»   » పవన్ కళ్యాణ్ పిల్లల పేరుతో సినీ నిర్మాణ సంస్థలు.. ఆ డబ్బు?

పవన్ కళ్యాణ్ పిల్లల పేరుతో సినీ నిర్మాణ సంస్థలు.. ఆ డబ్బు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రెండో భార్య రేణు దేశాయ్ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కుమారుని పేరు అకీరా నందన్, కూతురు పేరు ఆద్యా. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోవడంతో ఇద్దరు పిల్లలు తల్లి వద్దే పెరుగుతున్నారు.

రేణు దేశాయ్ ప్రస్తుతం నిర్మాతగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె మరాఠీలో ఓ సినిమాను కూడా తెరకెక్కించారు. తాజాగా ఆమె తన ఇద్దరు పిల్లల పేరుతో సినీ నిర్మాణ సంస్థలు ప్రారంభిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొడుకు పేరుతో అకీరా ఫిల్మ్ష్ అనే సంస్థను స్థాపించిన 'ఇష్క్ వాలా లవ్' అనే చిత్రీన్ని కూడా నిర్మిస్తున్నారు.

Pawan's son and daughter as producers?

త్వరలో ఆద్యా పేరుతో కూడా ఆమె మరో సినీ నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా వారికి చిన్న తనం నుండి సినిమా రంగంపై అవగాహన కల్పిస్తోందట. భవిష్యత్తులో వారిని పెద్ద స్టార్లుగా తీర్చి దిద్దాలనే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు సినీ నిర్మాణ సంస్థలకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది.

ఇద్దరు పిల్లల పేరుతో ప్రారంభిస్తున్న ఈ సినీ నిర్మాణలకు పవన్ కళ్యాణ్ డబ్బు సాయం చేస్తున్నాడని, తండ్రిగా తన వంతు బాధ్యత నిర్వహిస్తున్నట్లు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నేపథ్యంలో మున్ముందు తన సంపాదన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి....ప్రస్తుతం తాను సినిమాల్లో బాగా సంపాదిస్తున్న సయమంలోనే పిల్లల కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారట.

English summary
Pawan Kalyan former wife Renu formed two production houses in the name of her children Akira Nandan and Aadya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu