twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫొటో :నిమ్మకూరులో నందమూరి హీరో

    By Srikanya
    |

    హైదరాబాద్ :'పటాస్' సక్సెస్ టూర్ లో భాగంగా నందమూరి కళ్యాణ్ రామ్ నిమ్మకూరు చేరుకున్నారు. నిమ్మకూరు..తెలుగుదేశం పార్టీ వ్యవస్దాపకుడు, మాజీ ముఖ్యమంత్రి , తెలుగు వారు గర్వించదగ్గ నటుడు అయిన నందమూరు తారక రామారావు గారి జన్మస్దలం. అక్కడ బసవతారకం, ఎన్టీఆర్ విగ్రహాలు వద్ద యూనిట్ మెంబర్స్ తో కలిసి నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇలా ఆయన్ను తలుచుకుంటూ ఫొటో దిగారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
    నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ పతాకంపై అనిల్‌ రావిపూడి దర్శకుడిగా నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించి, నిర్మించిన సినిమా ‘పటాస్‌'. ఇటీవల విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా కళ్యాణ్‌రామ్‌ విజయ యాత్రలు చేస్తున్నారు.

    కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..‘‘ తమ్ముడు జూనియర్‌ ఎన్టీఆర్‌, బాబాయ్‌ బాలకృష్ణతో మల్టీస్టారర్‌ చిత్రంలో నటిచండానికి నేను సిద్ధంగా ఉన్నాను'',అన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి చిత్ర యూనిట్‌ విజయయాత్రను నిర్వహిస్తోంది. 31న మార్నింగ్‌ షోకి నెల్లూరు, మ్యాట్నీకి ఒంగోలు, సాయంత్రం 4.30కి చిలకలూరిపేట, 6గంటలకు గుంటూరు, రాత్రి 9 గంటలకు తెనాలిలో ‘పటాస్‌' ఆడుతున్న థియేటర్లకు చిత్ర బృందం వెళ్లింది. అలాగే ఫిబ్రవరి 1న మార్నింగ్‌ షోకి గుడివాడ, మ్యాట్నీకి మచిలీపట్నం థియేటర్లకు వెళ్ళిం సాయంత్రం విజయవాడ సిద్ధార్థ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగే ‘పటాస్‌' విజయోత్సవసభలో చిత్ర యూనిటంతా పాల్గొన్నారు. పటాస్‌ తరువాత ‘షేర్‌' అనే సినిమాలో నటిస్తున్నట్లు ఆయన చెప్పారు.

    Photo: Nandamuri Kalyan Ram at Nimmakur!

    ఈ చిత్రం మార్నింగ్ షో కే హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. సినిమా విడుదల రోజు నుండే మౌత్ టాక్ బావుండటం, రివ్యూలు కూడా అనుకూలంగా రావడంతో కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్ల విషయంలో సత్తా చాటింది. కళ్యాణ్ రామ్ కెరీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం తొలివారం వరల్డ్ వైడ్ రూ. 13 కోట్లకుపైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.

    చిత్రం కథేమిటంటే.... కళ్యాణ్ సిన్హా (కళ్యాణ్ రామ్) ఓ కరప్టడ్ పోలీస్ ఆఫీసర్. కావాలని హైదరాబాద్ ట్రాన్సఫర్ చేయించుకుని వచ్చిన అతను అక్కడ తన అధికారం ఉపయోగించి... సిటీలో లంచాలు,దందాలు చేస్తూంటాడు. అంతేకాదు హైదరాబాద్ డిజిపి కృష్ణ ప్రసాద్(సాయి కుమార్)కు,పోలీస్ డిపార్టమెంట్ కు శతృవైన విలన్ జీకె(అశుతోష్ రానా)కు తొత్తులా మారతాడు. అయితే అసలు కళ్యాణ్ సిన్హా ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు... అతని గతం ఏమిటి...గతంలోని అసలు నిజం తెలిసిన అతను మంచివాడిగా మారి... విలన్ కు ఎలా పటాస్ లా మారి ట్విస్ట్ లు ఇస్తాడు...ఈ కథలో హీరోయిన్ పాత్ర ఏమిటి...సునామీ స్టార్ గా ఎమ్.ఎస్ నారాయణ పాత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

    అనీల్ రావి పూడి మాట్లాడుతూ... ''ఒక మాస్‌ కథతో దర్శకుడిగా పరిచయమైతే ఆ ప్రభావమే వేరుగా ఉంటుంది. ఆ విషయంలో వి.వి.వినాయక్‌గారే స్ఫూర్తి. దర్శకుల్లో వి.వి.వినాయక్‌ గారంటే ఇష్టం. ఆయన తీసిన తొలి సినిమా 'ఆది' స్ఫూర్తితోనే నేను 'పటాస్‌'లాంటి ఓ మాస్‌ కథని రాసుకొన్నా.అందుకే ఎన్ని ఇబ్బందులెదురైనా ఎంతో ఇష్టంగా రాసుకొన్న మొదటి కథతోనే సినిమా తీశా'' అన్నారు అనిల్‌ రావిపూడి.

    తన ప్రస్దానం వివరిస్తూ... ''ఇంజినీరింగ్‌ అయ్యాక దర్శకుడు కావాలనే పరిశ్రమలోకి అడుగుపెట్టాను. సహాయ దర్శకుడిగా, రచయితగా పలు చిత్రాలకు పనిచేశాను. 'శంఖం', 'శౌర్యం', 'దరువు', 'కందిరీగ', 'అలా మొదలైంది', 'మసాలా', 'ఆగడు' తదితర చిత్రాలు రచయితగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 2012లో పక్కాగా మాస్‌ అంశాలతో కూడిన కథ రాసుకొని కల్యాణ్‌రామ్‌గారికి వినిపించాను. ఆయన అప్పుడు 'ఓం' చేస్తున్నారు. మొదట కథ విన్నాక 'చాలా బాగుంది. వేరే హీరోతో ఈ సినిమా నేను నిర్మిస్తా' అన్నారు. 'ఈ కథలో మీరు నటిస్తే బాగుంటుంది, నన్ను నమ్మండి' అని చెప్పా. దీంతో ఆయన ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నారు'' అన్నారు.

    సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సర్వేశ్‌ మురారి, ఎడిటింగ్‌: తమ్మిరాజు, రచనా సహకారం: ఎస్‌.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్‌, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

    English summary
    The success tour of 'Patas' reached Nimmakur Unit Members posed for the cameras right in front of the statues of NTR & Basavatharam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X