»   » అప్రమత్తమైన మహేష్ బాబు, శ్రీను వైట్లకు సూచనలు!

అప్రమత్తమైన మహేష్ బాబు, శ్రీను వైట్లకు సూచనలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: సమస్యలు వస్తే ఎలా ఉంటాయి, ఎంత ఇబ్బంది పెడతాయి అనేది స్వయంగా అనుభవిస్తే గానీ తెలియదు. తాజాగా మహేష్ బాబుకు అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. సుకుమార్ దర్శకత్వంలో '1-నేనొక్కడినే' చిత్రం షూటింగ్ సమయంలో మహేష్ బాబు పలు సమస్యలు ఎదుర్కొన్నాడట. బడ్జెట్ ప్లానింగ్‌లో కూడా సుకుమార్ విఫలమై అనుకున్న దానికంటే ఎక్కువే ఖర్చు పెట్టించాడట.

ఈ అనుభవాలతో మేల్కొని అప్రమత్తమైన మహేష్ బాబు తన తర్వాతి సినిమా 'ఆగడు' విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సినిమా షెడ్యూల్ మొత్తం విదేశాల్లో షూటింగుతో సహా 120 రోజుల్లో పూర్తి చేయాలని, బడ్జెట్ ప్లానింగ్ పక్కాగా ఉండాలని సూచనలు చేసాడట.

ఈ నెలలోనే 'ఆగడు' సినిమా ప్రారంభోత్సవం జరుగనుంది. నవంబర్ 9 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రారంభం రోజే ఈ సినిమాకు సంబంధించిన కథనాయికలు, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలుస్తాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సంగీత దర్శకునిగా తమన్‌కిది 50వ సినిమా.

ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న 1(నేనొక్కడినే) సినిమాతో పాటు 'ఆగడు' సినిమా కూడా 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ యే నిర్మిస్తుంది. ఈ సినిమాల నిర్మాతలైన రామ్ ఆచంట, గోపి ఆచంటమరియు అనీల్ సుంకర మహేష్ కు సన్నిహితులు. 1(నేనొక్కడినే) సినిమా 2014 సంక్రాంతికి విడుదలకానుంది.

English summary
Mahesh Babu latest project 1-Nenokkadine have had a lot of difficulties in working days also and in Budget planning also. So this time he is taking the precaution step and trying to plan everything in advance for his next project Agadu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu