Don't Miss!
- News
girl: కాలేజ్ అమ్మాయి మీద జరదా బీడా ఉమ్మేశాడు. అమ్మాయి ముఖం మీద కత్తితో ?
- Sports
IND vs NZ: హార్దిక్ పాండ్యా.. ఇంత స్వార్థమా? నీ దోస్తుల కోసం పృథ్వీ షాను పక్కనబెడతావా? ఫ్యాన్స్ ఫైర్
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
మధ్యలో బన్నీ, త్రివిక్రమ్‌ను లాగింది.. అంత కంటే ఏం చేయలేరంటూ బాలీవుడ్ దుమ్ము దులిపిన పాయల్
ప్రస్తుతం బాలీవుడ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. సుశాంత్ సింగ్ మరణం తరువాత బాలీవుడ్ పరిస్థితి మరీ ఘోరంగా దిగజారిపోయింది. ప్రతీ ఒక్కరూ నెపోటిజం, మాఫియా అంటూ బాలీవుడ్‌ను ఏకిపారేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో రీమేక్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ విషయంపై పాయల్ ఘోష్ స్పందింస్తూ ఓ రేంజ్‌లో ఏకిపారేసింది. అసలే సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్‌ను ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తూ వస్తోంది పాయల్. తాజాగా రీమేక్‌ల విషయంలోనూ మరో లెవెల్‌లో కామెంట్ చేసింది.

సోషల్ మీడియాలో వైరల్..
ప్రయాణం, ఊసరవెల్లి చిత్రాలతో ఫేమస్ అయిన పాయల్ ఘోష్ ఈ లాక్ డౌన్ కాలంలో అంతకు పదింతలు ఫేమస్ అయింది. మీరాచోప్రా వివాదం, సుశాంత్ మరణం, బాలీవుడ్, దక్షిణాది పరిశ్రమలపై కామెంట్స్ చేయడం, అవి కాస్తా మీడియాలో ప్రధానంగా వైరల్ కావడంతో పాయల్ పేరు మార్మోగిపోయింది.

బాలీవుడ్ ఓ నరకం..
సుశాంత్ మరణం అనంతరం బాలీవుడ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో పాయల్ కూడా స్పందించింది. బాలీవుడ్‌లో హీరోయిన్లను చిన్న చూపు చూస్తారని, కించపరుస్తారని చెప్పుకొచ్చింది. అదే దక్షిణాదిలో, తెలుగులో హీరోయిన్లను ఎంతో గౌరవిస్తారని, అది స్వర్గం, బాలీవుడ్ నరకమని ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. తాజాగా కంగనాపై జరుగుతున్న ట్రోల్స్ పైనా స్పందించింది.

మద్దతిచ్చిన పాయల్..
సుశాంత్ విషయంలో కంగనా మాట్లాడుతూ తాప్సీని బీ గ్రేడ్ యాక్టర్ అని సంబోధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కంగనాపై ట్రోల్స్ జరిగాయి. వాటిపై పాయల్ ఘోష్ ఫైర్ అయింది. సోఫాలో కూర్చుని, కాఫీ తాగుతూ ఎదుటి వారి గురించి చెడ్డగా మాట్లాడటం ఈజీయేనని చెప్పుకొచ్చింది. కానీ కంగనాను అందరూ కలిసి ఇలా టార్గెట్ చేయడం చూస్తుంటేనే బాలీవుడ్ అంటే ఏంటి? అందులోని మనుషులు ఎలాంటి వారో అర్థమవుతోందని ఫైర్ అయింది.

తాజాగా రీమేక్‌లు..
బాలీవుడ్‌లో ప్రస్తుతం రీమేక్‌ల పర్వం జరుగుతోంది. ఇప్పటికే కబీర్ సింగ్ బాక్సాఫీస్ షేక్ చేసింది. అప్పటి నుంచి తెలుగు చిత్ర పరిశ్రమపై బాలీవుడ్ కన్ను పడింది. ఇక ఇదే వరుసలో జెర్సీ చిత్రాన్ని రీమేక్ చేయబోతోన్నారు. తాజాగా హిట్ సినిమాను రీమేక్ చేయబోతోన్నట్టు ప్రకటించేశారు. ఎఫ్2ను కూడా రెడీ చేస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అల వైకుంఠపురములో చిత్రాన్ని కూడా రీమేక్ చేయబోతోన్నారని తెలిసింది.
Recommended Video

అంత కంటే ఏం చేయలేరు..
అల వైకుంఠపురములో చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయడంపై పాయల్ ఘోష్ స్పందించింది. ‘బాలీవుడ్‌కు ఏమైంది? అల వైకుంఠపురములో చిత్రాన్ని రీమేక్ చేయాలని అనుకుంటోంది. అల్లు అర్జున్ అద్భుతమైన నటుడు.. ఒకవేళ త్రివిక్రమ్ గనుక తెరకెక్కించకపోతే అది కచ్చితంగా వేస్ట్.. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇక్కడ కంటెంట్ లేదు.. కేవలం రీమేక్స్ తప్పా ఏం చేయలేరు' అంటూ బాలీవుడ్‌ను పాయల్ ఏకిపారేసింది.