»   » మంచి ముహూర్తాలు లేవనే పవన్ సైతం అదే రోజు

మంచి ముహూర్తాలు లేవనే పవన్ సైతం అదే రోజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అన్నదమ్ములు పవన్, చిరంజీవి ఒకే ముహూర్తానికి ఫిక్సయ్యారు. వీరిద్దరి కొత్త చిత్రాలు ప్రారంభం ఈ నెల 29 నే లాంచ్ కానున్నట్లు సమాచారం. ఆ చిత్రాలు మరోవో కావు...చిరంజీవి 150 వ చిత్రం, పవన్ , ఎస్ సూర్య కాంబినేషన్ చిత్రమూను.

చిరంజీవి 150వ చిత్రంపైన ఆసక్తి ఉన్నట్లే... 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' తరవాత పవన్‌ కల్యాణ్‌ చేయబోయే చిత్రం గురించి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు చిత్రాలు ఎప్పుడెప్పుడు మొదలెడతారా అనే ఆసక్తి నెలకొంది.

Pawan’s new movie starts from April 29th

చిరంజీవి - వినాయక్‌ల 'కత్తి' రీమేక్‌కి ఈనెల 29న లాంఛనంగా కొబ్బరికాయ కొట్టేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం. అదే రోజున పవన్‌ కల్యాణ్‌ - ఎస్‌.జె.సూర్యల సినిమా కూడా ముహూర్తం జరుపుకోనుందట. 29వ తారీఖు దాటితే మంచి ముహూర్తాలు లేవని వీరిద్దరూ అదే రోజున తమ సినిమాని లాంఛనంగా ప్రారంభించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

రెగ్యులర్ షూటింగ్ విషయానికి వస్తే...వచ్చే నెల చివరి వారంలో చిరు సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. పవన్‌ - సూర్యల చిత్రం కూడా వచ్చే నెలలోనే మొదలవుతుంది. ఈలోగా అటు వినాయక్‌, ఇటు ఎస్‌.జె సూర్య స్క్రిప్ట్‌పై కసరత్తులు ముమ్మరం చేశారు. చిరు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌, పవన్‌ సినిమాకి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.

English summary
Unlike taking huge time to pick his second, Pawan will be now starting his next under SJ Suya’s direction from April 29th onwards.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu