»   » పవన్ డుమ్మా, ఉత్సాహంగా బాలయ్య (ఫోటోలు)

పవన్ డుమ్మా, ఉత్సాహంగా బాలయ్య (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దేశ 15వ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ నిన్న(మే 26) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుండి ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. వీరిలో పలువురు పలువురు సినీ స్టార్స్ కూడా ఉన్నారు. తెలుగు స్టార్స్‌లో పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందినా అనారోగ్యం కారణంగా ఆయన వెళ్లలేదు.

అయితే టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన నటుడు బాలకృష్ణ, ఇటీవల బిజేపీలో చేరిన నటుడు శివాజీ, బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, వివేక్ ఒబెరాయ్, హేమా మాలిని, ధర్మేంద్ర, వినోద్ ఖన్నా తదితరులు మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.

అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో బాలకృష్ణ

మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో బాలకృష్ణ


నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సినీ నటుడు బాలకృష్ణ. మే 26వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన తండ్రి సలీమ్ ఖాన్‌తో కలిసి హాజరయ్యారు. మోడీకి ఈ ఇద్దరు ఎంతో సన్నిహితులు అనే పేరుంది.

రాకేష్ రోషన్, హృతిక్ రోషన్

రాకేష్ రోషన్, హృతిక్ రోషన్


బాలీవుడ్ ప్రముఖ నిర్మాత రాకేష్ రోషన్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

వివేక్ ఒబెరాయ్

వివేక్ ఒబెరాయ్


బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన దృశ్యం.

హేమా మాలిని

హేమా మాలిని


బాలీవుడ్ నటి హేమా మాలిని మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన దృశ్యం.

బప్పీ లహరి

బప్పీ లహరి

నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన బాలీవుడ్ నటుడు బప్పీ లహరి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బప్పీ లహరి బిజేపీ టికెట్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

శతృఘ్న సిన్హా

శతృఘ్న సిన్హా

దేశ 15వ ప్రధానికిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ శతృఘ్నసిన్హా.

హేమా మాలిని, ధర్మేంద్ర

హేమా మాలిని, ధర్మేంద్ర

బాలీవుడ్ దంపతులు హేమా మాలిని, ధర్మేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన దృశ్యం ఇక్కడ చూడొచ్చు. రాష్ట్రపతి భనవ్‌లో మే 26వ తేదీన సాయంత్రం ఈకార్యక్రమం జరిగింది.

వినోద్ ఖన్నా

వినోద్ ఖన్నా

బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. మెడీకి సన్నిహితంగా ఉండే సినిమా స్టార్లలో వినోద్ ఖన్నా ఒకరు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

దేశ 15వ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

English summary
Narendra Modi sworn in as the new Prime Minister of India at a grand ceremony held at the Rashtrapati Bhawan in Delhi today (May 26).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu