»   » ఉపేంద్ర ‘బసవణ్ణ’ స్టన్నింగ్ లుక్ (ఫోటోలు)

ఉపేంద్ర ‘బసవణ్ణ’ స్టన్నింగ్ లుక్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కన్నడ నటుడు ఉపేంద్ర గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. విలక్షణమైన సినిమాలు తీసే ఈయన సినిమాల కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా ఉపేంద్ర కన్నడంలో 'బసవణ్ణ' అనే చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈచిత్రం ఫస్ట్ లుక్ అందరికీ ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే ఓ వివాదంలో ఇరుక్కునప్న ఈచిత్రం తాజాగా ఫస్ట్ లుక్ విషయంలో కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. మొదట ఈ చిత్రం టైటిల్ 'బసవణ్ణ' వివాదాని దారి తీసింది. ఈచిత్రం 12వ శాతాబ్దానికి చెందిన ఓ సామాజిక సేవకుడి కథ. దీంతో ఈ టైటిల్‌పై 'బసవణ్ణ' కులస్తులు అభ్యంతరం వ్యక్తం చేసారు.

తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ లో ఉపేంద్ర కత్తి పట్టుకుని ఉండటంతో మరోసారి వివాదం రాజుకుంది. సినిమాలో బసవణ్ణను అభ్యంతరకరంగా చూపించబోతున్నారనే ప్రచారం మొదలైంది. అయితే ఉపేంద్ర అభిమానులు మాత్రం ఇలాంటి వివాదాలే సినిమాకు ఎక్కువ ప్రచారం కల్పిస్తాయని సంతోషంగా ఉన్నారు.

ఈ చిత్రంలో పాత్రకు తగిన విధంగా శరీరాకృతి రావడం కోసం ఉపేంద్ర చాలా కష్టపడ్డట్లు స్పష్టం అవుతోంది. తాజాగా విడుదలైన పోస్టర్లో ఆయన శరీరాకృతి అందరినీ ఆకట్టుకుంటోంది. ఇలాంటి బాడీ షేప్ రావడం కోసం కొన్ని నెలల నుంచి కష్టపడుతున్నాడట ఉపేంద్ర.

ఎప్పుడూ పొడవాటి వెంట్రుకలతో కనిపించే ఉపేంద్ర ఈచిత్రంలో పాత్రకు తగిన విధంగా గుండుతో కనిపించబోతున్నాడు. ఫోటోలో అందుకు సంబంధించిన దృశ్యాన్ని చూడొచ్చు. ఈ ఫోటోను దర్శకుడు శ్రీనివాసరాజు తన సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్లో పోస్టు చేసాడు.

ఈ చిత్రంలో ఉపేంద్ర వేసుకునే కాస్ట్యూమ్స్ హైదరాబాద్ కు చెందిన కాస్ట్యూమ్ డిజైన్ బాబీ డిజైన్ చేసారు. లాస్ట్ వీక్ బెంగుళూరులో ఉపేంద్ర ఈ సినిమాకు సంబంధించిన ఫోటో షూట్లో పాల్గొన్నారు. ఉపేంద్ర న్యూ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రానికి దండుపాళ్యం చిత్ర దర్శకుడు శ్రీనివాసరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ....‘ఈ సినిమా స్టోరీకి తగిన విధంగానే బసవణ్ణ టైటిల్ పెట్టాం. కాంట్రవర్సీ సృష్టించాలనే ఉద్దేశ్యంతో మాత్రం కాదు' అని దర్శకుడు స్పష్టం చేసాడు.

English summary
Upendra's forthcoming movie Basavanna, which created a controversy when the first look of the movie was released, seems to be getting ready to hit the headlines for all wrong reasons again. Well. all signs of creating troubles are visible with the latest posters of the movie releasing on internet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu