twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'శ్రీమంతుడు' స్టైల్ లో సైకిల్ పై వినాయకుడు (ఫొటో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : బాహుబలి చిత్రం ప్రేరణతో వినాయకుడు విగ్రహాలు రెడీ చేసినట్లే 'శ్రీమంతుడు' స్టైల్ లో వినాయకుడు విగ్రహాలు సైతం వచ్చాయి. అలాంటి ఫొటో ఒకటి ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఎక్కడ చూసినా కనపడుతోంది. మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు'. మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌‌పై తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 7న విడుదలై హిట్ టాక్‌తో వెళ్తోంది.

    తమ ఊరుని దత్తత తీసుకొని బాగుపరచడమనే ఓ సామాజిక సందేశంతో ముడిపడి ఉన్న సినిమా తీసినందుకు ఇప్పటికే వెంకయ్య నాయుడు, కేటీఆర్ లాంటి రాజకీయ ప్రముఖులు మహేష్‌ను కొనియాడిన విషయం తెలిసిందే.

    రీసెంట్ గా ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేరిపోయారు. ‘శ్రీమంతుడు' సినిమాను చూసిన తర్వాత ఆయన తన ట్విట్టర్ ఎకౌంట్‌ను వేదికగా చేసుకొని మహేష్‌ను అభినందించారు.

    Photo: Ganesha idle As Srimanthudu

    "మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమా చూశా. మనకు ఎంతో ఇచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వడమనే విషయాన్ని చాలా బాగా చెప్పారు. స్మార్ట్ విలేజ్ అంటూ మనం చేపట్టిన కార్యక్రమాన్ని ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంది" అంటూ తెలిపారు. ఇక చంద్రబాబు అభినందనలకు మహేష్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ థ్యాంక్స్ తెలిపారు.

    మరో ప్రక్క 'శ్రీమంతుడు' విజయోత్సవాన్ని అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెల 24న ఈ కార్యక్రమం జరగనుంది.

    చిత్ర నిర్మాత యలమంచిలి రవిశంకర్‌ విజయవాడలో మాట్లాడుతూ ''మహేష్‌బాబు ఆసక్తి మేరకు విజయోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. మహేష్‌ సినిమాలకు న్యూజెర్సీలో భారీ స్పందన లభిస్తోంది. అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలకు వినోదాన్ని పంచాలనే ఉద్దేశంతో వేడుకలను అక్కడ నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలకు మహేష్‌బాబు, శ్రుతి హాసన్‌, జగపతిబాబు, దేవిశ్రీప్రసాద్‌తోపాటు చిత్ర యూనిట్ హాజరవుతుంది''అని చెప్పారు.

    Photo: Ganesha idle As Srimanthudu

    మహేశ్‌బాబు అభిమానులు న్యూజెర్సీలో ఎక్కువగా ఉన్నారని అందుకే ఈ వేడుకలను అక్కడ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో సుమారు 3 వేల మంది తెలుగువారు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ "ఈ సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని మేం కష్టపడిన దానికంటే ఎక్కువ సక్సెస్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద హిట్ చేసిన ఫ్యాన్స్‌కి మా టీమ్ తరఫున స్పెషల్ థ్యాంక్స్. '' అన్నారు.

    నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ "మా బ్యానర్‌లో నిర్మించిన మొదటి సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ ఇది. మహేశ్, కొరటాల శివ గారికి స్పెష్ థాంక్స్. రాజకీయనాయకులు, స్పోర్ట్స్ పర్సన్స్, స్టార్స్ అందరూ ఈ చిత్రాన్ని చూశారు. ఈ వారంలో సచిన్ టెండూల్కర్ కూడా చూస్తానన్నారు. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్‌కు చాలా చాలా థ్యాంక్స్'' అని అన్నారు.

    జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

    English summary
    Following the trend now is Ganesha as Srimanthudu.Ganesh idol after Superstar Mahesh Babu's popular still on his bicycle from Srimanthudu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X