»   » అల్లు అరవింద్ ఐడియా అదుర్స్, చిన్న హీరోతో పెద్ద సినిమా ఎనౌన్స్ చేసారు

అల్లు అరవింద్ ఐడియా అదుర్స్, చిన్న హీరోతో పెద్ద సినిమా ఎనౌన్స్ చేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొన్ని కాంబినేషన్స్ వినగానే ప్రాజెక్టుపై ఆసక్తిని రేపుతాయి. అలాంటి ఉత్సాహకరమైన కాంబినేషన్స్ సెట్ చేయటంలో ముందంటారు అల్లు అరవింద్. ఆయన తాజాగా ఎనౌన్స్ చేసిన చిత్రం గురించే ఇప్పుడు ఇండస్ట్రీ మాట్లాడుకుంటోంది. కొత్త సంవత్సరంలో ఓ కొత్త ప్రాజెక్టు ఎనౌన్స్ చేసి, అల్లు అరవింద్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

గీతా ఆర్ట్స్‌లో కమర్షియల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విజయాన్ని సాధించిన 'శ్రీరస్తు శుభమస్తు' దర్శకుడు పరుశురాం (బుజ్జి) దర్శకత్వంలో ఆయన ఓ చిత్రం నిర్మించనున్నారు. గతేడాది చిన్న చిత్రంగా విడుదలై ట్రెండింగ్‌ సక్సెస్‌ సొంతం చేసుకున్న 'పెళ్ళి చూపులు'తో అందరి అభిమానాన్ని గెలుచుకున్న విజయ్‌ దేవరకొండ ఇందులో హీరో కావటం ప్లస్ అవుతుందంటున్నారు.

పోయిన సంవత్సరం తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై 'సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు, ధృవ' వంటి భారీ సక్సెస్ ఫుల్ సినిమాల్ని, కన్నడలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై 'సుందరంగ జాణ' సినిమాని నిర్మించిన అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పూర్తి స్దాయి లవ్ స్టోరీ..

పూర్తి స్దాయి లవ్ స్టోరీ..

నాగచైతన్యతో '100% లవ్‌', సాయిధరమ్‌తేజ్‌తో 'పిల్లా నువ్వులేని జీవితం', నానితో 'భలే భలే మగాడివోయ్‌' వంటి చిత్రాలు నిర్మించిన నిర్మాత బన్నీ వాసు ‘పెళ్లి చూపులు'తో మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోగా మారిన విజయ్ దేవరకొండతో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ‘శ్రీ రస్తు శుభమస్తు' ఫేమ్ పరశురామ్ డైరెక్ట్ చేయనున్నాడు. పూర్తి స్థాయి లవ్ స్టోరీగా ఈ చిత్రం ఉండబోతోంది.

గీతా ఆర్ట్స్ టూ పై..

గీతా ఆర్ట్స్ టూ పై..

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సంక్రాంతి తరువాత మొదలయ్యే అవకాశముంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. అల్లు అరవింద్ , పరుసరామ్ , విజయ్ దేవరకొండ అనగానే ఖచ్చితంగా మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

చిత్ర సమర్పకులు అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ...

చిత్ర సమర్పకులు అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ...

''ప్రతి ప్రేక్షకుడు ఆనందం పొందాలనే సంకల్పంతోనే చిత్రాలు రూపొందిస్తున్నాం. 2016లో మాస్‌ ఎంటర్‌టైనర్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, స్టైలిష్‌ ఎంటర్‌టైనర్‌... ఇలా మూడు వైవిధ్యమైన జానర్‌లో చిత్రాలు చేశాం. అవి సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రాలుగా ఆదరణ పొందాయి. ఇక నుండి వచ్చేవి కూడా ఇలానే మంచి చిత్రాలుగా ఆదరణ పొందే విధంగా చేస్తాం. పరుశురాం చెప్పిన కథ చాలా బాగుంది. త్వరలో వివరాలు తెలియజేస్తాం'' అన్నారు అరవింద్.

నిర్మాత బన్ని వాసు మాట్లాడుతూ

నిర్మాత బన్ని వాసు మాట్లాడుతూ

''అల్లు అరవింద్‌గారు నిర్మాతగా 2016లో నిర్మించిన మూడు చిత్రాలు సూపర్‌హిట్స్‌ కావడం హ్యపీగా వుంది. పరుశురాంగారు చెప్పిన కథ అరవింద్‌గారికి చాలా నచ్చింది. వెంటనే నాకు వినిపించారు. సింగిల్‌ సిట్టింగ్‌లోనే నాకు నచ్చింది. పరుశురాంగారి విజన్‌ సూపర్‌గా వుంటుంది. చాలా చిత్రాలు ప్రూవ్‌ అయ్యాయి కూడా అన్నారు బన్ని వాసు.

ఆ రేంజిలో కథ దొరికిందనే...

ఆ రేంజిలో కథ దొరికిందనే...

'భలే భలే మగాడివోయ్‌'లాంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ తరువాత జీఏ2 బ్యానర్‌లో గ్యాప్‌ తీసుకున్నాం. చేస్తే ఆ రేంజి విజయాన్ని సాధించే చిత్రాలు చేయాలనే సంకల్పంతో గ్యాప్‌ తీసుకున్నాం. ఇప్పడీ కథ ఆ రేంజిలో వుందనే నమ్మకంతో ఓకే చేశాం. అల్లు అరవింద్‌ గారు సమర్పణలో ఈ చిత్రం అతి త్వరలో సూపర్‌ టెక్నిషియన్స్‌తో భారీ తారాగణంతో సెట్స్‌ మీదకి వెళ్ళనుంది'' అన్నారు.

దర్శకుడు పరుశురాం మాట్లాడుతూ

దర్శకుడు పరుశురాం మాట్లాడుతూ

''గీతా ఆర్ట్స్‌లో ఒక్క చిత్రం చేయటం లక్‌ అంటారు. నేను వరుసగా రెండవ చిత్రం కూడా చేసే డబుల్‌ లక్‌ని అరవింద్‌గారు ఇచ్చినందుకు చాలా ఆనందంగా వుంది'' అన్నారు డైరక్టర్ పరుసరామ్.

ట్రెండ్ కి తగినట్లుగా..

ట్రెండ్ కి తగినట్లుగా..

2016లో సౌత్‌లో నాలుగు విజయాలు సొంతం చేసుకున్న గీతా ఆర్ట్స్‌
గీతా ఆర్ట్స్‌కి విజయాలు కొత్త కాదు. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టు అప్‌డేట్‌ అవుతూ నిర్మాత అల్లు అరవింద్‌ తన చిత్రాలు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందే విధంగా చూసుకుంటారు. అంతే కాదు ఎంతోమంది నిర్మాతలకి ఆదర్శంగా నిలుస్తున్నారు.

అల్లు అర్జున్, శిరిష్ లతో..

అల్లు అర్జున్, శిరిష్ లతో..

2016లో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా అత్యంత భారీగా ఆయన నిర్మించిన మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ 'సరైనోడు'. ఈ చిత్రం సమ్మర్‌లో విడుదలై, భారీ కలెక్షన్లతో బన్ని కెరీర్‌లోనే బెస్ట్‌ రెవిన్యూ ఫిల్మ్‌గా నిలిచింది. అలాగే అల్లు శిరీష్‌ హీరోగా 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రాన్ని పక్కా ఫ్యామిలి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇది కూడా అల్లు శిరీష్‌ కెరీర్‌లో బెస్ట్‌ ఫిల్మ్‌ గా నిలిచింది.

రామ్ చరణ్ తో..

రామ్ చరణ్ తో..

2016 చివరిలో విడుదలైన స్టైలిష్‌ ఎంటర్‌టైనర్‌గా అందిరి హృదయాలు దోచుకుని మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ 2016 బెస్ట్‌ రెవిన్యూ ఫిల్మ్‌గా 'ధృవ'తో తెలుగులో హ్యాట్రిక్‌ హిట్‌ సాధించారు. అలాగే తెలుగులో సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచిన 'భలే భలే మగాడివోయ్‌' చిత్రాన్ని కన్నడ భాషలో నిర్మించారు. డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ సక్సెస్‌ సాధించింది. ఇప్పడు పరుశురాం దర్శకత్వంలో విజయ్‌దేవరకొండ హీరోగా బన్ని వాసు నిర్మాతగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

రెండు రిలీజ్ లు...

రెండు రిలీజ్ లు...

ఇకపోతే విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి' సినిమాలో నటిస్తుండగా ఆయన నటించిన మరో చిత్రం ‘ద్వారక' రిలీజ్ కు సిద్ధంగా ఉంది. విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. కథలు, బ్యానర్స్, డైరక్టర్స్ బెస్ట్ అవ్వాలని ఎంపిక చేసుకుంటున్నారు.

English summary
Geetha Arts & GA2 will be producing a movie in the direction of Parasuram of Sreerasthu Shubhamasthu with Vijay Devarakonda as hero. The movie will be hitting the floors shortly.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu