Just In
- 16 min ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 47 min ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 1 hr ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 2 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- News
షర్మిల నిజంగానే జగన్‌ను ధిక్కరించబోతున్నారా... ఆ ప్రచారంలో అసలు లాజిక్ ఉందా...?
- Automobiles
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- Finance
మార్చి తర్వాత రూ.5, రూ.10, రూ.100 నోట్లు చెల్లవా? ప్రభుత్వం ఏమంటోంది
- Lifestyle
ఇంట్లో మీ రక్తపోటును తనిఖీ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన 7 విషయాలు
- Sports
India vs England: ప్రేక్షకుల మధ్య టీ20 సిరీస్?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్-త్రివిక్రమ్ మూవీ ముహూర్తం డేట్ ఫిక్స్!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ నెల 23 న హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంచనంగా ప్రారంభమవుతుందని. అయితే, రెగ్యులర్ షూటింగు మాత్రం వచ్చే నెల నుంచి జరుగుతుందని తెలుస్తోంది. అధికారికంగా ఈ విషయం ఖరారు కావాల్సి ఉంది.
ఈ చిత్రానికి 'హరే రామ హరే కృష్ణ', 'సరదా' టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ మాత్రం ఈచిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదని, నేను చెప్పే వరకు ఏ వార్తను నమ్మ వద్దని ఇటీవల ఓ ఇంట్వర్యూలో తేల్చి చెప్పారు.
చేతిలో ఫుల్లుగా సినిమాలు ఉన్న కథానాయిక సమంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకు ఎంపికయినట్లుగా ఫిల్మ్ నగర్ సమాచారం. పవన్ సినిమా కారణంగానే రామ్ చరణ్ 'ఎవడు'లో ఆమె అవకాశం కోల్పోయిందనే ప్రచారం కూడా జరిగింది.
పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో జల్సా సినిమా వచ్చింది. జల్సా కలెక్షన్లను కురిపించింది. దీంతో త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్‌కు సమంత తోడు కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించనున్నారు.