twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నవదీప్ 'మైత్రి' చిత్రం ఆపమని కోర్టులో పిటీషన్

    By Srikanya
    |

    హైదరాబాద్: నవదీప్, సదా కాంబినేషన్ లో రూపొందిన చిత్రం మైత్రి. ఈ నెల 30వ తేదీన విడుదలకు సిద్దమైన ఈ చిత్రం విడుదల నిలపివేమని కోర్టులో పిటీషన్ ధాకలైంది. డీఎస్‌ఎన్ మూర్తి సిటీ సివిల్ కోర్టులో సినిమా విడుదలను నిలిపివేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ సినిమా నిర్మాతలు తనకు ఇవ్వవలసిన డబ్బు ఇవ్వలేదని ఆ పిటిషన్లో తెలిపారు.

    నవదీప్‌, సదా జంటగా సూర్యరాజు దర్శకత్వంలో హను సినీ క్రియేషన్స్‌ పతాకంపై పారిశ్రామికవేత్త రాజేష్‌ కుమార్‌ నిర్మించిన 'మైత్రి' తొలి కాపీ సిద్ధం కాగా, త్వరలో ఈ సినిమా విడుదలకు కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుతం వస్తున్న లవ్‌, యాక్షన్‌ చిత్రాలకు భిన్నంగా హీరోయిన్‌ సదా, హీరో నవదీప్‌ల పాత్రలను వైవిధ్యభరితంగా చూపించామని కుమార్‌ రాజా పేర్కొన్నారు. సదా మంచి నటనను కనబరచగా, నవదీప్‌ పాత్రను ముందెన్నడూ లేని రీతిలో తీర్చిదిద్దామన్నారు. 'మైత్రి' ఆడియోకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో శరవేగంగా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.

    చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రల్లో డాక్టర్‌ బ్రహ్మానందం, ఉత్తేజ్‌, చిత్రం శీను, సుమన్‌ శెట్టి, భిక్షు, కళ్ళు చిదంబరం, సత్యం రాజేష్‌, కీర్తి, అల్లరి సుభాషిణి, జయవాణి, ఇషిక తదితరులు కనిపిస్తారు. వికాస్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సెల్వ ఛాయాగ్రహణ బాధ్యతలు వహించారు. దర్శకుడు సూర్యరాజు కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు అందించారు.

    బ్రహ్మానందం, ఉత్తేజ్, చిత్రం శ్రీను, సుమన్‌శెట్టి, బిక్షు, కళ్లు చిదంబరం, సత్యం రాజేష్, అర్జున్, లక్ష్మణ్, పాపారాయుడు, వంశీ, కీర్తి, అల్లరి సుభాషిణి, జయవాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వికాస్, కెమెరా: సెల్వ, ఎడిటింగ్: వినయ్, నిర్మాత: రాజేష్‌కుమార్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: సూర్యరాజు.

    English summary
    A petition has been filed in a Civil court seeking an immediate stop on Mytri film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X