twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ తాజా ఇంటర్వూ - 2 (ఫోటో ఫీచర్)

    |

    హైదరాబాద్ : నేనూ కోట్లు సంపాదిస్తున్నాను. సినిమా పరిశ్రమలో ఎక్కువ ఆదాయపు పన్ను కట్టే వ్యక్తిని నేను. ఒకటి రెండేళ్ళు టాక్స్‌ కట్టలేదు. ఎందుకంటే సినిమాల్లేవు. సంపాదన లేదు. అర్థంగాని విషయమేమంటే... అన్ని వందల వేల కోట్లు ఎలా వస్తాయనేది! సంపాదన, ఆదాయం పెరగటం సహజం. అయితే అనూహ్యంగా పెరగటం... అదీ అత్యంత తక్కువ సమయంలో పెరగటం ఆశ్చర్యం, అనుమానం కలిగిస్తుంది అన్నారు పవన కళ్యాణ్.

    Read more at: /movies/news/this-time-pawan-targets-ys-jagan-133130.html

    జనసేన పార్టీ ఆవిర్భావం అనంతరం పవన్‌ కల్యాణ్‌ తొలి ఇంటర్వ్యూ ఇది. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు'తో ఆయన మాట్లాడుతూ అనేక విషయాలు తెలియచేసారు. వాటిలో ముఖ్యాంశాలను ఈ ఆర్టికల్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం.

    పవన్ మాట్లాడుతూ... జగన్‌ గురించే కాదు... ఎవరి విషయంలోనైనా ఇంతే! నాకు సాధ్యపడనిది మిగిలిన వారికెలా సాధ్యపడుతోందా అని బిత్తరపోయి చూస్తుంటాను. అంత డబ్బు అంత తక్కువ కాలంలో సంపాదించవచ్చా? ఎలా సంపాదిస్తారనే ప్రశ్న పదేపదే తలెత్తుతుంటుంది! ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వల్ల ఇది సాధ్యపడుతుందేమో. ఆయన దగ్గరి నుంచి వచ్చిన చాలామంది ఏవేవో విషయాలు చెబుతుంటారు. కానీ నేను ఎవరికైనా సంశయ లాభం ఇస్తాను. వేరే వాళ్ళు చెప్పేవి నమ్మేయను.

    అయితే... వ్యక్తిగతంగా అభియోగాలున్న వ్యక్తి... బోలెడన్ని అభియోగాల్ని వెంటబెట్టుకొని వెళితే జనాలెలా నమ్మేది? మంచి పాలన చేస్తారని ఎలా ఆశించొచ్చు? ఇన్ని అభియోగాలున్నా సుపరిపాలన అందిస్తానని ఎలా నమ్మిస్తారు? నాపై అభియోగాలున్నాగాని నేనిలా ప్రభుత్వాన్ని నడిపిస్తా అని ప్రజలకు నమ్మకం కలిగించాలి. నన్ను పాలించాలనుకునే వ్యక్తి నుంచి అది నేను కోరుకుంటా! అభియోగాల నుంచి బయటపడాలిగా ముందు. నాకసలు వీటితో సంబంధం లేదని చెప్పగలగాలి! మళ్లీ చెబుతున్నా నాకింతదాకా అర్థంగాని విషయమేమంటే... ఇంత తక్కువ సమయంలో ఇన్ని రెట్ల సొమ్ము ఎలా సంపాదిస్తారనేది? వ్యాపారం చేయటం వేరు... మోసం, వంచన చేయటం వేరు అంటూ ఆవేశంగా చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.

    దోపిడీ నేర్పింది వైఎస్సే

    దోపిడీ నేర్పింది వైఎస్సే

    తెలంగాణ వాదం బలపడటానికి ముఖ్య కారణం రాజశేఖరరెడ్డి ఆలోచనా విధానం. తెలంగాణ గురించి ఆలోచించనివాడు కూడా ఆయన వల్ల ఆలోచించటం మొదలెట్టాడు. తెలంగాణలో చాలామంది చదువుకున్నవారు, మంచి భావజాలం ఉన్నవారు సమాజానికి ఏదైనా మేలు చేద్దామనే తపనతో ఉన్నవారున్నారు. ప్రజారాజ్యం పెట్టినప్పుడు నేను విస్తృతంగా తిరిగా. క్షేత్రస్థాయిలో చాలామందిని కలిశా. షూటింగ్‌ల సమయంలోనూ చాలామంది యువత నా దగ్గరికి వచ్చేవారు. వాళ్ళందరి మాటల సారాంశం.... వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమ ఆశల్ని చంపేశారనేవారు!

    పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు సమస్య

    పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు సమస్య

    ప్రతి ఒక్కరికీ ఏవో కొన్ని లక్ష్యాలున్నాయి. అది సాధ్యమా కాదో చూసుకుంటారు. దీన్ని సాధ్యం చేసుకోవటానికి ప్రణాళిక వేసుకుంటారు. నెలనెలా కొంత దాచుకుంటారు. పదేళ్ళలో పది లక్షలవుతాయని... లెక్కలు వేసుకుంటారు. రుణం తీసుకొని ఏదో చేయాలనుకుంటారు. అలాంటి స్థితిలో మన లక్ష్యం కష్టసాధ్యం కాదుగదా... ఏకంగా అసాధ్యంగా మారిపోతే? అదే జరిగింది. లక్ష రూపాయలున్న భూమి కోటి రూపాయలైంది. సామాన్యుడి స్థాయికి, కష్టపడి నిజాయతీగా సంపాదించేవారి స్థాయికి అసాధ్యమైంది. ఆలోచనలోనే తుంచేశారు. అది కోపంగా మారి... ఆందోళనల రూపం దాల్చింది. పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు సమస్య అది. భూములు విలువలు పెరగటమే కాదు... బ్యాలెన్స్‌ ఆఫ్‌ జాబ్స్‌ కూడా లేదు.

    దోచుకోవటం భావజాలమైంది

    దోచుకోవటం భావజాలమైంది


    నాయకులు ఒక్కరే దోచుకొని ఉంటే ఎవ్వరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ రాజశేఖరరెడ్డి హయాంలో దోచుకోవటం అనేది భావజాలమైపోయింది. ఒక స్థాయి నాయకులు దోచుకుంటే సామాన్యుడి దాకా రాదు. అలాగని అది తప్పు కాదని కాదు. కచ్చితంగా తప్పే. కాకపోతే అది సామాన్యుణ్ణి ప్రోత్సహించదు. ఎందుకంటే ఆ స్థాయి అవినీతి సామాన్యుడికి సాధ్యంకానిది. కానీ అవినీతిని అన్నిస్థాయిల్లో సాధ్యం చేయవచ్చనే స్థాయికి తీసుకొచ్చారు రాజశేఖరరెడ్డి.

    దోపిడీకి గురయ్యారు

    దోపిడీకి గురయ్యారు

    నేనూ సమాజాన్ని దోచుకోవచ్చు అనే భావజాలం ఆయన పాలనలో వచ్చింది. అన్నిస్థాయిల్లో వచ్చేసింది. చివరకు ఓ చోటామోటా గల్లీస్థాయి నాయకులకు కూడా వచ్చేసింది. ఇది నేను ప్రత్యక్షంగా చూశాను. వాళ్ళ మాటలు వింటేనే భయమేసేది. 'మేమేం చేసినా మాకేం కాదు. అన్న ఉన్నాడనే వారు'. చివరికి ఆ పార్టీకి చెందని వారు సైతం... నాకు ఫలానా వారితో పరిచయాలున్నాయి. ఏం చేసినా ఏం కాదనే దాకా వెళ్లారు. దీంతో చాలామంది దోపిడీకి గురయ్యారు.

    నాయకత్వమంటే ఇదా?

    నాయకత్వమంటే ఇదా?

    బలమైన నాయకత్వమంటే నియంతృత్వమా? సీనియర్‌ నేత హరిరామజోగయ్య ఓసారి వైఎస్‌కి పాలనలో అవినీతి గురించి లేఖ రాస్తే ఆయన ఇంటిపై దాడి జరిగింది. ఆ స్థాయి వ్యక్తులపై దాడులు చేస్తే అదెంత మందికి వూతమిస్తుందో తెలుసా? ఇతర పార్టీల వారు కూడా ఆయన పేరు చెప్పుకొని ఇలాగే ప్రవర్తించటం మొదలెట్టారు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఏదైనా చేసేయగలం... దాటేయగలం అనే పరిస్థితి నాకు నచ్చలేదు. ఒకవ్యక్తి వ్యవస్థను అంతగా శాసించటం మంచిదనిపించలేదు.

    రాజశేఖరరెడ్డి ప్రేరణైపోయారు

    రాజశేఖరరెడ్డి ప్రేరణైపోయారు

    ప్రశ్నించే వాళ్ళెవరూ లేరు... అంతా భయపడటమే. అందుకే పార్టీ కార్యాలయ భవనం కోసం పేదల గుడిసెల్ని కూల్చినప్పుడు కాంగ్రెస్‌ నేతల్ని పంచలూడిపోయేలా తరిమి కొట్టండని పిలుపిచ్చాను. ప్రశ్నిస్తేనే కన్నెర్రజేస్తే ఎలా? యథా రాజా తథా ప్రజ కదా! పెద్దవాళ్ళే తప్పు చేస్తే చిన్నవాళ్ళు తప్పు చేయరా? రాజశేఖరరెడ్డి ప్రేరణైపోయారు! ఏమైనా అంటే ఆయన నమ్మితే ఎవరికైనా ఏదైనా చేసేస్తారండీ. అంటుంటారు! అదేనా ఓ వ్యక్తిని కొలిచే ప్రమాణం? మనం ఏం చేసినా ఆయన మన తరఫున నిలబడతారు సార్‌ అనేవారు. నాకెందుకో ఆ పదం నచ్చలేదు.

    తెలుగుదేశం నాయకులు కూడా ఇదే ...

    తెలుగుదేశం నాయకులు కూడా ఇదే ...

    కొంతమంది తెలుగుదేశం నాయకులు కూడా ఇదే మాట చెప్పేవారు! 'మావాడు తిననివ్వడు...ఆయన తిననిస్తాడు' అనే వారు. ఆ మాట చెబుతుంటే నవ్వాలో ఏడవాలో తెలియలేదు. పరిస్థితి ఎలా తయారైందంటే... 20 శాతం తినండి... 80 శాతం పనిచేయండనే దశకు వచ్చింది. అంటే తింటే తిన్నారు పనిచేయండి అనే స్థాయికి మైండ్‌సెట్‌ చేశారు. ఎంతోకొంత తినంది పని కాదని ఆమోదిస్తున్నారు! అదేంటలా తింటున్నారంటే... వాళ్ళు, వీళ్లు తినలేదా అని ఎదురుదాడి! ఏంటిదంతా?

    వైఎస్‌ పాలనంతా వంచనే!

    వైఎస్‌ పాలనంతా వంచనే!

    ప్రతి ప్రభుత్వంలోనూ వంచన (ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌) జరుగుతుంది. కానీ ఇక్కడ అనేకరెట్లలో అనూహ్యంగా వంచన జరిగింది. అదీ కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోనే జరిగింది. సంపదంతా కొంతమంది దగ్గర కేంద్రీకృతమైంది. ఆంధ్రాపై వ్యతిరేకతకు ఇదీ ఓ కారణమే. మోసపొయ్యామనే బాధ జనాల్లో ఉంది. ఈ బాధ, ఆగ్రహం నాయకులపై కాకుండా సామాన్య ప్రజలపైకి మళ్ళింది. ఎందుకంటే బలమైన నాయకుల్ని ఏం చేయలేరుగనక... సామాన్య ఉద్యోగులు, ప్రజల వైపు మళ్ళింది.

    రాజశేఖరరెడ్డిలో నాకు నచ్చనిది

    రాజశేఖరరెడ్డిలో నాకు నచ్చనిది

    నాకు రాజశేఖరరెడ్డిలో ఇంకా నచ్చనిది ఏంటంటే... రాజకీయ అవకాశవాదం. నాయకుడంటే తనపర భేదం ఉండకూడదు. ప్రజలందరినీ సమానంగా చూడగలగాలి. తెలంగాణలో ఎన్నికలయ్యాక... నంద్యాల వెళ్ళి అక్కడ సభలో విభజన జరిగితే హైదరాబాద్‌ వెళ్ళాలంటే మనం వీసాలు తీసుకోవాలంటూ రెచ్చగొట్టారు. ఇక ఆయనకూ వేర్పాటువాద నాయకులకూ ఏం తేడా ఉంది? విభజన జరిగితే వేరే దేశమైపోతుందా? ఇదే ... ఈ విచ్ఛిన రాజకీయాలే నాకు నచ్చనిది.

    ఎందుకంత తొందర?

    ఎందుకంత తొందర?

    చంద్రబాబును జనాలు నమ్మటం లేదు... జగన్‌ జైల్లో ఉన్నారు మీరు సమైక్య ఉద్యమానికి సారథ్యం చేపట్టండని నన్ను ఆహ్వానించినప్పుడు... నాకు బాపుగారి సినిమాలో పాట గుర్తుకొచ్చింది. ఎదగడానికెందుకురా తొందర... ఎదుర బతుకంతా చిందరవందర.... అనే పాట! జగన్‌ అంత తొందరగా ముఖ్యమంత్రి అవటానికి తొందరపడాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజశేఖరరెడ్డి ఆలోచనా విధానం, భావజాలంపై నాకు కోపముంది. కానీ ఆయన చనిపోయినప్పుడు నేను బాధపడ్డాను. కానీ చనిపోయిన వెంటనే జగన్‌ వచ్చేసి... వారసత్వం కావాలనీ... ముఖ్యమంత్రి పదవి నాది అనటం నాకెందుకో చిన్నతనంగా అనిపించింది. అంత తొందరేమొచ్చింది? ఎవరినైనా చేయనిచ్చి.... జనానికి వదిలిపెడితే ఇప్పటికల్లా బాగనే ఉండేదేమో.

    స్వార్ధం కోసమే..

    స్వార్ధం కోసమే..

    ఒక్కరి స్వార్థం కోసం ఇంత అస్తవ్యస్త పరిస్థితుల్ని సృష్టించటం, రాజకీయ అస్థిరత సృష్టించటం సబబా? నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకునేవారు వ్యక్తిగత స్వార్థం గురించి చూడరు. ఏదోరకంగా సేవ చేయొచ్చు ఒకవేళ నిజంగా ఆ రోజు అది ప్రజలకు అవసరమైన నిర్ణయమే అయితే తప్పుపట్టాల్సిందేమీ లేదు. ఆరోజు ఆయనే ముఖ్యమంత్రి అవ్వాల్సినంత అవసరం ఏం లేదు.? ఏడాది తర్వాతో, రెండేళ్ళో...మూడేళ్ళ తర్వాతో కావొచ్చు. ఓవ్యక్తి పోగానే... మొత్తం నాకే కావాలనే... అదీ వెంటనే కావాలనుకునే కాంక్ష! ఫలానా వ్యక్తే వారసుడని ఎలా నిర్ణయిస్తాం? ప్రజలు కోరుకోవాలి. ప్రజల్నుంచి రావాలి. ఆ దిశగా ఎవరెవరో మాట్లాడిన మాటల్ని బట్టి అభిప్రాయాన్ని సృష్టించవచ్చు. కానీ అది సరైంది కాదు.

    తండ్రి పోయిన వెంటనే...

    తండ్రి పోయిన వెంటనే...

    తండ్రి చనిపోయినప్పుడుండే వాతావరణం, భావనలు నాకు తెలుసు. ఆయనతో అనుబంధాలన్నీ గుర్తుకొస్తాయి. పరిస్థితులింకా పచ్చిగా ఉండాగానే పదవుల గురించి ఆలోచించాలా? ఇదేనా మనం తండ్రికిచ్చే గౌరవం అనిపించింది? అలాంటి పరిస్థితుల నుంచి కూడా ప్రయోజనం పొందాలనుకుంటే అదెలాంటి భావజాలం? అంత పదవీ వ్యామోహం ఎందుకు? ఏం చేసుకుంటారా పదవిని? ఎంతో బాధ్యతతో చేపట్టాల్సిన పదవిని తొందరగా తండ్రి స్థానాన్ని భర్తీ చేసినట్లుగా చేసేయాలనుకోవటాన్ని ఏమనాలో నాకర్థం కాలేదు. కాంగ్రెస్‌లో ఇలా కొట్టుకునే విధానం నాకు నచ్చలేదు. ప్రజలకు సేవ చేయటానికి పదవే కావాలా? రాజకీయ వ్యవస్థ ప్రాధాన్యం నాకు తెలుసు. కానీ వెంటనే ఆ పదవిలో కూర్చోవాల్సినంత అవసరం ఏమొచ్చిందన్నది నా ప్రశ్న? పదవి అనేది బాధ్యతతో కూడుకున్నది.

    అభియోగాల నుంచి జగన్‌ బయటపడాలి

    అభియోగాల నుంచి జగన్‌ బయటపడాలి

    రాత్రికి రాత్రి మంచి పాలన ఇస్తామంటే కుదరదు. పాత బ్యాగేజీ(అభియోగాలు) మోసుకుంటూ వస్తున్నప్పుడు అది చాలా కష్టం. ఇప్పటికిప్పుడు పార్టీతో ఎన్నికల్లోకి వెళ్ళొచ్చు. ఎన్నో కొన్నిసీట్లు సాధించొచ్చు. పైగా నాకెలాంటి బ్యాగేజీ కూడా లేదు. ఫలానాదెందుకిలా చేశావని నిలదీసే అంశాలుగానీ, జవాబు చెప్పాల్సిన అంశాలుగానీ లేవు నాకు. అలాంటి నేనే నేర్చుకొని పాలన చేయటానికి సమయం పడుతుంది. అలాంటిది అభియోగాలతో వచ్చే వ్యక్తికెంత కష్టం! నాదృష్టిలో జగన్‌ అన్ని కేసుల నుంచి స్వచ్ఛంగా బయటపడ్డాక ప్రయత్నిస్తే బాగుంటుంది. ఆయనపై ఉన్నవి అభియోగాలే అనుకుందాం. వాటి నుంచి సచ్చీలుడిగా బయటపడ్డ తర్వాత మళ్ళీ రావొచ్చుగదా అనిపిస్తోంది.

    రుజువు కాకపోతే సరైనదైపోతుందా?

    రుజువు కాకపోతే సరైనదైపోతుందా?

    జగన్‌ ముఖ్యమంత్రిని చేయాలని అంటుంటే... పదేపదే అనిపిస్తుంటి... ఈ అభియోగాల నుంచి ఎలా బయటపడతారని? ఇన్ని వందలు, వేలు, లక్షల పేజీలు... ఒక గది నిండా ఉండే రికార్డులతో కూడిన కేసులు తప్పా? రుజువుకానంత మాత్రాన సరైనదైపోతుందా? సమాధానాలు ఇచ్చేంత స్థాయిలో నేను లేను. ఎలా ఈ అభియోగాల నుంచి బయటపడతారనేదే సామాన్యుడిగా నా సందేహం.

    చంద్రబాబుకు ఇంకా అవకాశం ఇవ్వాల్సింది

    చంద్రబాబుకు ఇంకా అవకాశం ఇవ్వాల్సింది

    చంద్రబాబునాయుడుకు ఇంకాస్త పాలనా సమయం ఇవ్వాల్సిందనిపించింది. ఆయన హయాంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయి. హైదరాబాద్‌లో పరిశుభ్రత వచ్చింది. పరిపాలన బాగుండేది. రైతుల విషయాల్ని మరింత పట్టించుకోవాల్సింది. బషీర్‌బాగ్‌ ఘటన జరిగి ఉండాల్సింది కాదనిపించింది. అసెంబ్లీ దగ్గరకు వచ్చిన వారు సామాన్యులు. శాసనసభ భవనం దాకా వారు వెళితే ఏమైఉండేది? వారినలా కాల్చి చంపటం బాధనిపించింది. వారిని తీసుకొచ్చిన సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌లు ఆందోళనకారులను నియంత్రించాల్సిందనిపించింది. సంయమనం పాటించాల్సింది.

    పీవీకి భారత రత్న ఇవ్వాలి

    పీవీకి భారత రత్న ఇవ్వాలి

    పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డునివ్వాలి. దేశ ఆర్థికరంగం రూపురేఖల్ని మార్చిన మహనీయుడాయన. ఇప్పుడు మనం అనుభవిస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులన్నింటికీ మూలకారకుడు ఆయనే.

    వ్యాపారవేత్తలైన ఎంపీలవల్లే ఇదంతా!

    వ్యాపారవేత్తలైన ఎంపీలవల్లే ఇదంతా!

    వ్యాపారస్థుల్నే కోస్తా ప్రజలు ఎన్నుకోవటంతో వారు పోరాడలేకపోయారు. వ్యాపారవేత్తలైన సీమాంధ్ర ఎంపీలే ఈ పరిస్థితికి కారణం. కాంగ్రెస్‌ నేతలే మళ్ళీ తెదేపాలో చేరుతున్నారు. కాంగ్రెస్‌నేతలపై గౌరవం పోయింది. కావూరి లాంటివారు పార్టీలో ఉండి గట్టిగా మాట్లాడలేకపోయారు. ఇప్పుడుకాకుండా అప్పుడే రాజీనామాలు చేసి ఉండాల్సిందిగదా! హైదరాబాద్‌లో కూడా అందరూ ఉద్యమకారులేం కాదు. కాకుంటే ఇక్కడుండటం వల్ల ఆ పేరు వచ్చింది. వీరూ సీమాంధ్ర ఎంపీల్లాంటి వారే. నిజంగా ఉద్యమకారులైతే వైఎస్‌ ఉన్నప్పుడు వీరంతా ఎందుకు మాట్లాడలేదు? వైఎస్‌ బతికున్నప్పుడు కొద్దిమంది తప్పిస్తే ఎవ్వరూ నోరు మెదపలేదుట.

    తెలుగుజాతి, తెలుగు భాష అభివృద్ధిపై పార్టీ దృక్పథం

    తెలుగుజాతి, తెలుగు భాష అభివృద్ధిపై పార్టీ దృక్పథం

    ఏదైనా సరే మనం ఎక్కడుంటే అక్కడి సంస్కృతిలో కలసిపోయి మన భాషను రక్షించుకోవాలి. అంతేగాని మాది గొప్పది అనే భావన కలిగితే వైషమ్యాలు మొదలవుతాయి. అలాగే మిమ్మల్ని కించపరిస్తే జనసేన మీకు మద్దతిస్తుంది. తెలుగులో అనేక మాండలికాలున్నాయి. మనం పుట్టిపెరిగిన ప్రాంతం, మనకు తెలిసిన భావజాలం మాత్రమే కాకుండా మిగిలిన వాటన్నింటినీ సమదృష్టితో చూడగలిగితే బాగుంటుంది.

    బ్యూరోక్రాట్లు భయపడుతున్నారు

    బ్యూరోక్రాట్లు భయపడుతున్నారు

    చాలామంది బ్యూరోక్రాట్లు నాతో మాట్లాడారు. చాలామంది భయపడుతున్నారు. వైకాపా ఒకవేళ అధికారంలోకి వస్తే ఏమవుతుందో... ఏం పనులు చేయాల్సి వస్తుందో... మా సహచరులను పెట్టినట్లే ఎలా ఇరుకున పెడతారో... ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తంజే స్తున్నారు.

    భాజపాకు మద్దతెలా ఇస్తున్నారు?

    భాజపాకు మద్దతెలా ఇస్తున్నారు?

    నాకు నచ్చిందా లేదా అనేదానితో సంబంధంలేకుండా ఇచ్చిన మాటపై నిలబడ్డవారిని నేనభినందిస్తాను. విభజన వద్దని మొదటి నుంచీ చెప్పిన సీపీఎం, విభజనకే మా ఓటని చెప్పిన భాజపా, తెరాసలన్నా నాకు గౌరవం. వారు పూటకో మాట మార్చలేదు. ఏదో ఒక విధానానికి కట్టుబడి ఉన్నారు.

    English summary
    Pawan Kalyan also took potshots on YS Jagan and his alleged link up with Congress Party. Pawan Kalyan talked about how Congress Party join hands with corrupted if the terms between them are good and then take on honest officers who worked in those cases .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X