»   » ఇక్కడ అన్యాయమే, జాతీయ స్థాయిలో న్యాయం...‘పెళ్లిచూపులు’ డైరెక్టర్ హ్యాపీ!

ఇక్కడ అన్యాయమే, జాతీయ స్థాయిలో న్యాయం...‘పెళ్లిచూపులు’ డైరెక్టర్ హ్యాపీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో అతి సాధారణమైన చిన్న సినిమాగా సంచలన విజయం సాధించిన చిత్రం 'పెళ్లి చూపులు'. ఒక డిఫరెంట్ కాన్సెప్టుతో, విభిన్నంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకలు బ్రహ్మరథం పట్టారు.

అయితే అవార్డుల విషయానికొస్తే... 'పెళ్లి చూపులు' చిత్రానికి దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ఈ మధ్య జరిగిన కొన్ని అవార్డు ఫంక్షన్లే ఇందుకు నిదర్శనం. అయితే ఈ విషయమై ఈ చిత్ర దర్శకుడు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసారు.

అయితే 64వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో 'పెళ్లి చూపులు' చిత్రానికి తగిన గౌరవం దక్కింది. ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికవ్వడంతో పాటు... ఈచిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు ఉత్తమ మాటల రచయితగా జాతీయ అవార్డు దక్కింది.

జాతీయ స్థాయిలో న్యాయం

అయితే తన చిత్రానికి జాతీయ స్థాయిలో న్యాయం జరుగడం తరుణ్ భాస్కర్ హ్యాపీగా ఉన్నాడు. ‘థాంక్ యూ. మా నాన్న చాలా సంతోష పడే సందర్భం ఇది. నాన్న... మీ ఆశీర్వాదం వల్లే ఇదంతా జరిగింది అంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేసారు.

తెలుగు సినీ చరిత్రలో తొలిసారి

తెలుగు సినీ చరిత్రలో తొలిసారి

ఈ పెళ్లిచూపులు సినిమా స్క్రిప్ట్ టైటిల్ 'అనుకోకుండా' అని ఉన్నప్పుడే నేను చదివాను. ఒకే ఒక్క వాక్యం కొంచెం సెక్సిస్టు గా ఉందేమో అనే సజేషన్ ఇవ్వడం తప్ప మిగతా స్క్రిప్ట్ మొత్తం వేలు పెట్టలేనంత పకడ్బందీగా రాసుకున్నాడు. నిర్మాతల చేతులు మారుతున్నప్పుడు, వాళ్ళు అడిగిన మార్పులు చేర్పులు చెయ్యకుండా నిలబడ్డాడు. తను రాసిన రాత మీద ఉన్న నమ్మకమే ఈ రోజు తన గీత మార్చింది. ఇప్పటివరకూ తెలుగు సినిమా చరిత్రలో రచనకు జాతీయ అవార్డు రాలేదు. ఇప్పుడు తరుణ్ భాస్కర్ తీసుకువచ్చాడు...... అంటూ రచయిత మహేష్ కత్తి పేర్కొన్నారు.

‘పెళ్ళిచూపులు'కి పడిన కష్టం అంతా ఇంతా కాదు

‘పెళ్ళిచూపులు'కి పడిన కష్టం అంతా ఇంతా కాదు

‘పెళ్లి చూపులు' మూవీ విడుదల ముందు దర్శకుడు తరుణ్ భాస్కర్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఫైనల్ ఔట్‌పుట్‌ను పట్టుకొని చాలామంది చుట్టూ తిరిగాడు. కొందరు చిన్న సినిమా అని, కొందరు ఇది షార్ట్‌ఫిల్మ్‌లా ఉందని, ఇలా ఒక్కో కారణంతో సినిమాను పక్కనపెట్టేసిన రోజులున్నాయని తరుణ్ తెలిపారు. పెళ్ళిచూపులు సినిమా ఒక సినిమాగా పనికిరాదని, ఆ సినిమాకు లెక్కలు కట్టి ఇన్ని లక్షలకు ఎక్కువ కలెక్ట్ చేయదని చెప్పిన వారూ ఉన్నారని, ఇలాంటివెన్నో కష్టాలను దాటి సినిమా బయటకొచ్చి తమకో సక్సెస్ తెచ్చిందని, ‘పెళ్ళిచూపులు' విజయం ఊరికనే రాలేదని తరుణ్ భాస్కర్ తెలిపారు.

తరుణ్ భాస్కర్ సంచలన కామెంట్స్

తరుణ్ భాస్కర్ సంచలన కామెంట్స్

ఇటీవల జరిగిన ఐఫా అవార్డుల వేడకపై తరుణ్ భాస్కర్ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
"Thank you. My father would have been the happiest. Dad, these are all your blessings !" Pelli Choopulu director Tharun Bhascker Dhaassyam about national award.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu