»   » ఎంజాయ్ ‌: పవన్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' టీజర్‌ (వీడియో)

ఎంజాయ్ ‌: పవన్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' టీజర్‌ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ ‌: పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫలించాయి. పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మంగళవారం అర్ధరాత్రి విడుదల చేసిన ఈ టీజర్‌ ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది. కాజల్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో శరత్‌మరార్‌ తెరకెక్కిస్తున్నారు. 2016 ప్రథమార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మూడో షెడ్యూల్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుండి ప్రారంభం అయ్యింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కబీర్ దుహన్ సింగ్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇతను మెయిన్ విలనా? లేక సినిమాలోని విలన్లలో ఒకరా? అనేది తేలాల్సి ఉంది. ‘జిల్' సినిమాతో తెరంగ్రేటం చేసిన కబీర్ సింగ్ పవన్ కళ్యాణ్ సినిమాలో చేసే అవకాశం దక్కడంపై చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సినిమా ద్వారా తనకు మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాడు.

Pawan's Sardaar Gabbar Singh Official Teaser

‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి జైనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల గట్స్...గన్స్ అండ్ లవ్ అంటూ పవన్ కళ్యాణ్ రెండు చేతులతో గన్స్ పేలుస్తూ విడుదలైన పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారు.

పవన్ కళ్యాణ్ కు చెందిన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్', అతని స్నేహితుడు శరత్ మరార్‌కు చెందిన ‘నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈరోస్ వారు ఈ చిత్రాన్ని 70 కోట్లకు అవుట్ రేటు కు తీసుకున్నట్లు తెలుస్తోంది.

English summary
Check out the official teaser of Sardaar Gabbar Singh starring Pawan Kalyan, Kajal Aggarwal and directed by K.S. Ravindra.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu