»   » సీన్ కోసమా...సరదా కోసమా? : హీరోయిన్ తో కలిసి అఖిల్...(ఫొటో)

సీన్ కోసమా...సరదా కోసమా? : హీరోయిన్ తో కలిసి అఖిల్...(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అక్కినేని అఖిల్. ఈ షూటింగ్ నిమిత్తం స్పెయిన్ వెళ్లినప్పుడు ఖాళీ దొరికినప్పుడు ఇదిగో హీరోయిన్ ని తీసుకుని ఇలా ఫోజిచ్చాడు. అయితే అదేమీ కాదు...సినిమాలో సీన్ షూట్ లో భాగంగానే ఈ ఫోజు అంటున్నారు కొందరు. అలాంటిదేమీ లేదు... స్పెయిన్ లో షూటింగ్ పూర్తి అయినప్పుడు జరిగిన పార్టీలో ఇలా వీరిద్దరూ కలిసి దిగింది అని చెప్తున్నారు. ఏదమైనా...అఖిల్... అమ్మాయితో రొమాంటిక్ ఎప్రోచ్ లో ఉన్నాడనేది స్పష్టం అవుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Photo:Akhil and his heroine Sayesha!!

వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన సినిమా షూటింగ్ నిమిత్తం స్పెయిన్ వెళ్లిన అఖిల్... ప్రస్తుతం గాల్లో తేలిపోతున్నాడట. అయితే అబ్బాయి అంతకు ముందే స్పెయిన్ కు వెళ్లినా.. ఈసారి తన సినిమా షూటింగ్ లో భాగంగా అక్కడికి వెళ్లడంపై తెగ సంబరపడిపోతున్నాడట. ఇది తన సినిమా తొలి విదేశీ షెడ్యూల్ కావడం అబ్బాయికి భలే కిక్ ఇస్తోందట.

అందులోనూ ఇంత మంచి టీమ్ తో కలసి పని చేస్తుండటంపై అఖిల్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడట. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు అక్కినేని చిన్నోడు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ అఖిల్ కు తండ్రిగా నటిస్తుండగా... సయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి దుర్గా నవరాత్రులకు ముస్తాబవుతున్న తన తొలి చిత్రంతో అఖిల్ ఈ ఏడాది దసరా బుల్లోడు అవుతాడేమో చూడాలి అంటున్నారు అభిమానులు.

Photo:Akhil and his heroine Sayesha!!

నిర్మాత నితిన్ మాట్లాడుతూ...ఈ సినిమా ఆడియన్స్‌, ఫ్యాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసే అన్ని అంశాలతో వినాయక్ ఈ సినిమాని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో ఒక సాంగ్‌ని సెట్‌లో చిత్రీకరించబోతున్నాం. జూన్‌లో 35 రోజులపాటు యుగాండాలో భారీ షెడ్యూల్‌ వుంటుంది. వెలిగొండ శ్రీనివాస్‌, కోన వెంకట్‌, అనూప్‌ రూబెన్స్‌, ఎస్‌.ఎస్‌.థమన్‌, అమోల్‌ రాథోడ్‌, ఎ.ఎస్‌.ప్రకాష్‌, రవివర్మ వంటి టాప్‌ టాప్‌ టెక్నీషియన్స్‌ ఈ చిత్రాన్ని పెద్ద హిట్‌ చెయ్యాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు'' అన్నారు.

Photo:Akhil and his heroine Sayesha!!

అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

English summary
Here comes a picture of both Akhil and Sayesh clicked on cameras for the first time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu