»   » 'బజరంగీ భాయిజాన్‌' దర్శకుడి నెక్ట్స్ చిత్రం ట్రైలర్‌ (వీడియో)

'బజరంగీ భాయిజాన్‌' దర్శకుడి నెక్ట్స్ చిత్రం ట్రైలర్‌ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: ప్రముఖ బాలీవుడ్‌ నటీనటులు సైఫ్‌ అలీ ఖాన్‌, కత్రినాకైఫ్‌ జంటగా నటిస్తున్న ఫాంటమ్‌ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. రెండున్నర నిమిషాల పాటు సాగే ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బజరంగీ భాయ్‌జాన్‌ సినిమాతో భారీ సక్సెస్‌ను సాధించిన కబీర్‌ఖాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించటంతో మంచి క్రేజ్ క్రియోట్ అయ్యింది. ఆ ట్రైలర్ ఇక్కడ మీరు చూడవచ్చు.

టెర్రరిజం, ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో సాగే ఈ చిత్రం 'ముంబయి అవెంజర్స్‌' పుస్తకం ఆధారంగా తెరకెక్కుతోంది. యూటీవీ మోషన్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'బజరంగీ..' చిత్రం లేటెస్ట్ ఇన్ఫో...

రంజాన్‌కు 'బజరంగీ భాయిజాన్‌'తో వచ్చిన సల్మాన్‌ ఖాన్‌ బాక్సాఫీసు దగ్గర అదరకొడుతోంది. మొదట్లో స్లోగా అంటే రూ.27 కోట్లతో ప్రారంభమైన 'బజరంగీ..' పరుగు కొత్త రికార్డులు సృష్టించుకుంటూ ముందుకు సాగిపోతోంది. ఈ చిత్రం క్లైమాక్స్ సీన్స్ లో సల్మాన్ ఖాన్ కన్నీళ్లు చూసి కంటతడి పెడుతున్నారు. అలాగే సినిమాలో హర్షాలీ మల్హోత్రాను చూసి ముచ్చటపడిపోతున్నారు . ఈ సినిమా తొలివారం పూర్తి చేసుకొని రెండో వారంలో అడుగుపెట్టింది.

Phantom 2015 movie trailer released: Saif Ali Khan and Katrina Kaif

తొలి వారం 'బజరంగీ..' రికార్డులు

'బజరంగీ భాయిజాన్‌' తొలి రోజు రూ.27.25 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో 'కిక్‌' పేరిట ఉన్న రికార్డును (రూ.26.40 కోట్లు) చెరిపేసింది.
ఈ ఏడాది భారీ ప్రారంభ వసూళ్లు సాధించిన చిత్రంగా 'బజరంగీ..' నిలిచింది. ఇప్పటివరకు 'ఏబీసీడీ 2' రూ.14 కోట్లతో మొదటి స్థానంలో ఉండేది. రెండో రోజు వసూళ్లు రూ.36.60 కోట్లు, మూడో రోజు రూ.38.75 కోట్లు వసూలు చేసింది.

విదేశాల్లోనూ 'బజరంగీ..' జోరు మామూలుగా లేదు. తొలి రోజు రూ.50.89 కోట్లతో సల్మాన్‌ కెరీర్‌లో తొలి రోజు అత్యధికంగా వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. యూఎస్‌ఏ చార్ట్‌లో పదో స్థానంలో నిలిచి గౌరవం దక్కించుకుంది.

బాలీవుడ్‌లో వంద కోట్ల మార్కును 8 సార్లు దాటిన హీరోగా సల్మాన్‌ ఖాన్‌కు మరో రికార్డును అందించిదీ చిత్రం.
సోమవారం ఈ సినిమా రూ.27.05 కోట్లు వసూలు చేసింది. వారాంతం కాని రోజుల్లో ఓ సినిమా ఇంత మొత్తం వసూలు చేయడం రికార్డే. తొలి ఐదు రోజుల్లోనే రూ.150 కోట్లు వసూలు చేసి రికార్డు సాధించింది.

Phantom 2015 movie trailer released: Saif Ali Khan and Katrina Kaif

తొలి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.184.62 కోట్లతో బాలీవుడ్‌ బాక్సాఫీసులో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో 'పీకే' (రూ.183.09 కోట్లు), 'హ్యాపీ న్యూ ఇయర్‌' (రూ.157.57 కోట్లు) ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి వారంలో రూ. 267.91 కోట్లు వసూలు చేసింది. (దేశంలో రూ.184.62 కోట్లు + విదేశాల్లో రూ.83.29 కోట్లు).

తొలి ఎనిమిది రోజుల్లో రూ.197.77 కోట్లు సాధించిన ఈ చిత్రం శనివారం రాత్రికల్లా రూ.200 కోట్ల మార్కును దాటింది. 'కిక్‌' తర్వాత రెండొందల కోట్ల మార్కు అందుకున్న సల్మాన్‌ రెండో చిత్రమిది. ఈ ఏడాదిలో తొలి రెండొందల కోట్ల చిత్రమూ ఇదే.

English summary
Kabir Khan seems to be on a roll with the success of Bajrangi Bhaijaan. He took to twitter to release the first look posters of Saif Ali Khan and Katrina Kaif in his upcoming flick Phantom.The film is produced by UTV Motion Pictures and Nadiadwala Grandson Entertainment. The music of the film is composed by Pritam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu