»   » పవన్‌.. మీరెప్పుడు సీఎం అవుతారు?

పవన్‌.. మీరెప్పుడు సీఎం అవుతారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ''వాళ్లు ముఖ్యమంత్రి అవుతారు, వీళ్లు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పడం కాదు. మీరెప్పుడు ముఖ్యమంత్రి అవుతారో చెప్పండి'' అంటూ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ని ప్రముఖ దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి ప్రశ్నించారు. 'రేయ్‌' చిత్రంలోని 'పవనిజం' అనే గీతాన్ని మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో నారాయణమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పైవిధంగా స్పందించారు.

ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ....''చిరంజీవి నలభై ఏళ్ల కంచుకోటను బద్దలుకొట్టి మెగాస్టార్‌ అయ్యారు. ఆయన నీడలో పవన్‌ కల్యాణ్‌ పవన్‌ స్టార్‌గా ఎదిగారు. పవన్‌ కల్యాణ్‌ మానవత్వం ఉన్న వ్యక్తి. ఆయన ప్రజల సమస్యల కోసం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, పార్టీ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలి. నాకూ ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది. కానీ నేను పార్టీపెట్టలేదు కదా..? పవన్‌ పార్టీ పెట్టారు. అందుకే ఆయన సీఎం అవ్వాలి. రొనాల్డ్‌ రీగన్‌, ఎన్టీఆర్‌, ఎమ్జీఆర్‌లా రాజకీయాల్లోనూ పేరు తెచ్చుకోవాలి''అని పేర్కొన్నారు.

సాయిధరమ్‌తేజ్‌ హీరోగా సయామీఖేర్‌, శ్రద్ధాదాస్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం 'రేయ్‌'. వైవీఎస్‌ చౌదరి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌పై రూపొందించిన ఓ పాటను 'రేయ్‌ విత్‌ పవనిజం' పేరిట విడుదల చేశారు.

ప్రసాద్‌ ల్యాబ్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నటుడు ఆర్‌.నారాయణమూర్తి, ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మార్చి 27న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Pawan, When will you become CM?

‘‘పవన్‌కల్యాణ్‌ సినిమా ఇండస్ట్రీకి చిరంజీవిగారి తమ్ముడిగా పరిచయమైనప్పటికీ, తన సొంత వ్యక్తిత్వంతో, స్వశక్తితో తనవైన మేనరిజమ్స్‌తో, సబ్జెక్ట్‌ సెలక్షన్స్‌తో, తనకే ప్రత్యేకమైన సాంగ్స్‌ స్టయిల్‌తో, తనదైన బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అత్యద్భుతమైన స్టార్‌డమ్‌ తెచ్చుకుని పవర్‌స్టార్‌గా ఎదిగారు. ఆయన అభిమానులకు ఓ ఎనర్జీ టానిక్‌లాగా ‘పవనిజం' పాటను విడుదల చేయబోతున్నాం. ఈ పాటకు స్వర్గీయ చక్రి బాణీలిచ్చారు. చంద్రబోస్‌ రాసిన ఈ పాటకు నోయల్‌ షాన్‌ రాప్‌ రాసుకుని, ఆ రాప్‌ని ఆయనే పాడాడు. ప్రధాన పాటను నరేంద్ర పాడారు'' అని ఆయన వివరించారు.

సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో ఓ డాన్సర్ లా కనిపిస్తాడు. డాన్సర్ గా అదిరిపోయే స్టెప్స్ వేశాడని సమాచారం. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేసేలా ఈ సినిమాలో అదిరిపోయే స్టెప్స్ తో మెగా అభిమానులకు పెద్ద ట్రీట్ ఇవ్వనున్నాడని ఈ సినిమా చూసిన కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా చివరి సాంగ్ లో సూపర్బ్ స్టెప్స్ తో ఆకట్టుకుంటాడని సమాచారం. సాయి ధరమ్ తేజ్ సరసన సయామీ ఖేర్, శ్రద్ధ దాస్ హీరోయిన్స్ గా నటించారు. వైవిఎస్ చౌదరి నిర్మించిన ఈ సినిమాని ఎక్కువ భాగం కరేబియన్ దీవులు, కాలిఫోర్నియాలో షూట్ చేసారు. స్వర్గీయ చక్రి సంగీతం అందించాడు.

వైవీఎస్‌ చౌదరి మాట్లాడుతూ ''వెస్టిండీస్‌లో సెటిల్‌ అయిన ఓ కుటుంబానికి చెందిన యువకుడి కథ ఇది. అమెరికాలో జరిగే ఓ సంగీత పోటీ టైటిల్‌ పోరు నేపథ్యంలో చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఎక్కువ భాగం వెస్టిండీస్‌, అమెరికాలోనే చిత్రీకరించాం. అందుకే ఆ ప్రాంతాల్లో సినిమా ప్రత్యేక షోలు ఏర్పాటు చేస్తున్నాం. వెస్టిండీస్‌లో విడుదల కాబోయే తొలి తెలుగు సినిమా ఇది. '' అని తెలిపారు. ఈ చిత్రాన్ని వెస్టిండీస్ లో విడుదల చేస్తున్నారు. అక్కడ ఇంతకు ముందు ఏ తెలుగు సినిమా విడుదల కాలేదు. ఈ విషయాన్ని వైవియస్ చౌదరి మీడియాకు తెలియచేసారు.

అలాగే...''ఈ సినిమాకి చాలా సమయం పట్టింది. దానికి కారణం... ఈ సినిమాలోని విషయం అలాంటిది. సినిమా చూస్తే ఇంతకాలం ఎందుకు పట్టిందో మీకే అర్థం అవుతుంది'' అన్నారు.చిత్రంలో అర్పిత్‌ రాంకా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, అలీ, నరేష్‌, జె.పి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: గుణశేఖరన్‌.

English summary
R.Naryana Murthy stated, 'Since you've floated your own political party Janasena, please don't wish to see someone else as CM and PM. Tell us, when will you become CM and serve people directly?' Murthy made aforementioned comments during the unveiling of the song on Pawanism from the film Rey starring Sai Dharam Tej.
Please Wait while comments are loading...