»   »  'ఆగడు' : లొకేషన్ లో మహేష్, తమన్నా (ఫొటోలు)

'ఆగడు' : లొకేషన్ లో మహేష్, తమన్నా (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు తాజా చిత్రం 'ఆగడు' . ట్రేడ్ వర్గాల్లో మంచి క్రేజ్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం షూటింగ్ ప్రస్తుతం లడఖ్ లోజరుగుతోంది. అక్కడో పాటని చిత్రీకరిస్తున్నారు.

ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు. 'ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్‌, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు.

14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. వివిధ సందర్బాల్లో మహేష్, తమన్నా, శ్రీను వైట్ల ఫొటోలు ఈ చిత్రం లొకేషన్ లో బయిటకు వచ్చాయి. వీటిలో కొన్ని కొత్తవి, కొన్ని ఇంతకు ముందు మీరు చూసినవే. ఇవన్నీ ఒకే చోట మీకు అందిస్తూ ఈ ఫోటో పీచర్...

స్లైడ్ షోలో మహేష్, తమన్నా ల జోడి ని తిలకించండి..

'దూకుడు' మీద ఉన్నాడు

'దూకుడు' మీద ఉన్నాడు

'దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి.

వినోదం మెయిన్ ఎట్రాక్షన్

వినోదం మెయిన్ ఎట్రాక్షన్

మహేష్‌ శైలి వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. శ్రీను వైట్ల కామెడీ ఎంటర్టైన్మెంట్ కి లోటు ఉండదని చెప్తున్నారు.

రెచ్చిపోయి.

రెచ్చిపోయి.

ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. గతంలోనూ మహేష్ చిత్రాలకు సంగీతం అందించిన తమన్ తన రికార్డుని ఈ చిత్రంలో బ్రద్దలు కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు.

లేరు కానీ..

లేరు కానీ..

ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... ‘ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. అయినా ఖచ్చితంగా హిట్ కొడతానంటున్నాడు.

అదే బ్యానర్..

అదే బ్యానర్..

14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో ‘దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో ‘ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల,నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు.

టీజర్ విడుదల

టీజర్ విడుదల

మహేష్ తండ్రి గారైన సూపర్ స్టార్ కృష్ణ జన్మదినమైన ఈ నెల 31న 'ఆగడు' సినిమా ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్నారు .

ఆడియో విడుదల

ఆడియో విడుదల

మహేష్‌ జన్మదినమైన ఆగస్టు 9న పాటలను విడుదల చేసేందుకుప్రయత్నాలు చేస్తున్నారు.

దినేష్ మాస్టర్ తో..

దినేష్ మాస్టర్ తో..

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ లడఖ్‌లో జరుగుతోంది. హీరో,హీరోయిన్స్ పై పాటను చిత్రీకరిస్తున్నారు. దినేష్‌ మాస్టర్‌ నృత్య రీతులు సమకూరుస్తున్నారు.

షెడ్యూలు..

షెడ్యూలు..

ఈ నెల 30 వరకు లడఖ్‌లో చిత్రీకరణ ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుపుతాం

కొన్ని టెన్షన్ లు..

కొన్ని టెన్షన్ లు..

మెదట కోన వెంకట్, గోపీ మోహన్ ఈ ప్రాజెక్టు లో లేకపోవటం, తర్వాత ప్రకాష్ రాజ్ సైతం ప్రాజెక్టు కు బై చెప్పటం మహేష్ బాబుని ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పుకుంటున్నారు.

ఎక్కువ శ్రద్ద

ఎక్కువ శ్రద్ద

ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన 1 , నేనొక్కడినే చిత్రం డిజాస్టర్ కావటం కూడా ఆయన్ను ఈ ప్రాజెక్టుపై ఎక్కువ కాన్సర్టేట్ చేసేలా చేస్తోంది

ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా

ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా

'ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. పోలీస్ డ్రస్ ఆయనకు కలిసిరావటం తెలిసిన విషయమే

విడుదల తేదీ

విడుదల తేదీ

దసరా కానుకగా సెప్టెంబర్ 26న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

కాపీ రూమర్స్

కాపీ రూమర్స్

ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు బాలీవుడ్ సూపర్ హిట్ ‘స్పెషల్ చభ్బీస్ 'చిత్రం నుంచి లిఫ్ట్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఆ చిత్రంలో హైలెట్ గా నిలిచిన రెండు ఎపిసోడ్స్ కొద్దిపాటి మార్పులతో ఈ చిత్రంలో ఉంటాయని చెప్పుకుంటున్నారు.

ప్రేరణతో ...

ప్రేరణతో ...

‘ఆగడు'లో మహేష్ పాత్ర నానా పటేకర్...అబ్ తక్ చప్పన్ చిత్రంలో చేసిన ఎనకౌంటర్ స్పెషలిస్ట్ ప్రేరణతో ఉంటుందని సమాచారం.

అనంతపూర్ బ్యాక్ డ్రాప్

అనంతపూర్ బ్యాక్ డ్రాప్

ఈ పాత్ర పేరు...ఎనకౌంటర్ శంకర్ అని, అనంతపూర్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని, చాలా పరవ్ ఫుల్ గా ఈ పాత్రను డిజైన్ చేసారని, అయితే ఆ కథ సీరియస్ గా జరిగితే ఈ సారి..ఫన్ తో నడుస్తుందని ఫిల్మ్ సర్కిల్స్ లోచెప్పుకుంటున్నారు.

స్లాంగ్ మారింది

స్లాంగ్ మారింది

‘దూకుడు'లో తెలంగాణ శ్లాంగ్‌తో అలరించిన ప్రిన్స్.. ‘ఆగడు'లో రాయలసీమ యాసలో మెప్పిస్తారని వినికిడి.

తమన్నా..

తమన్నా..

హీరోయిన్ గా చాలా మందిని అనుకుని తమన్నాని ఖరారు చేశారు. ఈ చిత్రం సెట్స్ పై ఆమె స్వీట్స్ అమ్ముతూ కనిపించింది. ఆమె ఈ చిత్రంలో పోలీస్ పాత్రను పోషిస్తోందని వినికిడి. మరి ఈ స్వీట్స్ అమ్మటానికి,పోలీస్ పాత్రకు సంభంధం ఏమిటనేది తెరపైన చూడాల్సిందే.

రాజేంద్రప్రసాద్

రాజేంద్రప్రసాద్

అల్లు అర్జున్ సూపర్ హిట్ జులాయి లో చేసి మురిపించిన కామెడీ కింగ్ మరో పెద్ద హీరో సినిమాలో కనిపించనున్నారు. మహేష్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న ఆగడు చిత్రంలో ఆయన హీరో కి తండ్రిగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఫన్,సెంటిమెంట్ కలగలపిన పాత్రలో రాజేంద్రప్రసాద్ ని దర్సకుడు చూపించనున్నారని చెప్పుతున్నారు.

డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం

డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం

డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కో-డైరెక్టర్: చలసాని రామారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
The shoot of 'Aagadu' has been currently progressing at a brisk space in Ladakh (Jammu and Kashmir).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu