twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫైట్ చేస్తాం.. థియేటర్లు ఓపెన్ చేయాల్సిందే.. ఓటీటీ రిలీజ్, ప్రభుత్వాలపై నారాయణమూర్తి ఫైర్

    |

    పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్లు మూతపడటంతో దేశవ్యాప్తంగా పేదవాడికి వినోదం కరువైంది అంటూ ఘాటుగా స్పందించారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్ నారాయణ మూర్తి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. థియేటర్లను వెంటనే ఓపెన్ చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించారు. ఆర్ నారాయణమూర్తి ప్రసంగిస్తూ...

    Janaki Kalaganaledu Today Promo 94th episode: జానకి చదువుకోసం దొంగచాటుగా వెళ్లిన రామ.. జ్ఞానాంబ కంట పడడంతో షాక్!Janaki Kalaganaledu Today Promo 94th episode: జానకి చదువుకోసం దొంగచాటుగా వెళ్లిన రామ.. జ్ఞానాంబ కంట పడడంతో షాక్!

    పేదలకు వినోదం కరువు

    పేదలకు వినోదం కరువు

    ఓవర్ ది టాప్ (ఓటీటీ)లో సినిమాలు రిలీజ్ చేయడం వల్ల దేశంలో పేదవాడికి వినోదం లభించడం లేదు నారాయణమూర్తి అన్నారు. ఇటీవల వెంకటేశ్ నటించిన నారప్ప చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేస్తే తెలుగు రాష్ట్రాలలో కేవలం 25 శాతం మంది మాత్రమే చూశారు, మిగతా 75 శాతం మంది చూడలేకపోయారు అని అన్నారు.

    Vadinamma నాని మీద దమయంతి కొత్త స్కెచ్.. జ్యూస్ లో మందు.. తాగుతాడా? లేదా?Vadinamma నాని మీద దమయంతి కొత్త స్కెచ్.. జ్యూస్ లో మందు.. తాగుతాడా? లేదా?

    థియేటర్లు మూసేస్తే ఎలా

    థియేటర్లు మూసేస్తే ఎలా

    మధ్య, దిగువ తరగతి, బడుగు వర్గాలకు సంబంధించిన ఆధునాతన సాంకేతికతతో కూడిన టెలివిజన్లు లేవు. వారికి ఓటీటీ అందుబాటులో లేదు. థియేటర్లు మూసేసి ఓటీటీలో సినిమాలను రిలీజ్ చేసుకొంటూ పోతే పేదవాళ్లకు వినోదాన్ని ఎప్పుడు అందిస్తారు అని ఆర్ నారాయణ మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    కలర్‌ఫుల్ చిలకలా ప్రియా ప్రకాశ్ వారియర్.. లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్

    థియేటర్ అనుభూతి వేరు...

    థియేటర్ అనుభూతి వేరు...

    తెలుగు ప్రజలకు సినిమాలను థియేటరల్లో చూడటం ఒక పండుగ లాంటిది. థియేటర్లలో సినిమాలు చూస్తే ఆ అనుభూతి వేరు. అలాంటి అనుభూతిని ఆంక్షలతో పేదవారికి దూరం చేస్తున్నారు. పేదవాడికి ఉన్న ఒకే ఒక వినోదం థియేటర్. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు రీ ఓపెన్ చేయాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నా విజ్ఞపి అంటూ నారాయణ మూర్తి ఆవేశంగా మాట్లాడారు.

    సాయి ధన్షిక బ్యూటీఫుల్ ఫోటోలు.. సముద్ర తీరంలో అలా

    థియేటర్లు లేకపోతే స్టార్ డమ్ ఉండదు

    థియేటర్లు లేకపోతే స్టార్ డమ్ ఉండదు

    సినిమా బతకాలి, థియేటర్స్ బతకాలి. మనిషి ఉన్నంత కాలం థియేటర్ ఉంటుంది. థియేటర్ లేకపోతే స్టార్‌డమ్ ఉండవు. కరోనావైరస్‌తో అందరూ ఫైట్ చెయ్యాల్సిందే. వెంటనే సినిమా థియేటర్స్ తెరుచుకునే విధంగా చూడాలని కోరుతున్నాను. సినీ పరిశ్రమ పెద్దలు కూడా సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యేటట్టు చూడాలి. పరిశ్రమ పెద్దలు సినిమాలను ఓటిటికి రిలీజ్ చెయ్యకుండా థియేటర్లో రిలీజ్ అయ్యే విధంగా చూడాలి అంటూ ఆర్ నారాయణ మూర్తి సూచించారు.

    సీరత్ కపూర్ క్లీవేజ్ షో.. అందాలు ఆరబోస్తూ హాట్ హాట్‌గా

    Recommended Video

    R Narayana Murthy About LB Sriram Greatness
    థియేటర్ల ఓపెన్ చేయకపోవడంపై అసంతృప్తి

    థియేటర్ల ఓపెన్ చేయకపోవడంపై అసంతృప్తి

    తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ చేయడానికి అనుమతి ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తం అవుతున్నాయి. రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న చిత్రాలను ప్రదర్శించడానికి థియేటర్లు ఓపెన్ చేయకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా బార్లు, రెస్టారెంట్లు రిలీజ్ చేస్తారు కానీ... థియేటర్లు మూసేస్తారు. సినిమా అనేది తెలుగు వాళ్లకు రక్తంలోనే ఉంది అంటూ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాని, నారాయణమూర్తి ఇలా వ్యాఖ్యలు చేయడంపై వారి వెనుక ఉన్న ఆవేదన బయటపడింది.

    English summary
    People Star R Narayana Murthy serious over OTT releases. He said that Poor People unable to access the OTT content. Narappa movie was watched only 25 percent due to OTT Release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X