»   » కమల్ ‘ఉత్తమ విలన్’ ఉగాది శుభాకాంక్షలు (పోస్టర్)

కమల్ ‘ఉత్తమ విలన్’ ఉగాది శుభాకాంక్షలు (పోస్టర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా ‘ఉత్తమ విలన్'. కమల్ హాసన్ ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ ని పూర్తి చేసి,తెలుగులో సైతం ప్రమోషన్ మొదలెట్టారు. అందులో భాగంగా రీసెంట్ గా చిత్రం మేకింగ్ వీడియోని విడుదల చేసారు. అలాగే ఇప్పుడు ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ ఓ పోస్టర్ ని విడుదల చేసారు. ఇక్కడ మీరు చూస్తున్న పోస్టర్ అదే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. క్లారిటీ ఇచ్చారు. ఉత్తమ విలన్ తెలుగు ఆడియోని మార్చి 28న రిలీజ్ చేసి, సినిమాని ఏప్రిల్ 10న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగులో ఈ సినిమాని సి కళ్యాణ్ రిలీజ్ చేయనున్నాడు. సుమారు 8 కోట్ల రూపాయలకి సి. కళ్యాణ్ ఈ సినిమా తెలుగు రైట్స్ ని సొంతం చేసుకున్నాడు. కమల్ హాసన్ హీరోగానే కాకుండా కథ - స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి రమేష్ అరవింద్ డైరెక్టర్. ఒక సినీ నటుడు జీవితం చుట్టూ తిరిగే ఈ కథలో రియల్ లైఫ్ మూవీ లెజెండ్స్ అయిన బాల చందర్, కె.విశ్వనాధ్ లు నటించారు. కమల్ హాసన్ సరసన పూజ కుమార్, ఆండ్రియా జెరెమియా హీరోయిన్స్ గా నటించారు. జిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఈ ఆల్బంలో మొత్తం 16 ట్రాక్స్ ఉన్నాయి.

Photo Story: Utthama Villains’ Ugadi Wishes

యువ సంచనలనం జిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఉత్తమ విలన్ ఆడియో రైట్స్ ని ఎరోస్ వారు ఫ్యాన్సీ అమౌంట్ కి సొంతం చేసుకున్నారు. ఇందులో కమల్ హాసన్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. అవే మలయాళంలో ఫేమస్ అయిన తెయ్యమ్‌ కళాకారుడిగా, మరొకటి సినిమా నటుడిగా కమల్‌హాసన్‌ కనిపిస్తాడు.

రమేష్ అరవింద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కె. బాలచందర్, పూజ కుమార్, ఆండ్రియా, పార్వతి, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తిరుపతి బ్రదర్స్ - రాజ్ కమల్ ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఇది కాకుండా కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2′ సినిమా త్వరలో విడుదల కానుంది.

ఈ చిత్రంలో కమల్ హాసన్ నటనకే పరిమితం కాకుండా...స్క్రిప్టు వర్క్, డైలాగ్స్ కూడా రాసారట. ఇందులో ఆయన పోషించిన ఉత్తమన్ అనే పాత్ర 8వ శతాబ్దానికి చెందిన డ్రామా యాక్టర్. మనోరంజన్ అనే పాత్ర 21 శతాబ్దానికి చెందిన సినిమా సూపర్ స్టార్ పాత్ర. ఈ రెండు పాత్రలను తనదైన రీతిలో కమల్ హాసన్ రక్తి కట్టించాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. కమల్‌తో కలిసి దక్షిణాదికే చెందిన మరో నలుగురు అగ్ర హీరోలు కూడా ఇందులో కనిపించనున్నారని సమాచారం.

English summary
On the eve of Ugadi makers have unveiled "Uttama Villain" poster of the film wishing best wishes on the telugu new year. Kamal appeared as an eighth century theatre artist in the poster.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu