»   » దాసరిని పరామర్శించిన పవన్‌, ఇన్ఫెక్షన్ సోకకూడదని ...

దాసరిని పరామర్శించిన పవన్‌, ఇన్ఫెక్షన్ సోకకూడదని ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శకుడు దాసరి నారాయణరావును ప్రముఖ సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నిర్మాత శరత్‌మరార్‌తో కలిసి ఆసుపత్రి వచ్చిన పవన్‌.. దాసరి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Pawan, Trivikram Meet Dasari in Hospital

అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ''దాసరికి బాగా లేదనగానే బాధ అనిపించింది. దాసరి ఆరోగ్యంపై వైద్యులు నమ్మకంగా ఉన్నారు. రేపు వెంటిలేటర్‌ తీసేస్తామని చెప్పారు'' అని వెల్లడించారు.

Pawan, Trivikram Meet Dasari in Hospital

'మా' అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, సినీ రచయితలు పరుచూరి బ్రదర్స్ కూడా ఆయనను పరామర్శించారు. అయితే ఇన్ఫెక్షన్ సోకకూడదని సందర్శనకు ఎవరినీ లోపలికి అనుమతించడం లేదని వారు వెల్లడించారు. అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని, ఆయన రెండు మూడు రోజుల్లో కోలుకుంటారని వైద్యులు చెప్పినట్టు వారు తెలిపారు.

150 కి ఫైగా చిత్రాలను తెరకెక్కిచిన దాసరి , ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడు..దీంతో పాటు తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు.. ఈ లోపు దాసరి హాస్పటల్ లో జాయిన్ అవడం , ఇండస్ట్రీ ని షాక్ కు గురిచేసింది.

Pawan, Trivikram Meet Dasari in Hospital

వార్త తెలుసుకున్న అభిమానులు భారీ ఎత్తున హాస్పటల్ కు చేరుకొని దాసరి ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాసరిని మంచు మనోజ్‌, నటి జయసుధ, నిర్మాత అల్లు అరవింద్‌, దర్శకుడు రాఘవేంద్రరావు పరామర్శించారు. నిన్న దాసరి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం మెరుగ్గానే అల్లు అరవింద్‌ తెలిపారు.

English summary
Pawan Kalyan and Trivikram Srinivas have visited Dasari Narayana Rao who is in the Intensive Care Unit of KIMS in Hyderabad and wished him a speedy recovery.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu