»   » ఫేస్ లు రివిల్ చేసాడు: హాట్ ‘క్యాలెండర్’ గర్ల్స్ వీళ్లే

ఫేస్ లు రివిల్ చేసాడు: హాట్ ‘క్యాలెండర్’ గర్ల్స్ వీళ్లే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ తన తాజా చిత్రం కేలండర్ గర్ల్స్ కు రంగం సిద్దం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ల ని వరసపెట్టివదులుతున్నారు. గతంలో ఈ పోస్టర్ లో గోల్డ్ కలర్ బికినీ ధరించిన ఐదుగురు భామలు ముఖాలు కనిపించకుండా టోపీలు అడ్డం పెట్టి వదిలారు. దాంతో ఎవరా అందగత్తెలు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పుడు వీరి ముఖాలు రివిల్ చేసేసారు. వారు ఈ క్రింద ఫోటోలో మీరు చూస్తున్న వారే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఏదో ఒకటి కొత్తగా చేయకపోతే జనం దృష్టిని ఆకర్షించటం కష్టంగా ఉంది. ఆ విషయం వర్మ క్యాంప్ నుంచి వచ్చిన వాళ్లకు బాగా తెలుసు. వర్మ శిష్యుగా కెరీర్ మొదలెట్టి తనకంటూ కీర్తి ప్రతిష్టలు పొందిన దర్శకుడు మధూర్ భండార్కర్.

ఇక ఈ సినిమాలో ఎక్కువ భాగం స్విమ్ సూట్ సీన్ల చుట్టూ తిరిగితే...ఇంకేముంది. అలాంటి సినిమా ఒకటి త్వరలో మన ముందుకు రాబోతోంది. అంతేకాదు ఈ సినిమాలో కొన్ని హాట్ సీన్స్ కూడా ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

Photo:Five hot ‘Calendar’ girls

ఈ సినిమాలోని ఐదుగురు ముఖ్యమైన పాత్రల కోసం ఆరుగు యంగ్ గర్ల్స్‌ను ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవలే ఇందుకు సంబంధించిన ఆడిషన్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది. బికినీలకు పర్ పెక్టుగా సూటయ్యే, ఫ్యాషనబుల్ బాడీ ఉన్న అమ్మాయిలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టులో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటి వరకు సినిమాలకు పరిచయం లేని కొత్త ముఖాలను ఆయన ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మాధుర్ బాండర్క్ సినిమా అనగానే సినిమా రంగంలోకి రావాలని ఆశ పడుతున్న మోడల్స్ ఉత్సాహంగా ఆడిషన్స్‌కు హాజరయ్యారు. వారి నుండి మంచి నటనా చాతుర్యం, సెక్సీ బాడీ ఉన్న వారిని ఎంపిక చేసారు.

మన సమాజంలోని వాస్తవిక పరిస్థితులను తెరకెక్కించే దర్శకుడిగా మధుర్‌ భండార్కర్‌కు మంచి పేరుంది. ప్రస్తుతం ఈయన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా ప్రతి సంవత్సరం రూపొందించే 'కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌' ఇతివృత్తంగా ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమాలో స్విమ్‌ సూట్‌ సీన్స్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉండబోతోంది.

Photo:Five hot ‘Calendar’ girls

ప్రతి సంవత్సరం బికినీ భామలతో రూపొందించే ఈ క్యాలెండర్‌కు గ్లామర్‌ ప్రపంచంలో మంచి పేరుంది. స్విమ్‌ సూట్‌ అందగత్తెలతో మలిచే ఈ క్యాలెండర్‌ ద్వారా మాల్యా తన వ్యాపారానికి ప్రచారం చేసుకోవడంతో పాటు ఆ సుందరాంగులకు మెరుగైన మోడలింగ్‌తో పాటు వీరు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించే అవకాశాన్ని ఇస్తుంటారు.

విజయ్‌ మాల్యా ఈ కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌పై మెరిసిన తరువాతే దీపికా పదుకొనె, కత్రినా కైఫ్‌ వంటి హీరోయిన్లు సినిమా అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ప్రస్తుతం వారు సినీ వినీలాకాశంలో ఏ స్థాయిలో వెలిగిపోతున్నారో అందరికీ తెలిసిన విషయమే. అందుకే దీనికంతటికీ సూత్రధారి అయిన మాల్యా జీవితం కూడా ఈ చిత్రంలో చోటుచేసుకోవచ్చు.

English summary
Here comes his “Calendar Girls” first look, we mean second look, where the faces of all the lead bikini girls is revealed. All these hot girls clad in skimpy two piece bikinis are freshers and happening models in fashion industry. The movie is said to be shot in just 45 days while Madhur Bandarkar took 2 years to finish the script and 6 months to train his actors.
Please Wait while comments are loading...