»   » రవితేజ మరీ అంత బ్యాడ్ గానా,ఎక్కువ ఊహించుకునే ఇలా

రవితేజ మరీ అంత బ్యాడ్ గానా,ఎక్కువ ఊహించుకునే ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాల్లో పోలీస్ పాత్రల్లో ఈ మధ్యకాలంలో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా లక్ష్మీ నరసింహా, ఆ తర్వాత దబాంగ్ చిత్రాలు వచ్చాక హీరో పోలస్ అనగానే డిగ్నఫైడ్ లుక్ వదిలేసి, తిక్క తిక్కగా బిహేవ్ చేయటం ఎక్కువైంది. మామూలే హీరోలే ఇలా ఇష్టమొచ్చినట్లు పోలీస్ పాత్రలో చెలరేగిపోతూంటే, తెరపై తిక్క చూపిస్తూ నవ్విస్తూ,కవ్వించే రవితేజకు పోలీస్ పాత్ర వేస్తే ఎలా ఉంటుంది. పంబరేగిపోదూ.

అలాంటిది ఇప్పుడు స్పెషల్ గా బ్యాడ్ పోలీస్ పాత్రలో అని మరీ చెప్తున్నారు. అంటే ఇక బ్యాడ్ అనేదాన్ని ఎంత పరాకాష్టకు తీసుకువెళ్ళటానికి స్కెచ్ వేసారో, సీన్స్ రాసారో అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

పూర్తి వివరాల్లోకి వెళితే...మాస్ రాజా రవితేజ లేటేస్ట్ గా ఓ కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాచు. ఆ కొత్త సినిమాలో రవితేజ మరోసారి పోలీస్ గా , అదీ బ్యాడ్ పోలీస్ గా నటించబోతున్నట్లు వినికిడి. అంతేకాదు కొత్త దర్శకుడు విక్రమ్ సిరి ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడు. ఇతను పేరు ఎక్కడో విన్నట్లు ఉందే..ఎవరితను అంటారా...

అతనో స్టోరీ లైరటర్. ఇంతకు ముందు అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ 'రేసుగుర్రం'కి స్క్రీన్ ప్లే అందించాడు. ఈ నమ్మకంతోనే రవితేజ ఈ రైటర్ కి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. కొత్త సినిమాలో మాస్ మహరాజా బ్యాడ్ పోలీస్ గా కనిపించి, విలన్స్ కు బ్యాండ్ మోగించబోతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ చిత్రానికి వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నట్లు వినికిడి.

అంతేనా ఈ సినిమాకు మరో స్పెషాలిటీ ఉందిట. ఇందులో రవితేజ తనను తాను ఓవర్ గా ఊహించేసుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడట. గతంలో 'విక్రమార్కుడు', 'పవర్' మూవీస్ లో కూడా రవితేజ పోలీస్ పాత్రలు చేశాడు.

అయితే ఈ క్యారెక్టర్స్ కి ఇప్పుడు చేయనున్న కొత్త సినిమాలోకి క్యారెక్టర్ చాలా డిఫరెన్స్ ఉంటుందని చెప్తున్నారు. ఈ కొత్త సినిమాలోని క్యారెక్టర్ తెగ నచ్చడంతో వీలైనంత త్వరగా సినిమాను పట్టాలెక్కించాలని రవితేజ భావిస్తున్నాడట. మరి బ్యాడ్ పోలీస్ గా మాస్ రాజా ఎలా రప్పాడిస్తాడో చూడాలి అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

సాయి కుమార్

సాయి కుమార్

కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్ అంటు చెప్పిన డైలాగ్ ఇంకా ప్రేక్షకుల మదిలో మెదులుతూనే వుంది. అది సాయికుమార్ దమ్ము. ఆయన పోలీస్ స్టోరీని మర్చిపోవటం కష్టం.

రాజశేఖర్

రాజశేఖర్

నా దమ్ము అంతా నా పోలీస్ డ్రస్ లోనే వుంది. దాన్ని తాకాలంటే ఎదుటవాడికి దమ్ముండాలి. ఇదే రాజశేఖర్ పవర్ పుల్ మీసం కథ. అంకుశం చిత్రం రాజశేఖర్ కెరీర్ లో మర్చిపోలేని చిత్రం

రవి తేజ

రవి తేజ

జింతాక్ జిత జిత జింతాక్ తా..అంటూ ఓ పవర్ ని సృష్టించిన విక్రమార్కుడు ఈ మాస్ రాజా. ఆయన చేసిన పోలీస్ చిత్రాలు హిట్టే.

వెంకి

వెంకి

ఏ ఘర్షన నైనా సరే సమర్ధవంతంగా ఎదుర్కునే శత్రువు ఈ పోలీస్. దీనికి తిరుగులేదు అంటాడు ఈ సూర్య ఐ.పి.యస్. అయితే ఈ సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది. ఎందుకనో జనాలకు వెంకీ పోలీసు గా నచ్చలేదు.

రామ్ చరణ్

రామ్ చరణ్

పోలీస్ అంటే ఓ స్టైల్ వుండాలి. దానికి తుపాకీ వుంటేనే మజా వస్తుంది.అయితే రామ్ చరణ్ ..తుఫాన్ సినిమా వర్కవుట్ కాలేదు.

శింబు

శింబు

ఇంతకీ మీ కథ ఎంటీ, మీరు తేలుస్తారా లేకా నన్ను తేల్చమంటారా. దబాంగ్ తమిళ వెర్షన్ లో చేసిన శింబు.. ఆ చిత్రం డిజాస్టర్ అవ్వటంతో షాక్ అయ్యాడు.

చిరంజీవి

చిరంజీవి

రాం..పరశురాం...ఎస్.పి.పరశురాం. చేయ్య చూసావా ఎంత రఫ్ గా వుందో, నాతో పెట్టుకుంటే రఫ్ ఆడించేస్తా అంటూ చెప్పిన చిరంజీవి ఎస్పీ పరుశురాం ఫ్లాఫ్, హిందీలో ప్రతిబంద్ బాగానే ఆడింది.

అమీర్ ఖాన్

అమీర్ ఖాన్

అమీర్ పోలీస్ అధికారిగా చేసిన సర్ప్ రోష్ పెద్ద హిట్ చిత్రం ..గుర్తుండే ఉండి ఉంటుంది.

బాలయ్య

బాలయ్య

ఒకడు నాకు ఎదురోచ్చినా వాడికే రిస్క్, నేను వాడికి ఎదురొచ్చినా వాడికే రిస్క్. ఇంతే...అని చెప్పే బాలయ్య ...రౌడీ ఇన్సిపెక్టర్ చిత్రం పెద్ద హిట్. తర్వాత లక్ష్మి నరసింహా చిత్రం కూడా మంచి హిట్ అయ్యింది.

నరేష్

నరేష్

బ్లేడ్ బాబ్డీలో అల్లరి నరేష్ పోలీస్ గా కనిపిస్తాడు. నవ్విస్తాడు.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

సల్లు భాయ్ నటించిన దబాంగ్ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో మనకు తెలియంది కాదు..అదే కదా మన గబ్బర్ సింగ్.

పవన్

పవన్

రాసుకోరా సాంబా....లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరబ్బా. గబ్బర్ సింగ్ పెద్ద హిట్...మరి

ఎన్టీఆర్

ఎన్టీఆర్

దండయాత్ర..ఇది దయాగాడి దండయాత్ర అంటూ టెంపర్ తో రెచ్చిపోయిన ఎన్టీఆర్ ని మర్చిపోవటం కష్టమే.

సంపూ

సంపూ

నేను మూతి బిగించి..ఒక్కటిచ్చానంటే నీ పని అంతే అన్నట్లు చూస్తున్న సింగం 123 మంచి కలెక్షన్సే తెచ్చి పెట్టింది.

ఆకాశ్

ఆకాశ్

ఆకాష్ సైతం పోలీస్ అధికారిగా కనిపించాడు . కానీ ఆ సినిమా ఆడలేదు

మహేష్

మహేష్

దూకుడు, పోకిరి ఇలా మహేష్ పోలీస్ డ్రస్ వేస్తే హిట్టే అనుకుంటూంటే ఆగడు డిజాస్టర్ అయ్యి కూర్చుంది.

బ్రహ్మి

బ్రహ్మి

నేను నా గుర్రం...ఇది నా స్టైల్...మీరు గుర్తించారా నా పోరాట పటిమ అన్నట్లు చూసే బ్రహ్మి చాలా సినిమాల్లో పోలీస్ గా కనిపించారు. కొన్ని వర్కవుట్ అయ్యాయి.

సూర్య

సూర్య

తెరపై సింహంలో రెచ్చిపోయిన సింగం ..కలెక్షన్స్ తో అదరకొట్టింది. సింగం 2 కూడా అంత పేరు తెచ్చుకోకపోయినా బాగానే డబ్బు సంపాదించింది

విశాల్

విశాల్

గన్ తో గురి పెట్టగలను, కాలితో డోర్ తీయగలను...ఇది నా కెపాసిటి అన్నట్లుండే విశాల్..పోలీస్ గా చేసిన సెల్యూట్ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్

నేనుంటే నా స్టేషన్ కు కళే వేరు... అన్నట్లుండే కళ్యాణ్ రామ్ ..పోలీస్ గా చేసిన హరే రామ్ ఆడలేదు కానీ పటాస్ రికార్జ్ లు క్రియేట్ చేసి బ్రేక్ ఇచ్చింది.

శంకర్ నాగ్

శంకర్ నాగ్

ఈ కన్నడ హీరో చేసిన పోలీస్ చిత్రాలు అక్కడ బాగానే ఆడాయి. తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యాయి.

సుదీప్

సుదీప్

కెంపగౌడ..అదే సింగం రీమేక్ లో పోలీస్ గా సుదీప్ అదరకొట్టారు. రికార్డ్ లు క్రియేట్ చేసారు.

మనోజ్

మనోజ్

పాండవలు పాండవులు తుమ్మెద చిత్రంలో మంచు మనోజ్ ...పోలీస్ గా కనిపించి అలరిస్తారు. ఆ సినిమా కామెడీ పండించి బాగానే సొమ్ము చేసుకుంది

ప్రభాస్

ప్రభాస్

బహుశ నెక్ట్స సినిమాలో ఇలా కనిపించోచ్చు.

పోలీస్

పోలీస్

మళయాళ హీరో ఫృధ్వీరాజ్ చాలా సినిమాల్లో పోలీస్ గా కనిపించారు. విజయం సాధించారు.

శ్రీహరి

శ్రీహరి

పోలీస్ అంటే ఇలా ఉండాలి అన్నట్లు ఉండేవారు శ్రీహరి. ఆయన హీరోగా నటించిన సినిమాల్లో ఎక్కువ భాగం పోలీస్ పాత్రలే. వాటి సక్సెస్ రేటు కూడా ఎక్కువే.

నందమూరి తారక రామారావు

నందమూరి తారక రామారావు

1949 లో వచ్చిన మన దేశం చిత్రం అన్నగారి తొలి చిత్రం. అందులో ఆయన పోలీస్ గా కనిపిస్తారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో పోలీస్ గా కనిపించి అలరించారు. అవన్ని దాదాపు హిట్టే.

రేసు గుర్రం

రేసు గుర్రం

ఈ చిత్రంలో అల్లు అర్జున్ ..పోలీస్ గా కొద్ది సేపు కనిపించినా స్క్రీన్ ని అదరకొట్టి వదలుతాడు.

శ్రీకాంత్

శ్రీకాంత్

శ్రీకాంత్ కెరీర్ లో ఎన్నో సార్లు పోలీస్ డ్రస్ వేసారు. ఆయన కెరీర్ లో పెద్ద హిట్ ఆపరేషన్ దుర్యోధన, మొన్నటి టెర్రర్,రాబోతున్న మెంటల్ పోలీస్ ఇలా ..చాలా

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హీరో గా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ లో ఆయన పోలీస్ పాత్రలో కనిపించారు. ఆ సినిమా డిజాస్టర్ ఫలితం పొందింది

పోలీసోడు

పోలీసోడు

రీసెంట్ గా విజయ్ హీరోగా వచ్చిన పోలీసోడు చిత్రం జస్ట్ ఓకే అనిపించుకుంది.

ధృవ

ధృవ

సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తని ఒరువన్ రీమేక్ లో రామ్ చరణ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.

రానా

రానా

మంచి ఫిజిక్ తో ఉన్న రానా..పోలీస్ గెటప్ లో అదరకొడతాడు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.. ఏమంటారు. డిపార్టమెంట్ లో ఆల్రెడీ నటించారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.

English summary
Vikram Sirikonda has readied a subject for Ravi Teja and Ravi Teja is impressed with the story in which he will be seen as a bad police officer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu