»   » ఇందుకే పవన్ అంటే వాళ్ళకంత పిచ్చి, ఏ స్టార్ హీరో ఇలా ఆలొచించలేడు కాబట్టే

ఇందుకే పవన్ అంటే వాళ్ళకంత పిచ్చి, ఏ స్టార్ హీరో ఇలా ఆలొచించలేడు కాబట్టే

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్... టాలీవుడ్ లో ఈ పేరుకే ఒక ప్రత్యేకథ ఉంది. సినిమా హిట్ అయితే స్టార్ క్రేజ్ పడిపోవటమో, హిట్ అయితే రేయిజ్ అవటమో అందరి విషయం లో ఓకేనేమో గానీ పవన్ విషయం లో మాత్రం కాదు పవర్ స్టార్ ఎప్పుడూ సూపర్ హిట్ ఎందుకంటే న‌టుడిగా అభిమానించే వారి కంటే.. ఆయ‌న్ను వ్య‌క్తిగా అభిమానించే వారే ఎక్కువమంది.

పవన్ మాత్రమే

పవన్ మాత్రమే

పవన్ కళ్యాణ్ తెరమీద ఉండే తీరు వేరూ జనం మధ్య లో ఉన్నప్పుడు ఉండే తీరు వేరు. పవన్ కళ్యాణ్ ఒక పెద్ద స్టార్ అన్న విషయం పట్టించుకోని ఒకే ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారూ అంటే అది పవన్ మాత్రమే. అంత సింపుల్ గా అంతకంటే కలుపుగోలు గా ఉంటాడు. బిడియంగా ఉంటూనే అవసరమున్నప్పుడు చొరవ చూపిస్తాడు.

ఎవ్వరికీ అర్థం కాని క్యారెక్టర్

ఎవ్వరికీ అర్థం కాని క్యారెక్టర్

ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కాని క్యారెక్టర్ అది. అందుకే పవన్ అంటే అతని సినిమాలని బట్టే కాదు వ్యక్తిగతంగా కూడా అతన్ని ఇష్టపడతారు జనం. ఇక అభిమానులసంగతి చెప్పేదేముంది.. ప్రస్తుతం త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో పవన్‌ కల్యాణ్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సార‌థి స్టూడియోలో

సార‌థి స్టూడియోలో

ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం సార‌థి స్టూడియోలో జోరుగా సాగుతోంది.ఈ స్టూడియో నగరం మధ్యలో ఉండడంతో పవన్‌ను చూసేందుకు అభిమానులు విపరీతంగా వచ్చారు. అందుకే.. వారు నిత్యం ప‌వ‌న్ కోసం సార‌థి స్టూడియో ద‌గ్గ‌ర పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నారు. అదీ పవన్ వచ్చేటప్పుడూ వెళ్ళేటప్పుడు అతన్ని దూరం నుంచైనా చూడాలని, తమ వైపు చూసి నవ్వుతూ చెయ్యి ఊపితే చాలూ అని అక్కడ గుమిగూడుతున్నారు.

లాభం ఏమిటీ? అంటే

లాభం ఏమిటీ? అంటే

ప‌వ‌న్ క‌నిపించిన వెంట‌నే కేరింత‌లు కొట్ట‌టం.. ఆయ‌న వెళ్లే ట‌ప్పుడు.. వ‌చ్చేట‌ప్పుడు అభివాదం చేయ‌టం కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్లే ప‌వ‌న్ సైతం.. అభిమానుల‌కు అభివాదం చేస్తున్నారు. దీని వల్ల వచ్చే లాభం ఏమిటీ? అంటే అదంతే కొన్ని లాభనష్టాల లెక్కల్లోకి రావు అదొక ఆనందం, ఎమోషన్ దానికి, లెక్కలూ కారణాలూ ఉండవు.

వాట‌ర్ బాటిల్స్

ఇదంతా ఒక ఎత్తు అయితే.. సార‌థి స్టూడియో గోడ‌ల మీద కూర్చొని కొంత‌మంది గంట‌ల కొద్దీ వెయిట్ చేస్తున్న విష‌యాన్ని గుర్తించిన ప‌వ‌న్‌.. త‌న సిబ్బంది చేత వారికి వాట‌ర్ బాటిల్స్ పంపిస్తున్నార‌ట‌. దీంతో.. ప‌వ‌న్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నార‌ట‌. చిన్న చిన్న విష‌యాల్ని సైతం ప‌ట్టించుకునే ప‌వ‌న్ తీరే.. ఆయ‌న ఫ్యాన్స్ ను మ‌రింత అభిమానించేలా చేస్తుంటార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

English summary
When Pawan kalyan noticed some of the fans sitting on the parapet wall of Sarathi Studios for several hours, Pawan Kalyan asked the spot boys to supply water bottles for them. This gesture has really touched the hearts of the Fans and they had gone crazy.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu