ప్రారంభమవుతుంది అని ఊరిస్తూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో 29 నుంచి రెగ్యులర్ షెడ్యూల్ అని ఖరారు చేసారు. దాంతో ఇఫ్పుడేం జరుగుతోంది. గబ్బర్ సింగ్ కు సంభందించిన ప్రీ ప్రొడక్షన్ ఎంత వరకూ వచ్చిందనేది ఆసక్తికరమే. ప్రస్తుతం దర్సకుడు తన కెమెరామెన్ జైనన్ విన్సెంట్, ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయి...లతో కలిసి గుజరాత్ వెళ్తున్నారు. అంతేకాకుండా ఫొటోను కూడా అందించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తాజాగా ఈ చిత్రానికి సంభందించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే...‘గబ్బర్ సింగ్2' చిత్రానికి చెన్నైలో దేవీశ్రీ మ్యూజిక్ సిట్టింగ్ వేశారని తెలుస్తోంది. ఈ మేరకు బాబీ, దేవిశ్రీప్రసాద్ ఇద్దరూ మ్యూజిక్ సిట్టింగ్ లలో పాల్గొంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దేవి ఇచ్చిన రెండు ట్యూన్స్ ఓకే చేసారని అంటున్నారు. వాటిని పవన్ కి వినిపించి ...గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకోవటమే తరువాయి.

Pawan's 'Gabbar Sing-2' latest Info.

గబ్బర్ సింగ్ చిత్రం సైతం మ్యూజికల్‌గా పెద్ద హిట్‌ సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చిత్రానికే హైలెట్‌గా నిలిచాయి. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘గబ్బర్ సింగ్-2' సినిమా కు సైతం దేవిశ్రీ మ్యాజిక్ నే నమ్ముకున్నారు. గబ్బర్ సింగ్ ని మించి హిట్టయ్యేలా పాటలు ఇవ్వాలని ఫిక్సై రాత్రింబవళ్లూ దేవి కష్టపడుతున్నట్లు వార్త.

గతంలో పవన్, దేవీశ్రీ కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది' చిత్రాలు మ్యూజికల్‌గా పెద్ద సక్సెస్ సాధించాయి.

బాబీ దర్శకత్వంలో రూపొందనున్న ‘గబ్బర్ సింగ్2' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మించనున్నారు.

Pawan's 'Gabbar Sing-2' latest Info.

కథరీత్యా మరో హీరోయిన్ కూ చోటుందని సమాచారం. ఆ హీరోయిన్ మరెవరో కాదు...త్రిష అని తెలుస్తోంది. ఈ మేరకు ఆమెను సంప్రదించారని చెప్పుకుంటున్నారు. అయితే కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని యూనిట్ అభిప్రాయపడుతోందని మరో ప్రక్క వార్తలు వినపడుతున్నాయి. ఈ విషయమై ప్రొడక్షన్ టీమ్ కామెంట్ చేయటానికి ఇష్టపడటం లేదు. త్వరలోనే ఆ హీరోయిన్ ఎవరనేది తేల్చి అఫీషియల్ గా మీడియాకు స్టేట్ మెంట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రం గబ్బర్‌సింగ్‌కు సీక్వెల్ కాదని, ప్రేమ, వినోదం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో మేళవించిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం, ఆలీ, నర్రా శ్రీనులను తారాగణంగా ఎంచుకున్నారు. హిందీ చిత్ర పరిశ్రమ నుంచి మరికొంత మందిని తీసుకుంటారని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీప్రసాద్, కెమెరా: జైనన్ విన్సెంట్, ఆర్ట్: ఆనంద్‌సాయి, కాస్ట్యూమ్స్ భానూమోరే, క్రియేటివ్ హెడ్: హరీశ్‌పాయ్.

English summary
Santosh Ravindra Kolli write in Fb: "Recce to Gujarat wit my Dop n Art director"
Please Wait while comments are loading...