»   » కాటమరాయుడు కష్టాలు గట్టెక్కించే ప్రాజెక్ట్: పవన్ త్రివిక్రమ్ షూటింగ్ తేదీ ఇదే

కాటమరాయుడు కష్టాలు గట్టెక్కించే ప్రాజెక్ట్: పవన్ త్రివిక్రమ్ షూటింగ్ తేదీ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

తాజాగా విడుదలైన పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ సినిమా 'కాటమరాయుడు' ఆయన ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్‌ చేసింది. అయితే ఫ్యాన్స్‌కు ఓ శుభవార్త అందించాడు దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. సాధారణంగా సినిమాకు, సినిమాకు బాగా గ్యాప్‌ తీసుకునే పవన్‌.. త్రివిక్రమ్‌ సినిమాను ఏప్రిల్‌ ఆరో తేదీ నుంచే పట్టాలెక్కించేస్తున్నాడు.

సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' బయ్యర్ల

సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' బయ్యర్ల

'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' బయ్యర్ల సంక్షేమం కోసమని తీసిన 'కాటమరాయుడు' చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌లో లాగించేసారు. నిజం చెప్పుకోవాలంటే ప్రొడక్షన్ వ్యాల్యూ చాలా తక్కువ ఈ సినిమాకి. సరే ఉన్నంతలో లాగించేసారు. అమ్మకాలు బాగానే జరిగాయి. కానీ పవన్ సినిమా అంత తక్కువ నిర్మాణ విలువ కలిగి ఉండటం తో పడ్డ దెబ్బ కూడా మరీ చిన్నదని తీసిపారేయలేం..

అయితే కథా పరంగా

అయితే కథా పరంగా

అయితే కథా పరంగా, నిర్మాణ విలువల పరంగా ఎక్కడా క్వాలిటీ పాటించని కాటమరాయుడిని మరిపించడానికి త్రివిక్రమ్‌ సినిమా వెంటనే సెట్స్‌ మీదకి వెళుతోంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో స్టంట్‌ మాస్టర్‌ విజయన్‌ నేతృత్వంలో యాక్షన్‌ సీక్వెన్సెస్‌ను షూట్‌ చేయనున్నారట. ఏప్రిల్‌ 6 నుంచి ఈ చిత్రం షూటింగ్‌ మొదలవుతుంది. దసరాకి సినిమా విడుదల చేసేలా త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడు.

లొకేషన్స్‌తో సహా

లొకేషన్స్‌తో సహా

లొకేషన్స్‌తో సహా అన్నీ ఈ చిత్రానికి ముందే డిసైడ్‌ అయిపోయాయి. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ వంద కోట్ల బడ్జెట్‌ ఇచ్చాడట. పవన్‌, త్రివిక్రమ్‌ పారితోషికాలు కలుపుకుని ఈ చిత్రానికి వంద కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. ఈ సినిమా షూటింగ్‌ను కేవలం నాలుగు నెలల్లో పూర్తి చేసెయ్యాలని త్రివిక్రమ్‌ కృతనిశ్చయంతో ఉన్నాడట.

బతుకమ్మ పండుగనాటికి

బతుకమ్మ పండుగనాటికి

బతుకమ్మ పండుగనాటికి ఈ సినిమా థియేటర్లలోనికి వచ్చేస్తుందట. పవన్‌ కల్యాణ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కనిపించనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. కాబట్టి, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ ఏడాది పవన్‌ మరో సినిమాను విడుదల చేస్తాడన్నమాట.

త్రివిక్రం, పవన్ అంటేనే

త్రివిక్రం, పవన్ అంటేనే

త్రివిక్రం, పవన్ అంటేనే ఒక క్రేజీ కాంబినేషన్ కాబట్టి అంచనాలు భారీగానే ఉంటాయి. వంద కోట్లతో తీసే సినిమా కాబట్టి క్వాలిటీ ఎలాగుంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే త్రివిక్రమ్‌ సినిమా అంటేనే వినోదానికి మినిమమ్‌ గ్యారెంటీ కనుక మిస్‌ఫైర్‌ అయ్యే అవకాశాలు కూడా తక్కువే. సో ఇప్పుడు వచ్చిన రెండు సినిమాలూ తెచ్చిన లోటుని పూర్తి స్థాయిలో తుడిచే సినిమా ఇంకోటి వస్తుందన్నమాట..

English summary
Power Star Pawan Kalyan is again joining hands with his close friend Trivikram Srinivas and the regular shooting of a film in their combination is likely to begin from April 6. If sources close to Trivikram are to be believed, the regular shooting would begin with an action scene under the action choreography of fight master Vijayan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu