»   » శ్రీదేవి మూవీని దక్కించుకున్నసెన్సార్ బోర్డ్ చీప్

శ్రీదేవి మూవీని దక్కించుకున్నసెన్సార్ బోర్డ్ చీప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళంలో విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పులి'. శ్రీదేవి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, హిందీ బాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. సౌత్ సంగతి పక్కన పెడితే ఈ సినిమా బాలీవుడ్ మార్కెట్ అంతా కూడా శ్రీదేవికి ఉన్న ఇమేజ్ మీదనే ఆధారపడి ఉంది.

చాలా ఏళ్ల తర్వాత శ్రీదేవి నటిస్తున్న సినిమా కావడం, అందులోనూ ముఖ్యమైన క్వీన్ పాత్ర పోషిస్తుండటంతో ‘పులి' సినిమాకు బాలీవుడ్లో మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. ఈ చిత్రం హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సెంట్రల్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ చీఫ్ ఫలాజ్ నిహలానీ దక్కించుకున్నారు.


హిందీలో ఇటీవల విడుదలైన ‘పులి' ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమాకు ఓపెనింగ్స్ బాగా వస్తాయని భావిస్తున్నారు. ఇటీవల వచ్చిన బాహుబలి హిందీలో అదరగొట్టింది. ఆ సినిమా ప్రభావంతో పులి చిత్రంపై కూడా అక్కడ అంచనాలు భారీగానే ఉన్నాయి. శ్రీదేవి నటిస్తుండటం మరింత ప్లస్ అవుతుంది.


Phalaj Nihalani acquired 'Puli' Hindu version rights

అక్టోబర్ 1న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి' రేంజిలో ఉంటుందని అంటున్నారు. అయితే నిర్మాతలు మాత్రం ‘పులి' సినిమా డిఫరెంటుగా ఉంటుందని అంటున్నారు.


పిల్లలను, పెద్దలను, అభిమానులను అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుందని అంటున్నారు. మరో వైపు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు' సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో సినిమాకు ఫ్యామిలీ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు.


శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్ కె టి స్టూడియోస్ బ్యానర్‌పై శింబు తమీన్స్, పి టి సెల్వకుమార్ నిర్మాతగా నిర్మిస్తున్న పులి చిత్రం భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. తెలుగులో చిత్రాని ఎస్ వి ఆర్ మీడియా బ్యానర్‌పై సి జె శోభ విడుదల చేస్తున్నారు.


ఈ సినిమాలో శ్రీదేవి కూడా నటిస్తున్నారు. సినిమాలో ఆమె కీలకమైన పాత్రలో మహారాణిగా కనిపించబోతున్నారు. విజయ్‌ సరసన శృతి హాసన్‌, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. కన్నడ స్టార్‌ సుదీప్‌, ప్రభు, తంబి రామయ్య, సత్యన్‌, జూనియర్‌ బాలయ్య, నరేన్‌, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయత్రితో పాటు 40 మంది ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.

English summary
Central Board of Film Certification chief Phalaj Nihalani acquired the distribution rights of 'Puli' Hindu version.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu