For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రంగంలోకి సింగర్ సునీత, హాట్ లుక్ (ఫోటోలు)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: ప్లేబ్యాక్ సింగర్‌గా ఇంతకాలం తన గాన మాధుర్యంతో ఆకట్టుకున్న సింగర్ సునీతకు ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఆమెకు అనేక సినిమా అవకాశాలు వచ్చినా... ఒప్పుకోకుండా సింగర్ గానే కొనసాగుతూ వస్తున్నారు సునీత.

  సునీతతో నటింపజేస్తే సినిమాకు ప్లస్సవుతుందని భావించిన దర్శకుడు శేఖర్ కమ్ముల తన తాజా సినిమా 'అనామిక' కోసం ఆమెను ఒప్పించారు. 'అనామిక' చిత్రం ప్రమోషనల్ సాంగులో ఆమెతో నటింపజేసారు. ఇందుకు సంబంధించిన మ్యూజిక్ వీడియో ఏప్రిల్ 16న యూట్యూబులో విడుదల చేసారు. ఈ వీడియోకు మంచి స్పందన వస్తోంది.

  'క్షణం క్షణం' ఈ ప్రమోషనల్ సాంగుకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ రాసారు. పూర్తి మెలోడీగా సాగే ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్ చేసారు. సింగర్ దీపుతోకలిసి సునీత ఈ పాటకు తమ వాయిస్ ఇచ్చారు.

  సునీతకు సంబంధించిన ఫోటోలు, 'అనామిక' సినిమాకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

  అనామిక

  అనామిక

  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నయనతార కథానాయికగా నటిస్తున్న చిత్రం "అనామిక". హర్షవర్ధన్ రాణే, వైభవ్ కీలకపాత్రల్లో కనిపిస్తారు.

  నిర్మాణ సంస్థ

  నిర్మాణ సంస్థ

  వయాకామ్ 18-ఐడెంటిటీ మోషన్ పిక్చర్స్ - లాగ్‌లైన్ పిక్చర్స్ సంస్థలు తొలిసారిగా దక్షిణాదిలో ప్రవేశించి తెలుగు, తమిళంలో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  సెన్సార్ పూర్తి

  సెన్సార్ పూర్తి

  ఇటీవలె "అనామిక" చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్‌ను పొందింది.

  తెలుగు, తమిళంలో..

  తెలుగు, తమిళంలో..

  తమిళ వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగానే తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీగా సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

  నయనతార

  నయనతార

  ఈ చిత్రం కోసం నయనతార తనకు ఇష్టమైన కొన్నింటిని వదిలేసి ఎంతో కష్టపడి యాక్ట్ చేసింది.

  దాదాపుగా సినిమా మొత్తాన్ని

  దాదాపుగా సినిమా మొత్తాన్ని

  దాదాపుగా సినిమా మొత్తాన్ని రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరించారు. శేఖర్ కమ్ముల ఓల్డ్ సిటీ ముర్గీ మార్కెట్‌లో కూడా చిత్రీకరణ జరిపారు.

  కథాంశం

  కథాంశం

  భర్తను వెతుక్కొంటూ ఓ యువతి హైదరాబాద్‌ నగరంలో చేసిన పోరాటమే ఈ సినిమా. ఆమె ప్రయత్నం ఫలించిందా లేదా అనేది కీలకాంశం.

  హిందీ కహానీ

  హిందీ కహానీ

  హీందీలో హిట్టయిన 'కహానీ' చిత్రం కథకు పలు మార్పులు చేసి ఈ సినిమాని తెలుగులో తెరకెక్కించారు.

  నయనతార మాట్లాడుతూ..

  నయనతార మాట్లాడుతూ..

  స్త్రీ ప్రాధాన్యమున్న సినిమాలో నటించడం చాలా ఆనందాన్నిస్తోంది. అనామికగా కొత్త నయనతారని చూస్తారు. కహాని' సినిమాలో చాలా మార్పులు చేశారు. నా పాత్ర తీరుతెన్నులు కూడా మారాయి. నా శైలిలోనే నటించాను అన్నారు.

  మక్కీకి మక్కీ కాదు...

  మక్కీకి మక్కీ కాదు...

  ఎంత రీమేక్‌ అయినా మార్పులు, చేర్పులూ అవసరం. మక్కీకి మక్కీ తీస్తే చూడ్డానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఒక వేళ అలాంటి కథలే నాముందుకు వస్తే అంగీకరించను. శేఖర్‌ శైలి తెలుసు కాబట్టి, ఆయన మార్పులు నచ్చాయి కాబట్టి 'కహాని' ఒప్పుకున్నాను అన్నారు నయనతార.

  నటీనటులు, సాంకేతిక వర్గం

  నటీనటులు, సాంకేతిక వర్గం

  వైభవ్‌, పశుపతి తదితరులు నటిస్తున్నారు. సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ సి.కుమార్‌.

  హిట్టవుతుందనే అంచనాలు

  హిట్టవుతుందనే అంచనాలు

  ఎండర్ మోల్ ఇండియా, లాగ్ లైన్ ప్రొడక్షన్స్, సెలక్ట్ మీడియా హోల్డింగ్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్ తరహాలో ఇక్కడా హిట్ అవుతుందని భావిస్తున్నారు.

  యండమూరి

  యండమూరి

  ఈ చిత్రానికి ప్రముక నావెలిస్ట్ యండమూరి వీరేంద్రనాధ్ ఈ చిత్రానికి సహాయ రచయితగా పని చేస్తున్నారు. విజయ్ సి. కుమార్ సినిమాగ్రఫీ చేయనున్నారు.

  ఓల్డ్ సిటీ నేపథ్యం

  ఓల్డ్ సిటీ నేపథ్యం

  కహానీ చిత్రం కోల్ కతా బ్యాక్ డ్రాప్‌తో సాగుతుంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగిన విధంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.

  నయనతార హ్యాపీ

  నయనతార హ్యాపీ

  'చిత్ర పరిశ్రమలోకి నేను అడుగుపెట్టిన రోజులతో పోలిస్తే చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అప్పట్లో వాణిజ్య చిత్రాల్లో మాత్రమే అవకాశం దొరికేది. పాటలు, డ్యాన్సులతోనే గడిచిపోయేది. ఇప్పుడు మాత్రం హీరోయిన్ ని కూడా దృష్టిలో పెట్టుకొని పాత్రల్ని తీర్చిదిద్దుతున్నారు. ఇదొక మంచి పరిణామం'' అని చెప్పుకొచ్చింది నయనతార.

  English summary
  Singer Sunitha is known for her sweet voice and she has won million hearts with her melodious songs. Her girl-next-door looks have brought several offer to star in films, but she has always kept herself away from acting. Finally, she has come forward to make a special appearance in the promotional song of film Anamika. The music video of the track which released on YouTube on April 16, has garnered huge response from the film goers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X