»   » దీపావళి కానుకగా., 19న పవన్ సినిమా టైటిల్ ప్రకటన?

దీపావళి కానుకగా., 19న పవన్ సినిమా టైటిల్ ప్రకటన?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Here Is The Pawan Kalyan's New Film Title పవన్-త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఏంటో తెలుసా?

పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా మొదలయ్యి చాలా కాలం అవుతోంది. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ తప్ప మరేమీ విడుదల కాలేదు. టైటిల్ ను కన్ఫర్మ్ చేయలేదు. మరో మూడు నెలల్లో సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు కానీ ఇంకా టైటిల్ విషయంలో మాత్రం స్పష్టతకు రాలేదు.

రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినప్పటికీ గత కొన్ని రోజులుగా వినిపిస్తోన్న 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ మాత్రం కథకు సరిపడే టైటిల్ అంటున్నారు. ఈ చిత్ర నిర్మాణ సంస్థ 'హారిక హాసిని క్రియేషన్స్' ఇటీవలే ఫిలిం ఛాంబర్లో ఈ టైటిల్ రిజిస్టర్ చేయడంతో అందరికీ ఒక స్పష్టత వచ్చేసింది.

Pawan Trivikram Movie Title To Announce On This 19th

ఐతే ఈ టైటిల్ అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారు.. టైటిల్ డిజైన్ ఎలా ఉంటుంది అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం పవన్-త్రివిక్రమ్ సినిమా టైటిల్ ను ఈ నెల 19న దీపావళి కానుకగా ప్రకటిస్తారట. ఆ రోజు ఈ సినిమాలో పవన్ కొత్త లుక్ తో కలిపి టైటిల్ లోగో లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. విడుదలకు ఇంకో మూడు నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో టైటిల్ ప్రకటనలో ఇంకా ఆలస్యం చేయొద్దని చిత్ర బృందం భావిస్తోంది.

ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇంకో 40 రోజుల దాకా షూటింగ్ చేయాల్సి ఉందట. ఇంకొన్ని రోజుల్లోనే ఫారిన్ షెడ్యూల్ మొదలవుతుంది. నవంబరు నెలాఖరుకల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సంక్రాంతికి సినిమా రిలీజవుతుందా లేదా అన్న సందేహాలకు ఇప్పటికే చిత్ర బృందం తెరదించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2018 జనవరి 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

English summary
Powerstar Pawan Kalyan’s birthday, Dussera fest had arrived and gone, but the makers failed to fix a title for his ongoing flick under director Trivikram. But as per the source Trivikram planing to Announce the Title On This 19th .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu