‘పవనిజం’ : అదరగొట్టిన పవన్ ఫ్యాన్స్ (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ అభిమానులు 'పవనిజం' కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో 'పవనిజం' టైటిల్ తో ఓ చిత్రం కూడా ఆ మధ్య మొదలైంది. గతేడాది ఆగస్టులో జరిగిన ఈ చిత్రం లాంచింగ్ కార్యక్రకమానికి నాగబాబు ముఖ్య అతిధిగాహాజరయ్యి క్లాప్ కొట్టారు. పవన్ అభిమానులంతా ఈ చిత్రం చూస్తారనే నమ్మకంతో ఉన్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. పవన్‌కళ్యాణ్‌ అభిమానులు తలుచుకుంటే సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకురాగలరు అనే కథాంశంతో ఇ.కె.చైతన్య దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పవనిజం'. ధర్మశాస్త్రే ఫిలింస్‌ బ్యానర్‌పై శ్యామ్‌శ్రీన్‌ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి కనిష్క సంగీతం అందించారు. ఆడియో వేడుకకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

నటీనటులు

నటీనటులు

ఈ చిత్రంలో సుధీర్‌, సింధు, మహి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇంకా నాగబాబు, ఎమ్మెస్‌ నారాయణ, చంద్రమోహన్‌, సప్తగిరి, ఫణి తదితరులు నటిస్తున్నారు.

కాన్సెప్టు ఇదీ...

కాన్సెప్టు ఇదీ...

పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ తలుచుకుంటే సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకురాగలరు అనేది ఈ చిత్ర కథాంశం. ఇందులో ఓ చిన్న ప్రేమ కథ కూడా మిళితమై ఉంది. కామెడీ కూడా ఉంది.

నిర్మాత మాట్లాడుతూ

నిర్మాత మాట్లాడుతూ

చిత్ర నిర్మాత శ్యామ్‌ మాట్లాడుతూ.. 'దర్శకుడు చెప్పిన కథ నచ్చింది. నిర్మాతగా నా ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారనే ఆశిస్తున్నా'నని అన్నారు.

హీరో మాట్లాడుతూ...

హీరో మాట్లాడుతూ...

కథానాయకుడు సుధీర్‌ మాట్లాడుతూ..'పవనిజం చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతుండడం చాలా సంతోషంగా ఉంది. నేను పవన్‌కళ్యాణ్‌ గారికి పెద్ద అభిమానిని.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నా'నని అన్నారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌ ముత్యాల, ఆర్ట్‌: భాస్కరరెడ్డి, సంగీతం:కనిష్క.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X