»   » రోడ్డు ప్రమాదంలో సినీ నిర్మాత మృతి

రోడ్డు ప్రమాదంలో సినీ నిర్మాత మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హైదరాబాద్‌ బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నిర్మాత నాగిరెడ్డి మృతి చెందగా దర్శకుడు మదన్‌కు గాయాలయ్యాయి. శంషాబాద్‌ విమానాశ్రయం ఠాణా పరిధిలో శనివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.

Pelli Pusktakam Producer Nagi Reddy is Dead

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఎస్సై హరిప్రసాద్‌ రెడ్డి వివరాల ప్రకారం.. పెళ్లి పుస్తకం (2013) చిత్ర నిర్మాతల్లో ఒకరైన పి.నాగిరెడ్డి (33), అతని మిత్రుడు, దర్శకుడు మదన్‌లు కారులో శనివారం అనంతపురం నుంచి నగరానికి వస్తున్నారు. బాహ్య వలయ రహదారిపై ఒక హోటల్‌ సమీపంలో ఆగి ఉన్న డీసీఎంను వీరి కారు ఢీకొట్టింది.

డ్రైవింగ్‌ సీట్లో ఉన్న నాగిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఈయనది అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి. కారులో ఉన్న దర్శకుడు మదన్‌ గాయాలతో బయటపడ్డారు. మదన్‌ 'పెళ్త్లెన కొత్తలో..' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయనను హైటెక్‌ సిటీలోని హిమగిరి ఆసుపత్రికి తరలించారు.

Pelli Pusktakam Producer Nagi Reddy is Dead

యువ నిర్మాత ప్రమాదంలో మృతి చెందడం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర ద్రిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. రామానాయుడు మరణం నుండి ఇంకా చిత్ర పరిశ్రమ కోలుకోలేదు. ఇంతలో మరో దురదృష్టకరమైన వార్త వినాల్సి రావడం శోచనీయం. నాగిరెడ్డి మృతికి వన్ ఇండియా తెలుగు సంతాపం తెలియచేస్తోంది.

English summary
Nagi reddy ,The Producer for the New Film “Pelli Pustakam” of Rahul ravindran and neethi taylor is died in road accident.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu