»   »  వావ్: 'సర్దార్ గబ్బర్ సింగ్' టీజర్ పోస్టర్

వావ్: 'సర్దార్ గబ్బర్ సింగ్' టీజర్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్‌కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్‌సింగ్. ఈ మూవీ తాజా టీజర్‌ను చిత్ర యూనిట్ సంక్రాంతి పండగనాడు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే న్యూ ఇయర్ రోజున ఓ టీజర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ రేపు మరో టీజర్‌ను ఫ్యాన్స్ కు కానుకగా ఇవ్వనుంది. ఈ విషయాన్ని నిర్మాత శరత్ మరార్ తెలియచేస్తూ...టీజర్ పోస్టర్ ని విడుదల చేసారు. ఆ పోస్టర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.


సంక్రాంతి సంబరాల్ని ఆరంభించాడు సర్దార్‌. అరె వో గబ్బర్‌సింగ్‌కా ఫౌజియో... అనగానే వెంట నడిచొచ్చే తన దళంతో గబ్బర్‌ సింగ్‌ చేసే సందడి అంతా ఇంతా కాదు. సంక్రాంతికి ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సెట్‌ నుంచి పవన్‌కల్యాణ్‌ తన అభిమానులకి ప్రేమని పంచుతున్నట్టు ఆ చిత్ర నిర్మాత శరత్‌ మరార్‌ తెలిపారు.

Pawan's Sardar Gabbar Singh Teaser Poster

పవన్‌కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. కాజల్‌ హీరోయిన్. బాబి దర్శకుడు. రూ.5 కోట్ల వ్యయంతో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో పవన్‌కల్యాణ్‌, అలీ, బ్రహ్మాజీ, రఘుబాబు, నర్రా శ్రీను తదితర నటులపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


చిత్రంలో రాయ్‌లక్ష్మీ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. . నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శరత్‌ మరార్‌ నిర్మాత. సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.English summary
Pawan's Sardaar Gabbar Singh‬ New Teaser to be Released this Sankranthi.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu