»   » నటుడు నాజర్ కొడుకు సీరియస్ (యాక్సిడెంట్ ఫోటోలు)

నటుడు నాజర్ కొడుకు సీరియస్ (యాక్సిడెంట్ ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దక్షిణాది నటుడు నాజర్ తనయుడు ఫైజల్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయ పడ్డాడు. ప్రస్తుతం అతను చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందని, మృత్యువుతో పోరాడుతున్నాడని తెలుస్తోంది. ఈరోజు(మే 22) ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

గురువారం ఉదయం తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోని మానవాయ్ విలేజ్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫైజల్ తన స్నేహితులతో కలిసి వోక్స్ వ్యాగన్ పోలో కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా...ఫైజల్‌తో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

ఈ విషయమై నటి కుష్భూ తన ట్విట్టర్లో స్పందిస్తూ...'నా స్నేహితుడి కుమారుడు భయంకరమైన యాక్సిడెంటుకు గురయ్యాడు. ప్రాణాలతో పోరాడుతున్నాడు. అతను తిరిగి కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను' అంటూ ఖుష్భూ తెలిపింది. యూటీవీ సౌత్ చీఫ్ థనంజయన్ గోవింద్ తన ట్విట్టర్లో స్పందిస్తూ...'నాజర్, కలీమా దంపతుల పెద్ద కుమారుడు యాక్సిడెంటుకు గురయ్యాడు. పరిస్థితి తీవ్రంగా ఉంది. అతను వేగంగా కోలుకోవాలని ప్రార్తిస్తున్నాను' అని ట్వీట్ చేసారు.

నటి రాధికశరత్ కుమార్ ఈ సంఘటన గురించి ట్వీట్ చేస్తూ...'నాజర్, కమిల్లా తనయులు ప్రమాదానికి గురి కావడం నన్ను బాగా డిస్ట్రర్బ్ చేసింది. వీరు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను' అంటూ ట్వీట్ చేసారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్లైడ్ షోలో చూడండి....

ప్రమాదానికి గురైన కారు

ప్రమాదానికి గురైన కారు

నాజర్ కుమారుడు ఫైజల్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంటుకు గురైన ఇలా నుజ్జునుజ్జయింది.

ముగ్గురు మృతి

ముగ్గురు మృతి

ఈ ప్రమాదంలో ఇప్పటికే ముగ్గురు అక్కిడిక్కడే మృతి చెందారు. నాజర్ తనయుడితో పాటు మరో వ్యక్తి ప్రాణాలతో పోరాడుతున్నారు.

కారు నెంబర్...

కారు నెంబర్...

నాజర్ తనయుడు ఫైజల్ తన స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న కారు నెంబర్ ఇది. తమిళనాడు రిజిస్టర్ నెంబర్ కలిగి ఉంది.

ప్రమాద తీవ్రత

ప్రమాద తీవ్రత

ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో యాక్సిడెంటుకు సంబంధించిన ఈ ఫోటో చూస్తే స్పష్టమవుతుంది. పక్కనే మరో కారు ఉండటంతో రెండుకార్లు ఎదురెదురుగా ఢీకొన్నట్లు తెలుస్తోంది.

ఫైజల్

ఫైజల్

నాజర్ కుమారుడు ఫైజల్‌కు సంబంధించిన ఫోటో ఇది.

English summary
Actor Nassar's son Faizal has met with an accident earlier today (May 22). The incident has reportedly claimed three lives on spot.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu