ట్రైలర్ కొత్తగా ఉంది: ‘పెళ్లి చూపులు’ ట్రైలర్ (వీడియో)
News
oi-Santhosh Kumar Bojja
By Bojja Kumar
|
హైదరాబాద్: విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్, బిగ్ బెన్ స్టూడియోస్, వినూతన గీత బ్యానర్స్ పై రూపొందుతోన్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంరట్ టైనర్ 'పెళ్ళి చూపులు'. రాజ్ కందుకూరి, యస్ రాగినేనితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
త్వరలో విడుదలకు సిద్దమవుతున్న ఈచిత్రం ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ నాని చేతుల మీదుగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రైలర్ రిలీజైంది.
ట్రైలర్ ఈ మధ్య కాలంలో వచ్చిన ట్రైలర్ల కంటే కొత్తగా... ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా కాన్సెప్టు కూడా కొత్తగా ఉంటుందని, తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతుందనడానికి నిదర్శనంగా నిలిచే చిత్రంగా పెళ్ళి చూపులు ఉంటుందని నిర్మాతలు తెలిపారు.
విజయ్ దేవర కొండ, రీతూవర్మ, ప్రియదర్శిని, అభయ్ బేతిగంటి, కేదార్ శంకర్, గురురాజ్, అనీష్ కురువిల్లా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నాగేష్ బానెల్, మ్యూజిక్: వివేక్ సాగర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రంజిత్ కుమార్, నిర్మాతలు: నిర్మాత రాజ్ కందుకూరి, యస్ రాగినేని దర్శకత్వం: భాస్కర్.
Raj Kandukuri and BiGBen Cinemas in association with Vinoothna Geetha presents #Pellichoopulu, a Telugu romantic comedy about two individuals Prashanth and Chitra who meet at a 'Pellichoopulu'. The story is about a modern day couple anchored down by their traditional roots. When fate plays havoc in their lives, they set off on a journey to find their dreams, face their fears and ultimately find true love.
Story first published: Sunday, July 3, 2016, 9:55 [IST]