»   » డి.సురేష్ బాబు 'పెళ్లిచూపులు' ప్రారంభం

డి.సురేష్ బాబు 'పెళ్లిచూపులు' ప్రారంభం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ, రీతు వర్మ హిరో హిరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం 'పెళ్లిచూపులు' చిత్ర షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభమైంది. దీనికి కొత్త దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌ క్లాప్‌ ఇవ్వగా.. నటుడు అశోక్‌ కుమార్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు... ఈ చిత్రాన్ని ధర్మపథ క్రియేషన్స్‌, బిగ్‌బెన్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి డి.సురేష్‌బాబు క్లాప్‌నిచ్చారు. అశోక్‌కుమార్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. శ్రీనివాస్‌ అవసరాల గౌరవ దర్శకత్వం వహించారు.

Pelli Chupulu A Traditional Telugu Film launched.

దర్శకుడు మాట్లాడుతూ ''సంప్రదాయ వాతావరణంలో సాగే ఆధునిక ప్రేమకథ ఇది. ఒక కొత్త రకమైన సినిమా చేద్దామని చెప్పగానే ఎక్కడా అడ్డు చెప్పకుండా కావల్సినంత స్వేచ్ఛ ఇచ్చారు నిర్మాతలు. విజయ్‌, రీతూకి మంచి పేరు తీసుకొచ్చే చిత్రమవుతుంది'' అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ ''దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ అనేక లఘు చిత్రాలు తీశాడు. ఆయన తయారు చేసిన ఈ కథలో కొత్తదనం ఉంది. 'ఉయ్యాల జంపాల', 'మనం'లా ఒక మంచి అనుభూతినిచ్చే సినిమా అవుతుంది. లైవ్‌ రికార్డింగ్‌తో చిత్రాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తున్నామ''న్నారు.

చిన్న చిత్రాల ద్వారా చిత్ర పరిశ్రమకు కొత్త వారిని పరిచయం చేయడం ఆనందంగా ఉందని నిర్మాతలు పేర్కొన్నారు. 49 రోజుల షూటింగ్‌తో ఈ చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. చిత్రానికి ఛాయాగ్రహణం: నగేష్‌, సంగీతం: వివేక్‌ సాగర్‌

Read more about: suresh babu, ritu varma, ashok kumar
English summary
Pelli Chupulu Movie Opening event held at Annapurna Studio.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu