For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Acharya ఆ భాషలో కూడా విడుదల: మెగా హీరోలు అదిరిపోయే ప్లాన్.. కోట్లు కొల్లగొట్టడం గ్యారెంటీ!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ మూవీలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. గతంతో పోలిస్తే హీరోలు, వాళ్ల అభిమానుల మధ్య స్నేహభావ సంబంధాలు ఏర్పడడంతో పాటు ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. దీంతో కొత్త తరహా సినిమాలను ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే మల్టీస్టారర్ మూవీలు రూపొందుతున్నాయి.

  ఇప్పటికే పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించగా.. మరికొన్ని పట్టాలపై ఉన్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ కాంబోలో వస్తున్న 'ఆచార్య' ఒకటి. మెగా మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను మరో భాషలో కూడా విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. అసలేం జరుగుతోంది? దాని వెనుక కారణాలేంటి? తెలుసుకుందాం పదండి!

  మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ‘ఆచార్య'

  మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ‘ఆచార్య'

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. రామ్ చరణ్ ప్రధాన పాత్రను పోషిస్తోన్న చిత్రం 'ఆచార్య'. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

  హాట్ డ్రెస్‌లో మంచు లక్ష్మీ అందాల ఆరబోత: ఎద భాగం మొత్తం కనిపించేలా.. మరీ ఇంత దారుణమా!

  సందేశాత్మకంగానే.. నక్సలైట్ నేపథ్యంతో

  సందేశాత్మకంగానే.. నక్సలైట్ నేపథ్యంతో

  డైరెక్టర్ కొరటాల శివ సినిమా అంటే సందేశాత్మకంగా ఉంటుంది. ఇప్పుడు 'ఆచార్య' కూడా అదే పంథాలో సాగే చిత్రమని తెలుస్తోంది. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి దీన్నీ చిత్రీకరిస్తున్నారు. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఓ మిషన్‌లో భాగంగా సిద్ధ పాత్ర చనిపోతే.. ఆచార్య దాన్ని కంప్లీట్ చేస్తాడని టాక్.

  అంచనాలు రెట్టింపు.. బిజినెస్ భారీ రేంజ్

  అంచనాలు రెట్టింపు.. బిజినెస్ భారీ రేంజ్

  చిరంజీవి స్థాయికి ఏమాత్రం తగ్గకుండా 'ఆచార్య' మూవీని రూపొందిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్, పాటకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఫలితంగా దీనికి అన్ని ప్రాంతాల్లో భారీ డీల్స్ జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో రికార్డు కూడా నమోదయ్యాయట.

  హాట్ షో రెచ్చిపోయిన మోనాల్ గజ్జర్: గతంలో ఎన్నడూ చూడనంత ఘాటుగా.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

  రిలీజ్ డేట్ ప్రకటన.. అభిమానులు ఢీలా

  రిలీజ్ డేట్ ప్రకటన.. అభిమానులు ఢీలా

  ఇటీవలే 'ఆచార్య' మూవీకి సంబంధించిన బ్యాలెన్స్ షూట్‌ను పూర్తి చేసుకున్నారు. దీంతో ఈ చిత్రాన్ని దసరాకో, దీపావళికో విడుదల చేస్తారని అనుకున్నారు. ఒకానొక దశలో సంక్రాంతికి కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే దీన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసి ప్రకటించింది.

  ఆ భాషలో కూడా ఆచార్య మూవీ విడుదల

  ఆ భాషలో కూడా ఆచార్య మూవీ విడుదల

  మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న 'ఆచార్య' మూవీ గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ ఊహించని ప్రకటన వెలువడింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రాన్ని హిందీ భాషలో కూడా విడుదల చేస్తున్నారట. దీన్ని పెన్ మూవీస్ సంస్థ విడుదల చేస్తుంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసి ప్రకటించారు.

  బట్టలు లేకుండా దిగిన ఫొటో వదిలిన శృతి హాసన్: ఆ ప్లేస్‌లో టాటూ.. ఎవరి పేరు ఉందో తెలిస్తే!

  Harvey Weinstein Went Behind The Bars
  మెగా హీరోలు అదిరిపోయే ప్లాన్ వేశారంటూ

  మెగా హీరోలు అదిరిపోయే ప్లాన్ వేశారంటూ

  'ఆచార్య' మూవీ కంటే ముందే RRR విడుదల కాబోతుంది. దీంతో రామ్ చరణ్ మార్కెట్ ఉత్తరాదిలోనూ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగానే 'ఆచార్య' సినిమాను హిందీలోకి డబ్ చేసి విడుదల చేయబోతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఈ మెగా మల్టీస్టారర్ మూవీ అక్కడ కోట్లు కొల్లగొట్టడం ఖాయమని అంటున్నారు.

  English summary
  Megastar Chiranjeevi - Ram Charan Upcoming Film is Acharya. This movie directed by Koratala Siva. Pen Movies to Release This Movie Hindi Version.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X