»   » ఫొటో: అటు అమ్మతో ఇటు కొడుకుతో కలసి మహేష్ బాబు నడక

ఫొటో: అటు అమ్మతో ఇటు కొడుకుతో కలసి మహేష్ బాబు నడక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సూపర్ స్టార్ అయినా ఓ అమ్మకు కొడుకే. అలాగే మహేష్ బాబు కు మొదటి నుంచీ కుటుంబం అంటే పంచ ప్రాణాలు. తన తండ్రి కృష్ణ గారు అంటే ఎంత ప్రాణం పెడతారో, తన తల్లి తో అంత కన్నా ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేస్తూంటారు. ఈ ఫొటొనే చూడండి...అటు తల్లి ఇందిరని ఓ చేత్తో పట్టుకుని, ఇటు కొడుకు గౌతమ్ తో కలిసి నడుస్తున్నారు. ఈ సంఘటన ... ఆదిశేషగిరిరావు కుమారుడు వివాహ నిశ్చితార్ధ పంక్షన్ లో చోటు చేసుకుంది. పూ

పూర్తి వివరాల్లోకి వెలితే....ఘట్టమనేని కుటుంబంలో పెళ్లి బాజా మోగనుంది. కృష్ణ సోదరుడు, ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, లలితా ప్రమీల దంపతుల కుమారుడు సాయి రాఘవ రత్నబాబు (బాబీ), గెడ్డాడ దిలీప్‌కుమార్‌, సుచరిత దంపతుల కుమార్తె ప్రియాంక నిశ్చితార్థం సోమవారం హైటెక్స్‌లో వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, మహేశ్‌బాబు, హరికృష్ణ, కల్యాణ్‌రామ్‌, నారా రోహిత్‌, లోకేశ్‌తోపాటు మరెందరో సినీ ప్రముఖులు హాజరై వధూవరులకు ఆశీస్సులు అందజేశారు. ఈ ఏడాది డిసెంబర్‌ 23న సాయి రాఘవ రత్నబాబు, ప్రియాంక వివాహం జరగనుంది.

ఇక మహేష్ తాజా చిత్రం విషయానికి వస్తే...

మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం'శ్రీమంతుడు'. శ్రుతి హాసన్‌ హీరోయిన్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సీవీఎమ్‌) నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సోషల్ మెసేజ్ తో కలిపిన కథ అని...కెమెరామెన్ మదీ అన్నారు. ఆయన ఓ తమిళ వెబ్ సైట్ తో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.

కెమెరామెన్ మది మాట్లాడుతూ...శ్రీమంతుడు చిత్రం ...సోషల్ మెసేజ్ తో కలిసిన యాక్షన్ చిత్రం అని అన్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ ల నడిచే. కథ అని అన్నారు. చిత్రంలో మిలియనీర్ అయిన మహేష్ బాబు...ఓ విలేజ్ ని దత్తత చేసుకుని..అక్కడ సమస్యలను ఎలా పరిష్కరించాడన్న దిసగా నడుస్తుంది.

ఇక ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని,టీజర్ ని ఇప్పటికే విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో సైకిల్‌పై స్త్టెలిష్‌గా కనిపిస్తున్న మహేష్‌ లుక్‌ కి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తికావోచ్చిన ఈ చిత్రం ఆడియో ని ఈ నెల 27న హైదరాబాద్ లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Photo : Mahesh walked with Mom & Son

మరో ప్రక్క ఈ చిత్రంలో మహేష్ వాడే సైకిల్ ఖరీదు ఎంత ఉండవచ్చు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమచారం ప్రకారం ఈ సైకిల్ ఖరీదు... మూడున్నర లక్షలు అని తెలుస్తోంది. ఈ సైకిల్... Canondale కంపెనీవారి Scalpel 29 మోడల్ లో త్రీ ఫ్రేమ్ కార్బన్ అని తెలుస్తోంది. ఇది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. ఈ సైకిల్ ఖరీదు... అక్కడ 5500$ అంటున్నారు. మహేష్ ఓ మిలియనీర్ అని ఈ సైకిల్ తో దర్శకుడు చెప్పాడంటున్నారు.

ఇక ఈ చిత్రంతో మహేష్‌బాబు నిర్మాతగా మారారు. జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 'శ్రీమంతుడు' సినిమాతోనే మహేష్‌ చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టారు. 'శ్రీమంతుడు' పోస్టర్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థతో పాటు, మహేష్‌బాబు నిర్మాణ సంస్థ లోగో కూడా ముద్రించారు. 'శ్రీమంతుడు' చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి... ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ ఇంతకు ముందు ప్రభాస్ కు 'మిర్చి'తో అదిరిపోయే విజయాన్ని అందించాడు... ఆ దిశగా ఆలోచిస్తే- మహేశ్ బాబుకు అంతకంటే మిన్నయైన విజయాన్ని కొరటాల శివ అందిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మైత్రీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న 'శ్రీమంతుడు' చిత్రం సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రమని యూనిట్ సభ్యులు చెబుతున్నారు... దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మహేష్‌బాబు అప్‌కమింగ్‌ మూవీ శ్రీమంతుడు టీజర్‌ ను ఆదివారం రిలీజ్‌ చేశారు. హీరో కృష్ణ బర్త్‌డే సందర్భంగా ఈ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. శ్రీమంతుడు మూవీపై మహేష్‌ అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ ను శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై మిత్రులు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్‌లు సమష్టిగా 'మిర్చి' ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. 'ఆగడు' తర్వాత చాలాకాలంగా తెరపై కనిపించని మహేశ్ ఫస్ట్‌లుక్‌కు సహజంగానే అభిమానుల నుంచి విశేషస్పందన లభించింది. ఇప్పుడు టీజర్ ను కూడా రిలీజ్ చేయడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.

English summary
Seen here in this picture are Mahesh and his mother Indira Devi and son Gautham Krishna.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu