»   » ‘కాటమరాయుడు’ టీజర్‌ షాకిచ్చే రికార్డ్, పిల్లలకు పరీక్షలు అయిపోతాయనే ముందుగా

‘కాటమరాయుడు’ టీజర్‌ షాకిచ్చే రికార్డ్, పిల్లలకు పరీక్షలు అయిపోతాయనే ముందుగా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న 'కాటమరాయుడు' చిత్రం టీజర్‌ శనివారం సాయింత్రం విడుదలైన సంగతి తెలిసిందే. 'ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడు ఉన్నాడన్నది ముఖ్యం' అంటూ పవన్ చెప్తున్న ఈ టీజర్ ప్రభంజనంలా దూసుకుపోతంది.

టీజర్ యూట్యూబ్ వ్యూస్ లో రికార్డ్ లు సృష్టిస్తోంది. విడుదలైన రెండు గంటల్లోనే మిలియన్ వ్యూస్ మార్క్ ను అందుకున్న కాటమరాయుడు, ఆ తరువాత మరికొన్ని గంటల్లోనే రెండు మిలయన్ల మార్క్ ను దాటేసింది. తొలి 24 గంటల్లో ఆల్ టైం రికార్డ్ ఖాయం అన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెట్టింది.

34 లక్షల మంది

34 లక్షల మంది

‘‘కాటమరాయుడు టీజర్‌ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. పదిలక్షల హిట్స్‌ని వేగంగా సాధించిన తెలుగు చిత్రమిది. తొలి 24 గంటల్లో 37 లక్షల మంది ఈ టీజర్‌ను చూసారు''అని చిత్ర యూనిట్ తెలిపింది.

ఇన్ని వ్యూస్ తెచ్చుకోలేదు

ఇన్ని వ్యూస్ తెచ్చుకోలేదు

ఇప్పటిదాకా ఏ తెలుగు టీజర్ కూడా 24 గంటల్లో ఇన్ని వ్యూస్ తెచ్చుకోలేదు. ఈ టీజర్ కు ఒక్క రోజులో 1.4 లక్షల లైక్స్ కూడా వచ్చాయి. ఇది కూడా రికార్డే. . పవన్ స్క్రీన్ పై కనిపించేది క్షణాలపాటే అయినా.. మెస్మరైజ్ చేసి పారేశాడు పవన్ కళ్యాణ్.

ట్రెండ్ చేస్తూ..

ట్రెండ్ చేస్తూ..

ఇందులో పవన్‌ ఈ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెబుతూ కనిపించారు. టీజర్‌లో ‘రాయుడూ..' అంటూ వస్తున్న నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది.
దీంతో అభిమానులు ఈ టీజర్ ను సోషల్ మీడియాలో షేర్ ట్రెండ్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు.

కుమ్మేసాడు

కుమ్మేసాడు

ఇక ఈ టీజర్ లో .. .. రెండు అర చేతులతో పవన్ ఆ కత్తిని పట్టుకునే సీన్ అదరహో అంటున్నారు అభిమానులు. ఇక పవన్ ఇంట్లో వేసే డ్యాన్సింగ్ సీక్వెన్స్ చూపించి.. గబ్బర్ సింగ్ స్దాయిలో కామెడీ యాంగిల్ ని కూడా టచ్ చేశారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తన పవర్ తో కాటమరాయుడుగా కుమ్మేశాడంతే.

యాక్షన్ ఎపిసోడ్స్ తోనే..

యాక్షన్ ఎపిసోడ్స్ తోనే..

ఇక ఈ టీజర్ మొత్తం ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఓరియెంటెడ్ గా సాగటం ప్లస్ అయ్యింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తుండడంతో.. కంప్లీట్ గా యాక్షన్ ఎపిసోడ్స్ తోనే టీజర్ ను నింపేసి, ఫ్యాన్స్ కు పండుగ చేసారు. కత్తులతో పరుగులు పెడుతున్న రౌడీలతో మొదలుపెట్టి.. పంచెకడుతున్న పవన్ ను ఇంట్రడ్యూస్ చేయటం మరో హైలెట్ గా చెప్తున్నారు.

క్లైమాక్స్ సీన్ బిజీలో..

క్లైమాక్స్ సీన్ బిజీలో..

ఇక ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో క్లైమాక్స్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఈనెల 8 వరకూ ఇక్కడే షూటింగ్ సాగుతుంది. త్వరలో పాటల్ని విడుదల చేస్తారు. కిశోర్‌ కుమార్‌ పార్థసాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఉగాదికి ‘కాటమరాయుడు' చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

మరో రెండు వారాల్లో..

మరో రెండు వారాల్లో..

మార్చి 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఇదివరకే ప్రకటించారు నిర్మాత. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇంతకుముందు నిర్ణయించిన తేదీ కంటే ముందుగానే చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం కాటమరాయుడు సినిమాను మరోవారం ముందుగా అంటే మార్చి 24నే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మార్చి 15 వరకు చాలా మంది పిల్లలకు పరీక్షలు అయిపోతాయన్న ఆలోచనతో సినిమాను ప్రీపోన్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

నలుగురు తమ్ముళ్లకి..

నలుగురు తమ్ముళ్లకి..

మరో వారం రోజుల్లో రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తవనున్నట్టు సమాచారం. విదేశాల్లో చిత్రీకరించనున్న ఆ రెండు పాటలు పూర్తయితే ఇక సినిమా విడుదలకి సిద్ధమైనట్టే. సంక్రాంతి సందర్భంగా ‘కాటమరాయుడు' ప్రచార చిత్రాల్ని విడుదల చేశారు. వాటిలో పవన్‌కల్యాణ్‌ పంచెకట్టుతో కనిపించి అలరించారు. చిత్రంలో ఆయన నలుగురు తమ్ముళ్లకి అన్నగా కనిపించనున్నట్టు తెలుస్తోంది.

వీరంకు రీమేక్..

వీరంకు రీమేక్..

తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ ఫ్యాక్షనిస్ట్ పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే తమిళ సూపర్ హిట్ వీరంకు రీమేక్ గా తెరకెక్కుతున్నా ఈసినిమా టీజర్ లో ఎక్కడా ఆ ఫ్లేవర్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.

వీళ్లంతా కాటమరాయుడు కోసం...

వీళ్లంతా కాటమరాయుడు కోసం...

శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మిత మవుతున్న ఈ కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు. నిర్మాత: శరత్ మరార్ దర్శకత్వం: కిషోర్ పార్ధసాని

English summary
Powerstar Pawan Kalyan's Katamaryudu teaser is now the fastest Telugu film to cross three million views in less than 24 hours.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu