For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిజ జీవితంలో కుండలు చేస్తూ హన్సిక(ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : హన్సిక లాంటి సుకుమారి కుండలు చేయటం ఏంటి...అయినా ఏదో సినిమా సీన్ కోసం అయ్యింటుంది...నిజ జీవితంలో ఆమెకు అంత అవసరం ఏమిటి..అంత సీన్ ఉండదు అనుకుంటున్నారా...అదేమీ కాదు..ఆమె నిజంగానే రిపబ్లిక్ డే జనవరి 26 న నిజంగానే కుండలు చేసింది. ఇదిగో ఇలా ముంబైలో కుండలు చేసి తను దత్తత తీసుకున్న పిల్లలకు గిప్ట్ గా ఇచ్చింది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఈమె ఇప్పటివరకూ 25 మంది పిల్లలను దత్తత తీసుకుంది. ప్రతీ పుట్టిన రోజుకూ అనాధలైన పిల్లలను దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా చూస్తూంటుంది. అయితే ఆమె దీనికి పబ్లిసిటీ చేసుకోదు. తను సంపాదించిన సొమ్ములో కొంత ఇలా ఖర్చుపెడుతూంటుంది. అంతే కాకుండా ఇలా సరదాగా వారితో అప్పుడప్పుడూ ఖాళీ దొరికినప్పుడల్లా గడుపుతూంటుంది.

  Photo:Hansika preparing clay pots

  అమ్మాయిలు సుకుమారులు అంటుంటారు... నేనైతే మరీ సున్నితం అంటోంది హన్సిక. తెలుగు, తమిళం అంటూ రెండు చోట్లా చక్కర్లు కొడుతోంది హన్సిక. ఎక్కడ మంచి పాత్ర దొరికితే.. అక్కడ నేనుంటా - అని చెబుతోంది.

  తన మనస్తత్వం గురించి ప్రస్తావిస్తూ ''నేను పువ్వులాంటిదాన్ని. నా మనసు కూడా అంతే సుకుమారం. చిన్న చిన్న విషయాలకే కదిలిపోతా. కన్నీళ్లు పెట్టుకొంటా. 'నువ్వు మరీ ఇంత సెన్సిటీవ్‌గా ఉండకూడదు..' అని స్నేహితులు చెబుతుంటారు. కానీ.. నేను మాత్రం మారడం లేదు. నా చుట్టుపక్కల చిన్న తప్పు జరిగినా తట్టుకోలేను'' అంటోంది.

  ''తెరపై ఇప్పటి వరకూ అల్లరి పిల్ల పాత్రలు చాలా చేశా. నిజానికి నాకు దొరికేవన్నీ అలాంటివే. కానీ బయట మాత్రం నా అల్లరెప్పుడూ హద్దుల్లోనే ఉంటుంది. మన సంతోషం మరొకర్ని బాధపెట్టకూడదన్నది నా సిద్దాంతం'' అని చెప్పుకొచ్చింది.

  ఇక ఆమె తాజా చిత్రాల విషయానికి వస్తే...

  Photo:Hansika preparing clay pots

  తెలుగులో ఎలా ఉన్నా...తమిళంలో హన్సిక దూసుకుపోతోంది. ఆమె సినిమాలు అక్కడ బాగానే మార్కెట్ అవుతూండటంతో స్టార్ హీరోలు సైతం ఆమె వైపు చూస్తున్నారు. తాజాగా ఆమె విజయ్ సరసన ఓ చిత్రంలో చేస్తోంది. ఆమె చేస్తున్న పాత్ర ఓ యువరాణి అని తెలుస్తోంది. ఈ విషయాన్ని హన్సిక స్వయంగా ట్విట్ ద్వారా ఖరారు చేసింది. ఇందుకోసం ఆమె కత్తి సాము వంటివి కూడా నేర్చుకుంటున్నట్లు ఉత్సాహంగా చెప్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

  'ఇలయ తలబది' విజయ్‌ హీరోగా నటించిన 'కత్తి' ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ప్రస్తుతం ఆయన శింబుదేవన్‌ దర్శకత్వంలో కొత్త సినిమాలో నటిస్తున్నారు. దీనికి పలు పేర్లు పరిశీలించినా.. చివరకు 'గరుడ'ను ఎంచుకున్నట్లు తాజా సమాచారం. ఇందులో అలనాటి అందాల తార శ్రీదేవి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. విజయ్‌కి జంటగా శ్రుతిహాసన్‌, హన్సిక నటిస్తున్నారు.

  ఇప్పటికే విజయ్‌, హన్సిక జోడీగా 'వేలాయుధం'లో సందడి చేశారు. చరిత్ర కథాంశంతో దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 'అపూర్వ సహోదరులు'లో కమల్‌ పోషించిన మరుగుజ్జు తరహా పాత్రలో ఆయన కనిపించనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

  హన్సిక రాణి పాత్ర పోషిస్తున్నారని.. ఆమెపై కత్తిసాము పోరాట సన్నివేశాలను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం ఏ మేరకు విజయ్‌ అభిమానులను ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సిందే. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇది విజయ్ 58వ చిత్రం. ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.

  ఇక హన్సిక ఓ హీరోయిన్‌గా మాత్రమే మనకు తెలుసు. ఆమె ఓ పెయింటర్‌గానూ రాణించారనే విషయం చాలా మందికి తెలియదు. తమిళం, తెలుగు భాషల చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె సమయం ఉన్నపుడల్లా పెయింటింగులు గీస్తున్నారు. ఈమె రూపొందించిన కృష్ణా- రాధా పెయింటింగు రూ.15 లక్షలు పలికింది. ఇప్పటికే అనాధ పిల్లలను దత్తత తీసుకొన్న హన్సిక త్వరలో వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకు పెయింటింగుల ద్వారా నిధులు సమకూర్చాలని నిర్ణయించారు. ఆమె గీసిన చిత్రాలతో త్వరలో ఓ ప్రదర్శన నిర్వహించనున్నారు.

  English summary
  Above is the picture of Hansika preparing clay pots.Till now Hansika adopted 25 children.Well, she never tried for any publicity for her acts. That is really making her a role model for entire film industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X