»   » పవన్ ‘సర్దార్’...అన్న ఎన్టీఆర్ మూవీ గుర్తొస్తోంది!

పవన్ ‘సర్దార్’...అన్న ఎన్టీఆర్ మూవీ గుర్తొస్తోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమాకు ‘సర్దార్' అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. అయితే ఈ సినిమా టైటిల్, పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్, ఇప్పటి వరకు ఆయన భారీ గెడ్డం పెంచడం చూస్తుంటే సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘సర్దార్ పాపారాయుడు' సినిమా గుర్తొస్తోందని పలువురు సినీ ప్రియులు అభిప్రాయ పడుతున్నారు.

అప్పట్లో ‘సర్దార్ పాపారాయుడు' సినిమా కూడా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న తరుణంలో వచ్చిందే. ఇపుడు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల వైపు అడుగలు వేస్తున్న తరుణంలో ‘సర్దార్' సినిమా చేస్తుండటంతో సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘సర్దార్ పాపారాయుడు' సినిమా గుర్తొస్తోందని అంటున్నారు.

 Pawan 'Sardar' reminds NTR's 'Sardar Paparayudu'

పవన్ ‘సర్దార్' సినిమా విషయానికొస్తే.....ప్రస్తుతం ఈ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం అయింది. ఇక్కడ కీలకమైన యాక్షన్ సన్నివేశాలు. కొన్నీ సీన్లు చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి కెఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. జైనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ శరత్ మరార్ ‘నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్' బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని విలేజ్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన స్క్రిప్టు బాధ్యతలు పవన్ కళ్యాణ్ దగ్గరుండి పర్యవేక్షించారు. తనకు నచ్చిన విధంగా చేర్పులు, మార్పులు చేయించారు.

English summary
Pawan Kalyan's latest movie 'Sardar' reminds NTR's 'Sardar Paparayudu'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu