twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘విశ్వరూపం’ థియేటర్లపై బాంబులు, కమల్ కాంప్రమైజ్

    By Bojja Kumar
    |

    చెన్నై: మద్రాసు హైకోర్టు 'విశ్వరూపం' విడుదలపై నిన్న నిషేదం ఎత్తి వేయడంతో ఈ రోజు తమిళనాడు వ్యాప్తంగా సినిమాను విడుదలకు సిద్ధం చేసారు. అయితే సినిమాపై నిషేదం ఎత్తివేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కారులు విధ్వంసం సృష్టించారు. రామనాథ పురం జిల్లాలో రెండు చోట్ల దుండగులు పెట్రో బాంబులు విసిరారు. తమిళనాడు వ్యాప్తంగా 13 థియేటర్లను ధ్వంసం చేసారు.

    మరో వైపు నాగపట్నం, కోయంబత్తూర్ లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో పలు చోట్ల సినిమా ప్రదర్శనను నిలిపి వేసారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముస్లిం సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపిన కమల్ హాసన్ సినిమాలో అభ్యంతర కరంగా ఉన్న సీన్లను కత్తిరించడానికి అంగీకరించారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు.

    ఈ సంఘటన కంటే ముందు.... ఈ రోజు ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమల్ హాసన్ మాట్లాడుతూ... ఆస్తినంతా అమ్మి సినిమా తీసానని, దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని తమకు లేదని, దేశ సెక్యూలరిజంపై అపార నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. విశ్వరూపం చిత్రంలో ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదని, ఈ సినిమాను ఎందుకు నిలిపి వేసారో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. రాజకీయ క్రీడలో తాను పావునయ్యాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకు ఇన్ని అడ్డంకులు వచ్చాయో తెలియడం లేదన్న కమల్ హాసన్ తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని చెప్పుకొచ్చారు. ఈ లోపే ఆయన నిర్ణయం మార్చుకుని సినిమాలో అభ్యంతర కరంగా ఉన్న సీన్లను కత్తిరించడానికి ఒప్పుకోవడం గమనార్హం.

    విశ్వరూపం చిత్రం ఈ నెల 25న విడుదల కావాల్సి ఉండగా..... ముస్లిం సంఘాల ఫిర్యాదుతో తమిళనాడు ప్రభుత్వం ఆచిత్రంపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే. 'విశ్వరూపం' చిత్రంపై మద్రాస్ హైకోర్టు నిషేదం ఎత్తి వేసిన ఆనందంలో ఉన్న కమల్‌కు జయలలిత ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు ఆ సినిమాపై నిషేదం ఎత్తి వేయడాన్ని సవాల్ చేస్తూ రివ్యూ పిటీషన్ దాఖలు చేసింది.

    English summary
    Petrol bombs hurled at two theatres in Ramanathapuram in TamilNadu which were to screen Vishwaroopam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X