»   » అమెరికాలో ‘పవనిజం’ సెలబ్రేషన్స్ ఏర్పాట్లు...

అమెరికాలో ‘పవనిజం’ సెలబ్రేషన్స్ ఏర్పాట్లు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఆరు నగరాలైన సిలికాన్ వ్యాలీ, లాస్ ఏంజిల్స్, డల్లాస్, డెట్రాయిట్, న్యూజెర్సీ, చికాగోల్లో అక్టోబర్ 11న ‘పవనిజం' సెలబ్రేషన్స్ జరిపేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 22న అభిమానులు సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ ఐడియాలజీకి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలకు pawanism@usa.com సంప్రదించండి.

మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే, ఉమన్స్ డే.........వీటి మాదిరిగానే అక్టోబర్ 11ను 'వరల్డ్ పవనిజం డే' గా జరుపుకోవాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు 2013లోనే నిర్ణయించారు. ఇదే రోజును ఎందుకు ఎంపిక చేసారంటే....పవన్ కళ్యాన్ నిటించిన తొలి సినిమా అక్టోబర్ 11, 1996లొ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆ డేట్ ఫిక్స్ చేసారన్నమాట.

Pawanism USA Event details

ఇండియాతో పాటు అమెురికా తదితర దేశాల్లో ఉన్న అభిమానులు వరల్డ్ పవనిజం డేను సెలబ్రేట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఆదర్శంగా 'పవనిజం' కాన్సెప్టుతో సమాజానికి ఏదో ఒక మంచి చేద్దాం అనే ఉద్దేశ్యంతో అభిమానుంలంతా ముందుకు సాగుతున్నారు.

గతంలో ఓసారి పవన్ కళ్యాణ్... పవనిజం గురించి మాట్లాడుతూ.....'పవనిజం అంటే అదో అందమైన అభిమానుల ప్రపంచం. నా అభిమానులు నాకోసం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద ఫంక్షన్లు చేయనక్కర్లేదు. నన్ను అభిమానించే అభిమానుల ప్రతి ఒక్కరి కళ్ళలోనూ చెరగని ఆనందాన్ని చూడాలనుకుంటాను. వాళ్ళు సమాజం పట్ల భాద్యత కలిగిన ఒక పౌరిడిగా తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలనేది మాత్రమే వారి నుంచి ఆశిస్తున్నానని' ఆయన అన్నారు.

English summary
6 cities across USA (Silicon Valley (San Jose), Los Angeles, Dallas, Detroit, New Jersey and Chicago) are celebrating Pawanism with an event on 11th OCT 2015. The committee had a kick off meeting on 22nd September, core volunteers of the above mentioned cities have discussed on why we are organizing this event and also how.
Please Wait while comments are loading...