»   » తరుణ్ కాస్త జాగ్రత్త...! "పెళ్ళిచూపులు" తో ఆగిపోవద్దు

తరుణ్ కాస్త జాగ్రత్త...! "పెళ్ళిచూపులు" తో ఆగిపోవద్దు

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెళ్ళి చూపులు సినిమాతో తరుణ్ భాస్కర్ ఒక్కసారి టాక్ ఆఫ్ టాలీవుడ్ అయిపోయాడు. చిన్న సినిమా అని తేలిగ్గా తీసుకోవద్దంటూ టాలీవుడ్ లో యువదర్శకుల అవసరం ఎంత ఉందో ఒక్క సినిమాతోనే చెప్పాడు తరుణ్ భాస్కర్. పెళ్ళి చూపులు వచ్చినప్పుడు ఎన్టీఆర్‌లాంటి టాప్ రేంజ్ స్టార్ కూడా ఓపెన్‌గా పెళ్ళి చూపులు సినిమా గొప్పదనం గురించి మాట్లాడి ఆ సినిమాకు హెల్ప్ అయ్యాడు. అయితే ఆ తర్వాత అనుకోకుండానే ఎన్టీఆర్‌ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు తరుణ్ భాస్కర్.

జనతా గ్యారేజ్'కు అవార్డు

జనతా గ్యారేజ్'కు అవార్డు

ఐఫా అవార్డుల వేడుకలో 'పెళ్లిచూపులు' లాంటి చిన్న సినిమాకు కాకుండా టీఆర్పీ కోసమే ఎన్టీఆర్ సినిమా 'జనతా గ్యారేజ్'కు అవార్డు ఇచ్చారన్న అర్థం వచ్చేలా అతను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా కోపం తో ఎవరో తరుణ్ భాస్కర్ వికీ పీడియా పేజ్ లో ఉన్న ఫొటో స్తానం లో తరుణ్ భాస్కర్ చనిపోయినట్టు గా తెలిపే ఫొటో అప్లోడ్ చేసారు.

మాటలు కొంచెం శ్రుతి మించాయి

మాటలు కొంచెం శ్రుతి మించాయి

'పెళ్లిచూపులు' 50 రోజులు పూర్తి చేసుకున్న సమయంలో అతను ఒక లెంగ్తీ ఫేస్ బుక్ పోస్టు పెట్టాడు. ఈ సినిమాను ఎంతమంది వెనక్కి లాగారో.. దీని గురించి ఎంత తేలిగ్గా మాట్లాడారో చెప్పే క్రమంలో అతడి మాటలు కొంచెం శ్రుతి మించాయి. ఆ తర్వాత 'పెళ్లిచూపులు' సినిమాకు అవార్డులివ్వలేదంటూ ఐఫా, మా టీవీ నిర్వాహకుల్ని ఉద్దేశించి కూడా కొంచం ఘాటుగానే మాట్లాడాడు.

 మంచి సినిమానే

మంచి సినిమానే

తరుణ్ భాస్కర్ తీసింది మంచి సినిమానే. ఆ సినిమా గొప్ప విజయం సాధించిన మాటా వాస్తవమే. 'పెళ్లిచూపులు' ఒక ట్రెండ్ సెట్టర్‌ అనడంలో.. ఆ సినిమా ఎందరికో స్ఫూర్తినిచ్చిందనడంలోనూ సందేహం లేదు. కానీ ఇలా మాట్లాడటం అతన్ని ఇంకా చిక్కుల్లోకే నెడుతుంది అంటం లో సందేహం లేదు.

నష్టమే చేస్తుంది

నష్టమే చేస్తుంది

ఇప్పటికే 'వన్ ఫిల్మ్ వండర్'గా మిగిలిపోయిన దర్శకులు చాలామంది ఉన్నారు టాలీవుడ్లో. తరుణ్‌కు అసలు పరీక్ష ముందుంది. రెండో సినిమాతోనూ అతను తనేంటో రుజువు చేసుకోవాలి. దానితర్వాత కూదా తాను టాలీవుడ్ లో పేరు తెచ్చుకోవాలి. అప్పుడు ఏదైనా మాట్లాడాలి గానీ ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఇలా మాట్లాడటం ఖచ్చితంగా అతనికి నష్టమే చేస్తుంది....

English summary
Tharun went on to say many Awards are all about TRPs. He also went on to say NTR Junior can get them TRPs but not Tharun Bhascker. The budding director repeated about NTR getting an award as if the star hero does not deserve one. NTR fans are feeling that this is an insult to their hero.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu