»   » పవన్ కళ్యాణ్ 'తీన్ మార్'రిలీజ్ డేట్ ప్రకటన

పవన్ కళ్యాణ్ 'తీన్ మార్'రిలీజ్ డేట్ ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం తీన్ మార్ చిత్రం ఈ నెల 14 వ తేదిన విడుదల చేయనున్నట్లు నిర్మాత గణేష్ బాబు ప్రకటించారు.ఈ సందర్బంగా నిర్మాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ...పవన్‌కళ్యాణ్ ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నటించారు. అర్జున్ పాల్వాయ్, మైఖేల్ వేలాయుధం పాత్రల్లో ఆయన అద్భుతం. పవన్‌కళ్యాణ్ నుంచి ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అదే వంద శాతం స్క్రీన్‌మీద ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కెరీర్‌లోనే ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుంది. ఆడియో సూపర్‌హిట్ కావడం చాలా ఆనందంగా ఉంది. టివిల్లో వస్తున్న ప్రోమోలు చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పవన్‌కళ్యాణ్ నటన, జయంత్ డైరెక్షన్, త్రివిక్రమ్ డైలాగ్స్, మణిశర్మ సంగీతం మా చిత్రానికి హైలైట్స్‌గా నిలుస్తాయి. ఈ సినిమాను ఈ నెల 14న విడుదల చేస్తున్నాం అన్నారు.

దర్శకుడు జయంత్ సి.పరాన్జీ మాట్లాడుతూ..ప్రేమకి సరైన విలువ లేకుండాపోయిన నేటిరోజుల్ల్లో ప్రేమకు ఉన్నగొప్పతనాన్ని, విలువను పక్కా కమర్షియల్ చిత్రంగా రూపొందించాంమని తెలిపారు. కృతి, పరేష్ రావల్, అలీ, సోనూసూద్, ముఖేష్ రిషి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జైనన్ వినె్సంట్. ఆర్ట్: నారాయణరెడ్డి, నిర్మాత: గణేశ్‌బాబు, స్క్రీన్‌ప్లే దర్శకత్వం: జయంత్ సి పరాన్జీ.

English summary
producer Ganesh Babu now confirmed Teenmaar’s release date - April 14th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu